India vs Australia: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి నాగ్‌పూర్‌లో జరగనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ దృష్ట్యా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చాలా ముఖ్యమైనది.


ఈ సమయంలో భారతదేశం, ఆస్ట్రేలియా నుండి చెరో ఐదుగురు క్రికెటర్లను ఎంపిక చేసింది. వీరి మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పరస్పర పోరు చూడవచ్చు. ఐసీసీ విడుదల చేసిన ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, పాట్ కమిన్స్ వంటి పెద్ద పేర్లు ఉన్నాయి.


ఈ ఆటగాళ్ల మధ్య ఇంట్రస్టింగ్ ఫైట్
విరాట్ కోహ్లీ vs నాథన్ లియాన్
రోహిత్ శర్మ vs పాట్ కమిన్స్
చెతేశ్వర్ పుజారా vs జోష్ హేజిల్‌వుడ్
రవి అశ్విన్ vs డేవిడ్ వార్నర్
రవీంద్ర జడేజా vs స్టీవ్ స్మిత్


నాగ్‌పూర్‌లో జరగనున్న తొలి టెస్టు
ఐసీసీ తెలుపుతున్న దాని ప్రకారం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల మధ్య పరస్పర యుద్ధాన్ని చూడవచ్చు. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నాగ్‌పూర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఢిల్లీలో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. మూడో టెస్టు మార్చి 1వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ వరకు ధర్మశాలలో జరగనుంది. ఇక మార్చి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అహ్మదాబాద్‌లో నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది.


దీని తర్వాత రెండు జట్లూ మూడు వన్డేల సిరీస్ ఆడనున్నాయి. తొలి వన్డే ముంబైలో, రెండో వన్డే విశాఖపట్నంలో, మూడో వన్డే చెన్నైలో జరగనుంది. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టీమ్ ఇండియా వద్ద ఉంది. చివరిసారిగా ఆస్ట్రేలియా జట్టును సొంతగడ్డపై ఓడించి భారత జట్టు సిరీస్‌ను గెలుచుకుంది.


తొలి టెస్టు మ్యాచ్‌కు భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ దూరం అయ్యాడు. వెన్ను గాయం కారణంగా అయ్యర్ తొలి మ్యాచ్‌ ఆడలేడు. రెండో టెస్టు మ్యాచ్‌ నాటికి శ్రేయస్ అయ్యర్‌ ఫిట్‌నెస్‌ను తిరిగి పొందనున్నాడని తెలుస్తోంది. అయితే గాయాల నుంచి కోలుకోవడం గురించి కచ్చితంగా అంచనా వేయలేం. సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోతే ఊహించిన దాని కంటే ప్రమాదకరం అయిన సంఘటనలు ఇంతకు ముందే చూశాం. అంతకుముందు అతను న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ స్క్వాడ్‌లో కూడా ఉన్నాడు. కాని తర్వాత రికవరీ కోసం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి పంపారు.


బీసీసీఐ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ “ముందుగా అనుకున్నట్లు శ్రేయస్ అయ్యర్ గాయం నయం కాలేదు. అతను మళ్లీ క్రికెట్ ఆడటానికి కనీసం రెండు వారాలు పడుతుంది. అతను మొదటి టెస్ట్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడు. రెండో టెస్ట్‌కు అతను అందుబాటులోకి వచ్చేది రానిది ఇంకా తెలియరాలేదు. శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు భారత్ తరఫున మొత్తం ఏడు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అంతకుముందు బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్‌లో కనిపించాడు.