Bhuvneshwar Kumar Equals Powerplay Wickets Record In IPL 2026: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ 2026 సీజన్ లో తన అద్భుతమైన ఫామ్ ను కంటిన్యూ చేస్తూ ఆదివారం మరో మైలురాయిని అందుకున్నాడు. అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ (GT) టీమ్ తో జరుగుతున్న టైటిల్ ఫైట్ లో అతడు ఒక హిస్టారికల్ రికార్డును సమం చేశాడు. ఈ ఫైనల్ మ్యాచ్ లో నాలుగో ఓవర్ లోనే గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ ను అవుట్ చేయడం ద్వారా భువనేశ్వర్ ఈ సీజన్ పవర్ ప్లే (1-6 ఓవర్లు) లో తన 17వ వికెట్ ను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఒకే ఐపీఎల్ సీజన్ లో అత్యధిక పవర్ ప్లే వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్ గా మహమ్మద్ షమీ పేరిట ఉన్న లాంగ్ స్టాండింగ్ రికార్డును భువి అందుకున్నాడు. 

Continues below advertisement

Read Also : IPL 2026 Prize Money Details: ఐపీఎల్ విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంత ద‌క్కుతుందంటే..?

షమీ పాత రికార్డ్ సమం.. 

Continues below advertisement

గతంలో గుజరాత్ టైటాన్స్ టీమ్ తరఫున ఆడుతూ ఐపీఎల్ 2023 సీజన్ లో షమీ పవర్ ప్లే లో 17 వికెట్లు పడగొట్టి ఈ బెంచ్‌మార్క్ క్రియేట్ చేశాడు. సరిగ్గా మూడేళ్ల తర్వాత భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ ఫైనల్ లాంటి బిగ్గెస్ట్ స్టేజ్ పై ఆ రికార్డును టచ్ చేశాడు. ఈ మ్యాచ్ లో గుజరాత్ కు ఈ వికెట్ పెద్ద షాక్ అని చెప్పాలి. ఈ సీజన్ లో ఆల్రెడీ 700 రన్స్ మైలురాయిని దాటిన శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ ల జోడీని విడదీయడం ఆర్‌సీబీకి చాలా అవసరమైంది. మ్యాచ్ స్టార్టింగ్ లోనే జోష్ హేజిల్‌వుడ్ సూపర్ బాల్ తో గిల్ (10) ను అవుట్ చేసి గుజరాత్ ను ప్రెజర్ లోకి నెట్టాడు. ఆ వెంటనే భువనేశ్వర్ పర్ఫెక్ట్ షార్ట్ పిచ్ ప్లాన్ తో సుదర్శన్ ను ట్రాప్ చేశాడు.

Read Also: IPL 2026 GT vs RCB Grand Final: బ్యాక్ టూ బ్యాక్ టైటిల్ పై ఆర్సీబీ గురి.. ఫైన‌ల్లో జీటీని త‌క్కువ స్కోరుకే ప‌రిమితం.. రాణించిన వాషింగ్ట‌న్, ర‌సిక్

జితేష్ శర్మ సూపర్ క్యాచ్.. 

భువి వేసిన షార్ట్ బంతిని సుదర్శన్ పుల్ షాట్ ఆడటానికి ట్రై చేశాడు. కానీ బౌన్స్ ను అంచనా వేయడంలో ఫెయిల్ అవ్వడంతో బంతి గాల్లోకి లేచింది. వికెట్ కీపర్ జితేష్ శర్మ ముందుకు పరుగెత్తుకుంటూ వచ్చి పర్ఫెక్ట్ క్యాచ్ అందుకోవడంతో సుదర్శన్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ వికెట్ తో గుజరాత్ టైటాన్స్ పవర్ ప్లే ముగిసేసరికి 45 రన్స్ కే 2 వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. స్ట్రోక్ ప్లే కి అంతగా సహకరించని ఈ పిచ్ పై ఆర్‌సీబీ బౌలర్లు మ్యాచ్ పై పట్టు సాధించారు. ఈ సీజన్ లో ఆర్‌సీబీ బ్యాటింగ్ యూనిట్ పైనే అందరి ఫోకస్ ఉన్నా, భువనేశ్వర్ తన ఎక్స్‌పీరియన్స్ తో టీమ్ కు ఎప్పటికప్పుడు బ్రేక్‌థ్రూలు ఇస్తూ సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

పర్పుల్ క్యాప్ రేసులో రబడా టాప్

సాయి సుదర్శన్ వికెట్ తీయడంతో భువనేశ్వర్ కుమార్ ఈ సీజన్ లో టోటల్ గా 28 వికెట్లకు చేరుకున్నాడు. దీంతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులో గుజరాత్ టైటాన్స్ పేసర్ కాగిసో రబడాతో కలిసి సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరి పర్పుల్ క్యాప్ రేసును ఇంట్రెస్టింగ్ గా మార్చాడు. ఒకే ఐపీఎల్ సీజన్ లో అత్యధిక పవర్ ప్లే వికెట్లు తీసిన ఓవరాల్ రికార్డులో కాగిసో రబడా (2026 లో 20 వికెట్లు) టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత షమీ, భువి చెరో 17 వికెట్లతో సెకండ్ ప్లేస్ లో నిలిచారు. మ‌రోవైపు ఈ సీజ‌న్ లో 29 వికెట్లు తీసిన ర‌బాడా.. పర్పుల్ క్యాప్ ను అందుకున్నాడు.