ఐపీఎల్ 2023 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం అయిపోతుంది. మార్చి 31వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌తో జరగనున్న మ్యాచ్‌తో ఐపీఎల్ యాక్షన్ షురూ కానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మన ఫేవరెట్ టీమ్‌కు సపోర్ట్ ఇవ్వాలంటే స్లోగన్ చాలా ముఖ్యం. కానీ మీ ఫేవరెట్ టీమ్స్ స్లోగన్స్ ఏంటి? వాటి మీనింగ్ ఏంటి? అని ఎప్పుడైనా ఆలోచించారా? అవేంటో ఇప్పుడు చూద్దాం.


1. ముంబై ఇండియన్స్
ఈ టీం స్లోగన్.. Duniya Hila Denge. దీని అర్థం... తమ ఆటతో ప్రపంచాన్నే ఊపేస్తాం అని.


2. చెన్నై సూపర్ కింగ్స్
చెన్నై జట్టుకు రెండు స్లోగన్స్. Yellove, Whistle Podu. లవ్‌ను ఎల్లోవ్‌గా పద ప్రయోగం చేశారు. విజిల్ కొట్టి ఎంకరేజ్ చేయాలని ఇంకో దాని అర్థం.


3. కోల్ కతా నైట్ రైడర్స్
Korbo, Lorbo, Jeetbo. ఇది వీళ్ల స్లోగన్. దీని అర్థం. ఆడతాం, పోరాడతాం, గెలుస్తాం అని.


4. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఇది ప్రపంచం అంతా తెలిసిన స్లోగన్. Ee Saala Cup Namde. దాని అర్థమేంటో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది.


5. సన్ రైజర్స్ హైదరాబాద్
మన ఆరెంజ్ ఆర్మీ ఈ ఏడాదికి పెట్టుకున్న స్లోగన్. Orange Fire Idhi. తెలుగు ఆడియన్స్ అందరికీ దీని మీనింగ్ స్పెషల్ గా చెప్పాలా? 


6. రాజస్థాన్ రాయల్స్
వీళ్ల స్లోగన్ Halla Bol. రాజస్థానీ ప్రజల ఇంటెన్సిటీ, పోరాట పటిమను రిప్రజెంట్ చేసేలానే తమ జట్టు ఆడుతుందని చెప్తూ రాజస్థాన్ రాయల్స్ ఈ స్లోగన్  పెట్టుకుంది.


7. గుజరాత్ టైటాన్స్
ఆడిన ఫస్ట్ సీజన్ లోనే ఛాంపియన్ అయిన గుజరాత్ టైటాన్స్ స్లోగన్. Aava De. అంటే బ్రింగ్ ఇట్ ఆన్. ఛాలెంజ్ కు సిద్ధమంటూ సవాల్ విసురుతున్నారన్నమాట.
 
8. ఢిల్లీ క్యాపిటల్స్
సుమారు 3 సీజన్ల క్రితం టీం మొత్తాన్ని కంప్లీట్ గా మార్చేసిన దగ్గర నుంచి ఈ జట్టు స్లోగన్. Ye hai Nayi Dilli. ఇది సరికొత్త ఢిల్లీ అని అర్థం.


9. లక్నో సూపర్ జెయింట్స్
కేఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉన్న ఈ టీం స్లోగన్ Gazab Andaaz. అంటే అద్భుతమైన స్టైల్ అని అర్థం.


10. పంజాబ్ కింగ్స్
ఇక లాస్ట్ గా పంజాబ్ కింగ్స్ స్లోగన్. Sadda Punjab. అంటే పంజాబీలో దాని అర్థం. మా, మన పంజాబ్ అని.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ సరికొత్త సీజన్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సరికొత్త నాయకుడిని ఎంపిక చేసింది. యువ క్రికెటర్‌ నితీశ్ రాణాను తాత్కలిక సారథిగా ప్రకటించింది. శ్రేయస్‌ అయ్యర్‌ అందుబాటులో లేనన్ని రోజులూ అతడే జట్టును నడిపిస్తాడని వెల్లడించింది.


ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మెరుగైన జట్టే! గౌతమ్‌ గంభీర్‌ రెండుసార్లు వారికి ట్రోఫీ అందించాడు. ప్రతి సీజన్లోనూ ప్రత్యర్థులను వణికించేలా కోర్‌ టీమ్‌ను తయారు చేశాడు. రెండేళ్ల క్రితం అతడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లడంతో కేకేఆర్‌కు నాయకత్వ కష్టాలు మొదలయ్యాయి. ఏటా ఘోరంగా ఓడిపోతోంది. చివరి సీజన్లో శ్రేయస్‌ అయ్యర్‌కు కెప్టెన్సీ అప్పగించింది. అందుబాటులో ఉన్న వనరులతో అతడు జట్టును బాగానే నడిపించాడు. కొన్నాళ్లుగా అతడు వెన్నెముక గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. టీమ్‌ఇండియాకూ దూరమయ్యాడు. ఈ సీజన్లో ఫస్ట్‌హాఫ్‌కు అతడు అందుబాటులో ఉండడని తెలిసింది.