అన్వేషించండి

CSK Captain Ruturaj Gaikwad Fined: CSKపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కఠిన చర్యలు- కెప్టెన్ గైక్వాడ్ పై భారీ జరిమానా 

గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు టీమ్ మెంబర్స్ అందరికీ భారీ ఫైన్ పడింది.

CSK Captain Ruturaj Gaikwad Fined 24 Lakhs for Slow Over Rate: ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రయాణం చేదు జ్ఞాపకంతో ముగిసింది. గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ టీమ్ చేతిలో 89 పరుగుల తేడాతో ఓడిపోయిన సీఎస్‌కే, ప్లేఆఫ్స్ రేసు నుండి అధికారికంగా నిష్క్రమించింది. ఈ ఘోర పరాజయం తర్వాత చెన్నై జట్టుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మరో షాక్ ఇచ్చింది. మ్యాచ్ లో నిర్ణీత సమయానికి ఓవర్ల కోటాను పూర్తి చేయనందుకు (Slow Over-Rate) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు రూ. 24 లక్షల భారీ జరిమానా విధించింది. ఈ సీజన్ లో చెన్నై జట్టుకు ఇది రెండో తప్పు కావడంతో కెప్టెన్‌తో పాటు ప్లేయింగ్ ఎలెవన్ లోని మిగతా ఆటగాళ్లందరిపైనా పెనాల్టీ పడింది.

Read Also: Phil Salt Return To RCB Team: ఆర్‌సీబీకి గుడ్ న్యూస్.. అందుబాటులోకి విధ్వంస‌క ఓవ‌ర్సీస్ ప్లేయ‌ర్..!

రెండోసారి రూల్స్ బ్రేక్ చేసిన చెన్నై.. 

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ 66 లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం కనీస ఓవర్ రేట్ నిబంధనను సీఎస్‌కే ఉల్లంఘించింది. అంతకుముందు లీగ్ లోని 18వ మ్యాచ్ లో కూడా ఈ టీమ్ ఇదే తప్పు చేసింది. రెండోసారి నిబంధనలు అతిక్రమించినందుకు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు రూ. 24 లక్షల ఫైన్ విధించగా, మ్యాచ్ ఆడిన మిగిలిన టీమ్ మెంబర్స్ అందరికీ, ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా ఒక్కొక్కరికి రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం (ఏది తక్కువైతే అది) జరిమానాగా ప్రకటించారు. ఈ మేరకు ఐపీఎల్ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Read Also: Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్ 

బ్యాటింగ్ లో ఘోర వైఫల్యం..

ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 230 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ పూర్తిగా విఫలమైంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పరుగులేమీ చేయకుండా గోల్డెన్ డక్‌గా అవుట్ కావడంతో జట్టు భారీ దెబ్బతింది. మిడిలార్డర్ బ్యాటర్ శివమ్ దూబే కేవలం 17 బంతుల్లో 47 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి కాసేపు ఆశలు రేకెత్తించినా, మిగతా ప్లేయర్స్ నుండి సపోర్ట్ లభించలేదు. దీంతో చెన్నై ఘోర పరాజయాన్ని చవిచూసి టోర్నమెంట్ నుండి అవుట్ అయింది.

భారీ మార్పులకు అవకాశం

ఈ పరాజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది లీగ్ నుండి నిష్క్రమించింది. లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై ఇంకా స్పష్టత రాని తరుణంలో, చాలా మంది కీలక ఆటగాళ్లు తమ ఫామ్‌ను నిరూపించుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఈ ఓటమి, ప్లేఆఫ్స్ రేసు నుండి తప్పుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి చెన్నై టీమ్ మేనేజ్‌మెంట్ జట్టులో భారీ మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. కొత్త బ్లూప్రింట్ తో జట్టును రీబిల్డ్ చేయడానికి సీఎస్‌కే యాజమాన్యం కసరత్తులు ప్రారంభించనుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shreyas Iyer Comeback Story: టీమ్‌లోనే చోటు లేదన్నారు.. ఇప్పుడు ఏకంగా కెప్టెనే అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కమ్‌బ్యాక్
ఆ..యా..షేర్..! టీమ్‌లో చోటు లేదన్నారు.. ఏకంగా కెప్టెన్ అయ్యాడు శ్రేయస్ 
Manav Suthar Test Debut: అఫ్గాన్ తో మ్యాచ్ లో డెబ్యూ చేసిన మానవ్ సుతార్ ఎవరు?: ప్లేయింగ్ ఎలెవెన్ లోకి గుజరాత్ టైటాన్స్ స్టార్.. 15 ఏళ్ల తర్వాత అశ్విన్, జడేజా లేకుండానే బరిలోకి..
అఫ్గాన్ తో మ్యాచ్ లో డెబ్యూ చేసిన మానవ్ సుతార్ ఎవరు?: ప్లేయింగ్ ఎలెవెన్ లోకి గుజరాత్ టైటాన్స్ స్టార్.. 15 ఏళ్ల తర్వాత అశ్విన్, జడేజా లేకుండానే బరిలోకి..
India T20I & Asian Games Squads: టీమ్ ఇండియా టీ20 స్క్వాడ్  ఎంపిక‌కు బీసీసీఐ ముహూర్తం: అంద‌రి ఫోక‌స్ శ్రేయస్, వైభవ్ సూర్యవంశీ పైనే..!
టీమ్ ఇండియా టీ20 స్క్వాడ్  ఎంపిక‌కు బీసీసీఐ ముహూర్తం: అంద‌రి ఫోక‌స్ శ్రేయస్, వైభవ్ సూర్యవంశీ పైనే..!
Shreyas Iyer News: టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
LPG Cylinder Price Hike: మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సామాన్యులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. నేడు హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Embed widget