Delhi Capitals vs Punjab Kings: ఐపీఎల్ 2023 సీజన్ 59వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట పంజాబ్ కింగ్స్ (PBKS) మొదట బ్యాటింగ్ చేయనుంది.
పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ ఎనిమిదో స్థానంలోనూ, ఢిల్లీ క్యాపిటల్స్ పదో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధిస్తే నెట్ రన్‌రేట్‌ను బట్టి ఐదో స్థానం వరకు చేరవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా గెలిచే తేడాను బట్టి ఆరో స్థానం వరకు చేరవచ్చు. అయితే ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే మాత్రం ఈ రెండు జట్లకూ ఈ విజయం చాలా కీలకం.
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్
ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
మనీష్ పాండే, రిపాల్ పటేల్, లలిత్ యాదవ్, చేతన్ సకారియా, అభిషేక్ పోరెల్
పంజాబ్ కింగ్స్ తుది జట్టు
ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శామ్ కరన్, సికందర్ రజా, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
నాథన్ ఎల్లిస్, అథర్వ టైడే, మాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, మోహిత్ రాథీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ -16వ సీజన్ లో పాయింట్ట పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో 8వ స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ నేడు అరుణ్ జైట్లీ స్టేడియంలో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ సీజన్‌లో పడుతూ లేస్తూ వస్తున్న పంజాబ్‌కు ప్లేఆఫ్స్ రేసులో ఇంకా ఛాన్స్ అయితే ఉంది. నేడు ఢిల్లీతో జరుగబోయే మ్యాచ్ తో పాటు తర్వాతి రెండు మ్యాచ్ లలో గెలిస్తే ఆ జట్టు టాప్ - 4లో ఫోర్త్ ప్లేస్ కోసం పోటీ పడొచ్చు.
ఐపీఎల్-16 లో 11 మ్యాచ్‌లు ఆడి ఐదు గెలిచిన పంజాబ్ కింగ్స్‌కు తమ ఖాతాలో 10 పాయింట్లున్నాయి. ఇంకా ఆ జట్టు ఢిల్లీతో మ్యాచ్ కాక మరో రెండు గేమ్స్ ఆడనుంది. మూడింట గెలిస్తే ఆ జట్టుకు 16 పాయింట్లు వస్తాయి. అప్పుడు ప్లేఆఫ్స్ రేసులో ఆర్సీబీ, లక్నోతో పాటు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండే జట్టుతో పోటీ పడొచ్చు. అయితే ఇది ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడి ఉంటుంది.
పంజాబ్ తరఫున కెప్టెన్ శిఖర్ ధావన్ రాణిస్తున్న మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ రెండు మూడు మ్యాచ్ లలో ధాటిగా ఆడి తర్వాత విఫలమయ్యాడు. గత మ్యాచ్ లో భానుక రాజపక్స తిరిగొచ్చినా నిరాశపరిచాడు. లియామ్ లివింగ్‌స్టోన్ భారీ ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. జితేశ్ శర్మ, షారుక్ ఖాన్ లు నిలకడగా ఆడుతుండటం పంజాబ్‌కు కలిసొచ్చేదే. సామ్ కరన్ కూడా ఓ చేయి వేస్తే ఆ జట్టుకు తిరుగుండదు. బౌలింగ్ లో అర్ష్‌దీప్ పవర్ ప్లే లో రాణిస్తున్నా డెత్ ఓవర్లలో విఫలమవుతున్నాడు. ఇది పంజాబ్‌కు ఆందోళన కలిగించేదే.