IPL 2026 PBKS VS GT Latest Updates: పంజాబ్ కింగ్స్ ప్రధాన పేసర్, టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఇండియా తరఫున అత్యధిక వికెట్లు (127) తీసిన రికార్డు ఉన్న అర్ష్‌దీప్ సింగ్‌కు ఐపీఎల్ 2026 సీజన్ కలిసి రావడం లేదు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో అతని ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. నాలుగు ఓవర్లు వేసిన అర్ష్‌దీప్ ఏకంగా 42 పరుగులు ఇచ్చాడు. 10.50 ఎకానమీ రేటుతో పంజాబ్ బౌలర్లలోనే అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేయడానికి వచ్చిన అతడు ఏకంగా 11 బంతులు వేశాడు. ఇందులో ఐదు వైడ్‌లు, ఒక నో-బాల్ ఉండటం విశేషం. చివరి బంతికి రివ్యూ తీసుకోవడంతో అది కరెక్టు బాల్ గా తేలింది. లేకపోతే అర్షదీప్ సింగ్ ఖాతాలో ఈ చెత్త రికార్డు మరింత బలంగా నమోదయ్యేది.
ఐపీఎల్లో అత్యంత సుదీర్ఘ ఓవర్అర్ష్‌దీప్ వేసిన ఈ 11 బంతుల ఓవర్ ఐపీఎల్ చరిత్రలోనే జాయింట్-లాంగెస్ట్ ఓవర్‌గా నమోదైంది. 20వ ఓవర్గ వేసిన అర్షదీప్ సింగ్ చాలా సుదీర్ఘంగా బౌలింగ్ చేశాడు. ఇందులో ఒక నోబ్, 5 వైడ్లు ఉండటం విశేషం. ఒకనొక దశలో ఓవర్ ఎప్పుడు పూర్తవుతుందంటూ పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా అసహనంగా కనిపించాడు. ఇక 11వ బంతిని కూడా అంపైర్ వైడ్ గా ప్రకటించగా, రివ్యూలో అది కాలికి తాకినట్లు తేలడంతో థర్డ్ అంపైర్ దాన్ని రివర్స్ చేశాడు. దీంతో 11 బంతుల తర్వాత ఓవర్ ముగిసింది. గతంలో మొహమ్మద్ సిరాజ్ (2023), తుషార్ దేశ్‌పాండే (2023), శార్దూల్ ఠాకూర్ (2025), సందీప్ శర్మ (2025), హార్దిక్ పాండ్యా (2025) మాత్రమే ఇలాంటి సుదీర్ఘ ఓవర్లు వేశారు. కీలక సమయంలో అర్ష్‌దీప్ ఇలా తడబడటం పంజాబ్ కింగ్స్ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని ఆ జట్టు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చాహల్ మ్యాజిక్.. జీటీ తడబాటుమరోవైపు మంగళవారం న్యూ చండీగఢ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో కీలక సమయంలో సీనియర్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన అనుభవంతో గుజరాత్ టైటాన్స్‌ను కట్టడి చేశాడు. మధ్య ఓవర్లలో కీలక వికెట్లు తీసి గుజరాత్ స్కోరును 162/6 వద్ద నిలవరించారు. చాహల్ 4 ఓవర్లలో 2/28 గణాంకాలతో ఆకట్టుకోగా, పేసర్ విజయ్‌కుమార్ వైశాక్ (3/34) సత్తా చాటాడు.. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (39), జోస్ బట్లర్ (38) మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. గిల్ ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించినా, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వరుస విరామాల్లో బౌలింగ్ మార్పులతో వికెట్లు పడ్డాయి. ఒకదశలో 200 పరుగులు సాధిస్తుందనుకున్న గుజరాత్.. బౌలర్లు కట్టడి చేయడంతో 162 పరుగులకే పరిమితమైంది. ఇక పిచ్ కు తగినట్లుగా బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బంతులు వేస్తూ గుజరాత్ ను కట్టడి చేశారు.
