Lucknow Super Giants IPL 2023 Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. గత ఐపీఎల్ సీజన్‌లో చేరిన కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ షెడ్యూల్ ఒకసారి చూద్దాం. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఈ ఐపీఎల్‌లో తన ప్రస్థానాన్ని 2023 ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రారంభించనుంది. IPL 2023లో లక్నో సూపర్ జెయింట్స్ పూర్తి షెడ్యూల్‌ను తెలుసుకోండి.


IPL 2023లో లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌ల షెడ్యూల్
1 ఏప్రిల్ 2023 - లక్నో సూపర్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, ఎకానా స్టేడియం, లక్నో


3 ఏప్రిల్ 2023 - లక్నో సూపర్ జెయింట్స్ v చెన్నై సూపర్ కింగ్స్ చెపాక్ స్టేడియం, చెన్నై


7 ఏప్రిల్ 2023 - లక్నో సూపర్ జెయింట్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, ఎకానా స్టేడియం, లక్నో


10 ఏప్రిల్ 2023 - లక్నో సూపర్ జెయింట్స్ v రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు


15 ఏప్రిల్ 2023 - లక్నో సూపర్ జెయింట్స్ vs పంజాబ్ కింగ్స్, ఎకానా స్టేడియం, లక్నో


19 ఏప్రిల్ 2023 - లక్నో సూపర్ జెయింట్స్ vs రాజస్థాన్ రాయల్స్, సవాయ్ మాన్ సింగ్ స్టేడియం, జైపూర్


22 ఏప్రిల్ 2023 - లక్నో సూపర్ జెయింట్స్ v గుజరాత్ టైటాన్స్, ఎకానా స్టేడియం, లక్నో


28 ఏప్రిల్ 2023 - లక్నో సూపర్ జెయింట్స్ v పంజాబ్ కింగ్స్ మొహాలి క్రికెట్ స్టేడియం, మొహాలి


1 మే 2023 - లక్నో సూపర్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎకానా స్టేడియం, లక్నో బెంగళూరు


4 మే 2023 - లక్నో సూపర్ జెయింట్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, ఎకానా స్టేడియం, లక్నో


7 మే 2023 - లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్


13 మే 2023 - లక్నో సూపర్ జెయింట్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజీవ్ గాంధీ స్టేడియం, హైదరాబాద్


16 మే 2023 - లక్నో సూపర్ జెయింట్స్ v ముంబై ఇండియన్స్, ఎకానా స్టేడియం, లక్నో


20 మే 2023 - లక్నో సూపర్ జెయింట్స్ v కోల్‌కతా నైట్ రైడర్స్, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా


లక్నో సూపర్ జెయింట్స్ స్క్వాడ్ కంపోజిషన్
వికెట్ కీపర్లు: క్వింటన్ డి కాక్ (SA), మనన్ వోహ్రా, నికోలస్ పూరన్ (WI),


బ్యాటర్లు: కేఎల్ రాహుల్, ఆయుష్ బదోని.


ఆల్ రౌండర్లు: కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, కైల్ మేయర్స్ (WI), కృనాల్ పాండ్యా, కరణ్ శర్మ, మార్కస్ స్టోయినిస్ (AUS), రొమారియో షెపర్డ్ (WI), డేనియల్ సామ్స్ (AUS), ప్రేరక్ మన్కడ్, స్వప్నిల్ సింగ్, యుధ్వీర్ చరక్,


బౌలర్లు: అవేశ్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్, మార్క్ వుడ్ (ENG), మయాంక్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, నవీన్-ఉల్-హక్ (AFG).


ఐపీఎల్ 2023 షెడ్యూల్ గురించి చెప్పాలంటే ఈ సీజన్‌లో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. వీటి మధ్య మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయి. వాటిలో 70 మ్యాచ్‌లు లీగ్ దశలో, నాలుగు మ్యాచ్‌లు ప్లేఆఫ్‌లో జరగనున్నాయి. లీగ్ దశలో అన్ని జట్లు తలో 14 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ సీజన్‌లో చివరి లీగ్ మ్యాచ్ 2023 మే 21వ తేదీన జరగనుంది. ఫైనల్ మ్యాచ్‌ను మే 28వ తేదీన నిర్ణయించారు.


ఈ ఏడాది ఐపీఎల్‌లో ప్రతి శని, ఆదివారాల్లో డబుల్ హెడర్‌ మ్యాచ్‌లు కూడా ఆడనున్నారు. ఈ విధంగా ఈ సీజన్‌లో మొత్తం 18 డబుల్ హెడర్‌ మ్యాచ్‌లు ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.