2026 CWG India Surge To Fourth With 39 Medals:  గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 లో ఇండియన్ అథ్లెట్లు పతకాల పంట పండించారు. శనివారం నాటి మ్యాచ్ లలో బాక్సింగ్ విభాగంలో ఏకంగా 10 మెడల్స్ రావడంతో ఇండియా మెడల్స్ టాలీలో 4వ స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు 13 గోల్డ్, 17 సిల్వర్, 9 బ్రాంజ్ మెడల్స్ తో ఇండియా టోటల్ గా 39 పతకాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. రెజ్లింగ్, బ్యాడ్మింటన్, హాకీ లాంటి ప్రధాన క్రీడలు ఈసారి టోర్నీలో లేకపోయినా ఇండియన్ టీమ్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో మెరిసింది. పారా పవర్ లిఫ్టింగ్ లో ఝండూ కుమార్ బ్రాంజ్ సాధించి ఇండియా మెడల్స్ ఖాతా తెరవగా, మీరాబాయి చాను ఉమెన్స్ 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్ లో ఫస్ట్ గోల్డ్ మెడల్ అందించి శ్రీకారం చుట్టింది.

Continues below advertisement

Continues below advertisement

అథ్లెటిక్స్ లో రికార్డుల సునామీ.. గుల్వీర్ సింగ్, తేజస్విన్ శంకర్ హిస్టరీగ్లాస్గో గేమ్స్ లో ఇండియా అనేక కొత్త రికార్డులను సెట్ చేసింది. డెకాథ్లాన్ లో తేజస్విన్ శంకర్ బ్రాంజ్ గెలుచుకుని ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ ఇండియన్ గా నిలిచాడు. గుల్వీర్ సింగ్ మెన్స్ 10,000 మీటర్లలో సిల్వర్, 5,000 మీటర్లలో బ్రాంజ్ మెడల్ సాధించి ఒకే కామన్వెల్త్ గేమ్స్ లో టూ మెడల్స్ కొట్టిన ఫస్ట్ ఇండియన్ అథ్లెట్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు. నీరజ్ చోప్రా సిల్వర్ గెలవగా, యష్ వీర్ సింగ్ బ్రాంజ్ సాధించాడు.

బాక్సింగ్ రింగ్ లో బంగారు పంట.. ఏడుగురు బాక్సర్లకు గోల్డ్ మెడల్స్రింగ్ లో ఇండియన్ బాక్సర్లు ఏకపక్ష ఆధిపత్యం చెలాయించారు. ఉమెన్స్ కేటగిరీలో ప్రీతి పవార్, జైస్మిన్ లాంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా ఘంగాస్, అరుంధతి చౌదరి బంగారు పతకాలు గెలుచుకున్నారు. మెన్స్ విభాగంలో సచిన్ శివాచ్, అంకుష్ పంగాల్ గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకున్నారు. లవ్లీనా బోర్గోహైన్, నరేందర్ బెర్వాల్, జడుమణి సింగ్ సిల్వర్ మెడల్స్ కి పరిమితమయ్యారు.

జూడో, పారా అథ్లెటిక్స్ లో మైండ్ బ్లాకింగ్ పర్ఫార్మెన్స్పారా అథ్లెటిక్స్ లో షర్మిలా ధంకర్, దిలీప్ గావిత్, సోమన్ రాణా గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు. జూడోలో అస్మిత డే, హర్ష్ సింగ్ హిస్టారిక్ గోల్డ్ సాధించగా, యామిని మౌర్య సిల్వర్, ఉన్నతి శర్మ బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నారు. జూడో, ట్రాక్ సైక్లింగ్ లలో మరిన్ని మెడల్స్ వచ్చే ఛాన్స్ ఉందని, ఇండియా మెడల్స్ కౌంట్ 40+ దాటడం ఖాయమని తెలుస్తోంది.