Punjab Kings vs Royal Challengers Bangalore: పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈ రోజు IPL 2025 ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. రెండు జట్లు కూడా ఈరోజు మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. రెండు జట్లు కూడా తొలి ఐపీఎల్ ట్రోఫీ తీసుకెళ్లడానికి ఆసక్తితో వ్యూహాలు సిద్ధం చేశాయి. కోట్లాది మంది ప్రేక్షకులు కూడా ఈరోజు ఫైనల్ ఫలితం తెలుసుకోవడానికి ఉత్సుకతతో ఉన్నారు. కానీ ఈ మ్యాచ్‌పై మేఘాలు అలుముకున్నాయి. పంజాబ్ , బెంగళూరు మధ్య ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడే అవకాశం ఉంది. కానీ ఈరోజు IPL 2025 ఫైనల్ మ్యాచ్ జరగకపోతే, ఈ మ్యాచ్ ఫలితం ఎలా వస్తుంది, మనం తెలుసుకుందాం.
ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
IPL ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈరోజు మంగళవారం, జూన్ 3న సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. కానీ ఈరోజు ఈ వేదికపై వర్షం పడే అవకాశం ఉంది. వర్షం పడే అవకాశాలు 50 నుంచి 75 శాతం వరకు అంచనా వేస్తున్నారు. దీని వల్ల IPL ఫైనల్ డే వర్షార్పరణం కావచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. కానీ అభిమానులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు మ్యాచ్‌లో వర్షం పడితే, ఫైనల్ కోసం భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) రిజర్వ్ డే కూడా ప్లాన్‌లో ఉంచింది.
ఫైనల్ కోసం రిజర్వ్ డే
భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) IPL నిబంధనల ప్రకారం, ఈరోజు బెంగళూరు-పంజాబ్ ఫైనల్ మ్యాచ్‌లో వర్షం పడితే, ఈ మ్యాచ్ జూన్ 3న బదులు జూన్ 4న జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ కోసం ఒక అదనపు రోజును కూడా ఏర్పాటు చేస్తారు, తద్వారా వర్షం లేదా ఇతర పరిస్థితుల కారణంగా మ్యాచ్ వాయిదా పడితే, తదుపరి రోజు మ్యాచ్‌ను జరిపించవచ్చు.
120 నిమిషాల అదనపు సమయం
పంజాబ్-బెంగళూరు మ్యాచ్‌లో కొంత సమయం వర్షం పడితే మ్యాచ్ జరిపేందుకు అదనపు సమయాన్ని కూటా కేటాయించారు. మ్యాచ్ జరిగే పరిస్థితులు ఉంటే మాత్రం వర్షం ఆగిన తర్వాత ఆ సమయంలో మ్యాచ్ ఆడిస్తారు. ఈరోజు మంగళవారం కోసం అదనంగా 120 నిమిషాలు లేదా రెండు గంటల సమయాన్ని కూడా కేటాయించారు. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో కూడా వర్షం ఆగిన తర్వాత మ్యాచ్ జరిగి సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది, కానీ రాత్రి 9:45 గంటలకు వర్షం ఆగిన తర్వాత ఈ మ్యాచ్‌ను పూర్తి చేశారు . ఓవర్లు కూడా తగ్గించలేదు.
అహ్మదాబాద్‌లో వెదర్‌పై ఐఎండీ ఏం చెబుతోంది? భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, మంగళవారం అహ్మదాబాద్‌లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది, సాయంత్రం, రాత్రి సమయంలో జల్లులు పడే అవకాశం 50–75 శాతం ఉంటుంది. వర్షం పడినప్పటికీ త్వరగానే పిచ్ ఆరిపోతుందని అంటున్నారు. నరేంద్ర మోడీ స్టేడియం అధునాతన సబ్-సాయిల్ డ్రైనేజీ వ్యవస్థను కలిగి ఉంది, ఇది వర్షం ముగిసిన 30 నిమిషాల్లోనే నిలిచి ఉన్న నీటిని తొలగించగలదు.