SRH vs PBKS IPL 2025: ఉప్పల్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాడు అభిషేక్ శర్మ హైదరాబాద్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. అతను చేసిన 141 పరులు ఇన్నింగ్స్‌ హైదరాబాద్‌ను విజయతీరాలకు చేర్చడమే కాదు... అనేక రికార్డులను కూడా బద్దలయ్యేలా చేసింది. అభిషేక్ శర్మ అత్యంత వేగవంతమైన శతకం సాధించిన బ్యాటర్స్‌లో ఆరో స్థానంలో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్‌కు వ్యతిరేకంగా 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. తర్వాత 125 పరుగుల వద్ద సిక్స్ కొట్టి హైదరాబాద్‌ తరఫున ఎక్కువ వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 141 పరుగులు చేసిన అభిషేక్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. తన ఇన్నింగ్స్‌ పది సిక్స్‌లు కొట్టాడు. 

ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన శతకాలు -

  • 30 - క్రిస్ గేల్ (ఆర్‌సీబీ), 2013
  • 37 - యూసుఫ్ పఠాన్ (ఆర్‌ఆర్), 2010
  • 38 - డేవిడ్ మిల్లర్ (పంజాబ్), 2013
  • 39 - ట్రావిస్ హెడ్ (హైదరాబాద్) ఆర్‌సీబీకి వ్యతిరేకంగా, బెంగళూరు, 2024
  • 39 - ప్రియాంశ్ ఆర్య (పంజాబ్) సీఎస్‌కేకి వ్యతిరేకంగా, ముల్లాపూర్, 2025
  • 40 - అభిషేక్ శర్మ (హైదరాబాద్) పీబీకెఎస్‌కు వ్యతిరేకంగా, హైదరాబాద్, 2025*

అభిషేక్ శర్మ రికార్డు సెంచరీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 19వ ఓవర్‌లో పంజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో అతిపెద్ద విజయవంతమైన ఛేజింగి. అభిషేక్ 55 బంతుల్లో 141 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ట్రావిస్ హెడ్‌తో కలిసి మొదటి వికెట్‌కు 171 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. అభిషేక్ 19 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేయగా, హెడ్ 32 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ పడే సమయానికి, చాలా ఆలస్యమైంది. 13వ ఓవర్ రెండో బంతికి యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో హెడ్ క్యాచ్ అవుట్ అయ్యాడు. అతను 37 బంతుల్లో 3 సిక్సర్లు,  9 ఫోర్ల సహాయంతో 66 పరుగులు చేశాడు.

అభిషేక్ శర్మ చారిత్రాత్మక ఇన్నింగ్స్హెడ్ అవుట్ అయిన తర్వాత కూడా అభిషేక్ శర్మ బ్యాట్ విధ్వంసం ఆగలేదు. అతను 40 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. దీని తర్వాత కూడా అతను పంజాబ్ కింగ్స్ బౌలర్లపై దాడి చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 222 పరుగులు అయినప్పుడు అతను 17వ ఓవర్‌లో ఔటయ్యాడు. అప్పటికే జట్టును విజయతీరాలకు చేర్చాడు. అభిషేక్ 55 బంతుల్లో 141 పరుగులు చేసి, 10 సిక్సర్లు, 14 ఫోర్లు బాదాడు. ఐపీఎల్ చరిత్రలో అభిషేక్‌కి ఇది తొలి సెంచరీ.

అభిషేక్‌ శర్మ  సెంచరీ చేసిన తర్వాత తన జేేబులో ఉన్న ఓ లెటర్‌ను అందరికీ చూపించాడు. అందులో ఇది ఆరెంజ్ ఆర్మీ కోసమని చెప్పాడు.