Ayush Mhatre Retired Out: వికెట్ పడకున్నా CSK ఆయుష్ మాత్రేను ఎందుకు వెనక్కి పిలిచింది? సరికాదంటూ విమర్శలు
Ayush Mhatre Retired Out: యువ బ్యాటర్ ఆయుష్ మత్రేను రిటైర్డ్ అవుట్ చేయడంపై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం విమర్శల పాలైంది. మాత్రే 59 పరుగులతో రాణించాడు.

చెన్నై: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న 18 ఏళ్ల ఆయుష్ మాత్రే విషయంలో తీసుకున్న నిర్ణయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) విమర్శల పాలైంది. మాత్రే అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ, చెన్నై మేనేజ్మెంట్ అతడిని రిటైర్డ్ అవుట్ చేయాలని నిర్ణయించింది. అతడి స్థానంలో శివమ్ దూబే బ్యాటింగ్‌కు వచ్చి, చివరి ఓవర్లలో 10 బంతులు ఎదుర్కొని 20 పరుగులు చేశాడు. మాత్రే అద్భుతమైన ఆటతొ అర్ధ శతకం చేసినప్పటికీ, అతడిని రిటైర్డ్ అవుట్ చేయాలనే ఫ్రాంచైజీ నిర్ణయంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా ఒక ఆటగాడు పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నప్పుడు అతడిని రిటైర్డ్ ఔట్ చేస్తారు. కానీ మాత్రే 36 బంతుల్లో 59 పరుగులతో రాణించాడు. అయితే రిటైర్డ్ అవుట్ కావడానికి ముందు చివరి 3-4 బంతుల్లో మాత్రే సింగిల్స్ మాత్రమే తీశాడు. క్రీజులో సెట్ అయిన ఆయుష్ మాత్రే చివరి 2 ఓవర్లలో గేర్ మార్చి వేగంగా ఆడే ఛాన్స్ ఉన్నప్పటికీ, 18వ ఓవర్లోనే వికెట్ పడకుండానే అతడు పెవిలియన్ బాట పట్టాల్సి రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
212/2 is a worse score than 200/9. In a) you didn't optimize batting resources, in b) you did.
— Ramesh (@rmshnt27) April 11, 2026
Ruturaj trying to set a platform in 2026 is the biggest joke ever. Every batsman in the RCB top order tries to make 30(15).
ఆయుష్ మాత్రేకు ఇది ఈ సీజన్‌లో రెండో హాఫ్ సెంచరీ. అంతేకాకుండా ఈసారి ఆరెంజ్ క్యాప్ గెలిచే పోటీదారుల్లో ఒకడిగా టీమిండియా అండర్ 19 కెప్టెన్ మాత్రమే ఉన్నాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా రిటైర్డ్ అవుట్ చేయాలనే CSK నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అందుకే అభిమానులు సైతం సీఎస్కే నిర్ణయంపై ఫైర్ అవుతున్నారు. రిటైర్డ్ అవుట్‌ను కూడా వికెట్ కిందకే పరిగణిస్తారని తెలిసిందే.
సంజూ శాంసన్‌ను రిటైర్డ్ ఔట్ చేయాల్సిందా?
ఆయుష్ మాత్రేను రిటైర్డ్ అవుట్ చేసిన సమయానికి ముందు ఓపెనర్ సంజూ శాంసన్ కూడా పెద్దగా షాట్లు ఆడలేదు. ఒక దశలో 42 బంతుల్లో 89 పరుగులు చేసిన సంజూ అక్కడ నుండి సెంచరీ పూర్తి చేయడానికి 10 బంతులు ఆడాడు. అదే సమయంలో ఆయుష్ మాత్రే స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆల్ రౌండర్ శివమ్ దూబే 10 బంతుల్లో 20 పరుగులు చేశాడు.
Making Ayush Mhatre retired out is the worst decision, he is a youngster he'll lose his confidence does this team do the same thing if one big name player does the same thing?
— vinnuuu💙 (@vinnuverseeee) April 11, 2026
యంగ్ బ్యాటర్ మాత్రే స్థానంలో సంజూ శాంసన్‌ను రిటైర్డ్ అవుట్ చేయడం సరైన నిర్ణయం అని కొందరు అంటున్నారు. ఎందుకంటే శాంసన్ భారీ ఇన్నింగ్స్ ఆడి అలసిపోయినట్లు కనిపించాడు. కానీ సెంచరీకి దగ్గరగా ఉండటమే శాంసన్‌ను అవుట్ చేయకపోవడానికి కారణమై ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. యువ బ్యాటర్ మాత్రేలో కాన్ఫిడెన్స్ నింపాల్సిన సీఎస్కే మేనేజ్‌మెంట్ అందుకు భిన్నంగా అతడ్ని రిటైర్డ్ ఔట్ కావాలని సూచించడం హాట్ టాపిక్ అవుతోంది.
ట్రెండింగ్ వార్తలు




















