CSK vs KKR Chennai Super Kings target 138: చెపాక్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్(KKR)ను చెన్నై (CSK)తక్కువ పరుగులకే కట్టడి చేసింది. చెన్నై బౌలర్ల ధాటికి పరుగులు రావడమే గగనమైపోయింది. కోల్‌కత్తా బ్యాటర్లలో ఏ ఒక్కరు కూడా 35 పరుగులు కూడా దాటలేకపోయారు. చెన్నై బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 137 పరుగులకే పరిమితమైంది. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే మూడు వికెట్లు నేలకూల్చగా...రవీంద్ర జడేజా కూడా మూడు వికెట్లు తీశాడు. ముస్తాఫిజుర్ రెండు వికెట్లు తీశాడు.
పరుగుల రాకే గగనమైన వేళ..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కత్తా ఇన్నింగ్స్ తొలి బంతికే దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే కోల్‌కత్తా బ్యాటర్ ఫిల్ సాల్ట్‌ను తుషార్ దేశ్‌పాండే అవుట్ చేసి చెన్నైకు కోల్‌కత్తాకు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత సునీల్ నరైన్, రఘువంశీ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ జోడి తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించారు. ఆరు ఓవర్లలోనే 56 పరుగులు జోడించడంతో కోల్‌కత్తా కోలుకున్నట్లే కనిపించింది. కానీ ఆ తర్వాత వికెట్ల పతనం ఆరంభమైంది. పరుగులు రావడం కష్టం కావడంతో కోల్‌కత్తా బ్యాటర్లు భారీ షాట్లకు యత్నించి వికెట్లను సమర్పించుకున్నారు. సునీల్ నరైన్ 20 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 27 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుటయ్యాడు. 18 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సుతో 24 పరుగులు చేసిన రఘువంశీని కూడా రవీంద్ర జడేజానే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
56 పరుగుల వద్ద రఘువంశీ అవుటవ్వగా... 60 పరుగుల వద్ద సునీల్ నరైన్ పెవిలియన్ చేరాడు. స్వల్ప వ్యవధిలో క్రీజులో కుదురుకున్న వీరిద్దరూ అవుట్ కావడంతో కోల్‌కత్తా కష్టాల్లో పడింది. మరోసారి శ్రేయస్స్ అయ్యర్ రాణించాడు. పరుగుల రాక కష్టమైన వేళ అయ్యర్ సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. 32 బంతుల్లో 34 పరుగులు చేసి అయ్యర్ అవుటయ్యాడు. వెంకటేష్ అయ్యర్ 3, రణదీప్ సింగ్ 13, రింకూసింగ్ 9, అండ్రూ రసెన్ పది పరుగులు చేసి అవుటయ్యారు. భారీ ఆశలు పెట్టుకున్న రింకూసింగ్, అండ్రూ రసెల్ తక్కువ పరుగులకే అవుట్ కావడంతో కోల్‌కత్తా తక్కువ స్కోరుకే పరిమితమైంది. చెన్నై బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 137 పరుగులకే పరిమితమైంది. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే మూడు వికెట్లు నేలకూల్చగా...రవీంద్ర జడేజా కూడా మూడు వికెట్లు తీశాడు. ముస్తాఫిజుర్ రెండు వికెట్లు తీశాడు.
చెన్నై విజయాల బాట పట్టేనా..
వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్‌కింగ్స్ ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో గెలవాలని చూస్తోంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర పవర్‌ప్లేలో మరింత దూకుడుగా ఆడితే చెన్నై తేలిగ్గానే ఈ లక్ష్యాన్ని ఛేదించే అవకాశం ఉంది. శివమ్ దూబే 160.86 స్ట్రైక్ రేట్‌తో 148 పరుగులు చేసి మంచి టచ్‌లో ఉండడం చెన్నైకి కలిసిరానుంది.