GT in IPL: IPL 2023 ప్రారంభానికి ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈసారి సీజన్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అద్భుతమైన మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. గుజరాత్ టైటాన్స్ ప్రస్తుత ఐపీఎల్ ఛాంపియన్, గత సీజన్‌లో రెండుసార్లు చెన్నైని ఓడించింది. అయితే చెన్నై ఎల్లప్పుడూ అద్భుతమైన కమ్‌బ్యాక్ చేయడంలో పేరు గాంచింది. అటువంటి పరిస్థితిలో గుజరాత్ తన మొదటి మ్యాచ్‌కు చాలా ఆలోచనాత్మకంగా ప్లేయింగ్ ఎలెవన్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. మొదటి మ్యాచ్‌లో గుజరాత్‌కి చెందిన అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్ ఏదో ఇప్పుడు చూద్దాం.
తొలి మ్యాచ్‌లో హార్దిక్ జట్టు ఎలా ఉంటుంది?
ఓపెనర్లు - ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ ఒక ఓపెనర్‌గా కావచ్చు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే గిల్ అన్ని ఫార్మాట్లలో సెంచరీలు సాధించాడు. వృద్ధిమాన్ సాహా మరో ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. అతను పవర్‌ప్లేలో జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించగలడు. అంతే కాకుండా వికెట్ కీపింగ్ పరంగా గుజరాత్‌కు ఎలాంటి ఆందోళన లేదు. సాహా, గిల్‌లు గుజరాత్‌కు శుభారంభం అందించగలరు.
వన్ డౌన్ - ఈ స్థానంలో కేన్ విలియమ్సన్ కంటే మెరుగైన బ్యాట్స్‌మెన్ ఎవరు ఉండగలరు. ప్రస్తుతం కేన్ విలియమ్సన్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ఎన్నో సెంచరీలు కూడా చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో గుజరాత్ అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.
నాలుగో స్థానం - కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్వయంగా 4వ స్థానంలో కొనసాగవచ్చు. గతేడాది నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ జట్టును అవసరమైన సమయంలో ఇన్నింగ్స్‌ను హ్యాండిల్ చేయడమే కాకుండా భారీ షాట్‌లు, సింగిల్ - డబుల్‌ల కలయికతో స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించగలడు. అటువంటి పరిస్థితిలో హార్దిక్ నాలుగో స్థానంలో పర్ఫెక్ట్ అవుతాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో కూడా మ్యాచ్‌ను ఆరంభించగలడు.
ఐదో స్థానం - ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ వేడ్‌ను 5వ స్థానంలో ఉంచవచ్చు. ఈ స్థానానికి గుజరాత్‌లో డేవిడ్ మిల్లర్ కంటే మెరుగైన బ్యాట్స్‌మెన్ మరొకరు లేకపోయినా, మొదటి కొన్ని మ్యాచ్‌లలో డేవిడ్ మిల్లర్ అందుబాటులో ఉండడు. కాబట్టి గుజరాత్ ఐదో స్థానంలో ఆడే అవకాశం మాథ్యూ వేడ్‌కు ఇవ్వవచ్చు.
ఆరో స్థానం - గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో భయాందోళనలు సృష్టించిన రాహుల్ టెవాటియాను గుజరాత్ నంబర్ 6లో ఆడించగలదు. ఐపీఎల్‌లో రాహుల్ తన జట్టును ఒకసారి కాదు, చాలాసార్లు గెలిపించాడు. అంతే కాకుండా రాహుల్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు.
ఏడో స్థానం - రషీద్ ఖాన్ 7వ స్థానంలో ఉంటాడని భావిస్తున్నారు. ఈ ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడికి ఎటువంటి వంక ప్రదర్శించడానికి లేదు. అతను తన స్పిన్ బౌలింగ్‌ను ప్రదర్శించడమే కాదు. అవసరమైనప్పుడు భారీ షాట్‌లను కూడా కొట్టగలడు.
ఎనిమిదో స్థానం - ఆర్ సాయి కిషోర్‌ను గుజరాత్ టైటాన్స్ ఎనిమిదో స్థానంలో ఉంచగలదు. ఈ ఎడమచేతి వాటం స్పిన్ బౌలర్ చాలా సంవత్సరాలు చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగంగా ఉన్నాడు. కాబట్టి అతను చెన్నై వ్యూహాలు, వారి బ్యాట్స్‌మెన్ బలహీనతల గురించి ఒక ఆలోచన కలిగి ఉంటాడు. ఈ కారణంగా గుజరాత్ అతనికి తమ జట్టులో ఆడే అవకాశం ఇవ్వగలదు.
తొమ్మిదో స్థానం - మహ్మద్ షమీ తొమ్మిదో నంబర్‌లో ఆడగలడు, అతను ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కొన్ని పెద్ద షాట్‌లు చేయగల సామర్థ్యం కలిగి ఉంటాడు.
పదో స్థానం - ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్ రికార్డును కలిగి ఉన్న వెస్టిండీస్‌కు చెందిన అల్జారీ జోసెఫ్ నంబర్ 10లో Eడే అవకాశం ఉంది. ఇతను 145 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయగలడు. ఇతను ప్రత్యేక బౌలర్.
11వ స్థానం - యశ్ దయాళ్ నంబర్ 11లో ఆడే అవకాశం ఉంది. గత ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ తరఫున ఈ బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఎడమచేతి వాటం బౌలర్ కొత్త బంతితో స్వింగ్ చేయడం ద్వారా బ్యాట్స్‌మెన్‌ను చాలా ఇబ్బంది పెడతాడు.
గుజరాత్‌కు పాజిబుల్ ప్లేయింగ్ ఎలెవన్
శుభమాన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), మాథ్యూ వేడ్, రాహుల్ టెవాటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాళ్