ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్​ క్రీడలకు కౌంట్​డౌన్ మొదలైంది. ఈ నెల 23 నుంచి టోక్యోలో జరిగే క్రీడలకు భారత్‌ క్రీడాకారులు సిద్ధమయ్యారు. ఇందులో ఫెన్సింగ్‌ నుంచి తొలిసారి భారత్ ప్రాతినిధ్యం కనిపించబోతోంది.


ఈ వేదికపై అద్భుత ప్రదర్శన కనబరుస్తూ.. సగర్వంగా ఒలింపిక్‌ పతకాన్ని అందుకోవాలని వీరంతా ఆరాటపడుతున్నారు. ముఖ్యంగా పీవీ సింధు, నీరజ్‌ చోప్రా, దీపికా కుమారి, బజరంగ్‌ పూనియా, వినేశ్‌ ఫొగట్‌, అమిత్‌ పంగల్‌, మేరీ కోమ్‌ ఇలా కొందరిపై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి.


కరోనా ఫీవర్..


అయితే జపాన్‌లో కరోనా వైరస్‌ డెల్టా వేరియంట్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. దాంతో ఈనెల 23 నుంచి ప్రారంభంకానున్న టోక్యో ఒలింపిక్స్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ టోక్యో ఒలింపిక్స్‌ 2020 అధ్యక్షురాలు సీకో హషిమోటో విచారం వ్యక్తం చేశారు.


ఒలింపిక్స్‌ గేమ్స్‌ను ప్రత్యక్షంగా చూడాలని టికెట్లు కొన్నవారికి ఈ సందర్భంగా ఆమె క్షమాపణలు చెప్పారు. జపాన్‌లో డెల్టా వేరియంట్‌ తీవ్రంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో అక్కడి వారిని సురక్షితంగా ఉంచాలనే నేపథ్యంలో అత్యయిక స్థితి ప్రకటించినట్లు జపాన్‌ ప్రధాని యోషిహిడే సుగా మీడియాకు వెల్లడించారు. అక్కడ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయాలంటే ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్‌ నిర్వహించాలని వైద్యాధికారులు సూచించినట్లు తెలిపారు. అయతే గతేడాది జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఈ టోక్యో ఒలింపిక్స్‌ తొలుత జరగాల్సి ఉండగా, కరోనా వైరస్‌ నేపథ్యలో నిర్వాహకులు ఏడాది పాటు వాయిదా వేశారు. అయితే, ఇప్పటికీ ఆ పరిస్థితుల్లో మార్పు రాలేదు.


ఒలింపిక్స్ భారత సైన్యం ఇదే​..


అథ్లెటిక్స్​ (19 మంది)



  • పురుషుల జావెలిన్‌ త్రో: నీరజ్‌ చోప్రా, శివ్‌పాల్‌ సింగ్‌

  • పురుషుల లాంగ్‌ జంప్‌: మురళి శ్రీశంకర్‌

  • పురుషుల షాట్‌పుట్‌: తజిందర్‌పాల్‌ సింగ్‌ తూర్‌

  • మహిళల డిస్కస్‌ త్రో: కమల్‌ప్రీత్‌ కౌర్‌, సీమా పూనియా

  • మహిళల జావెలిన్‌ త్రో: అన్నూ రాణి

  • పురుషుల 400మీ. హర్డిల్స్‌: ఎంపీ జబీర్‌

  • పురుషుల 4X400మీ. రిలే: మహమ్మద్‌ అనాస్‌ యహియా, నోహా   

  • నిర్మల్‌ టామ్‌, అమోజ్‌ జాకబ్‌, అరోకియా రాజీవ్‌.

  • పురుషుల 20కి.మీ రేస్‌ వాక్‌: సందీప్‌ కుమార్‌, రాహుల్‌ రోహిలా, 

  • ఇర్ఫాన్‌ కొలోత్తుమ్‌ తోడి.

  • పురుషుల 3000మీ. స్టీపుల్‌చేజ్‌: అవినాశ్‌ సబ్లే

  • మహిళల 100మీ.: ద్యూతీ చంద్‌

  • మహిళల 200మీ.: ద్యూతీచంద్‌

  • మహిళల 20కి.మీ రేస్‌ వాక్‌: ప్రియాంక గోస్వామి, భావనా జాట్‌

  • మిక్స్‌డ్‌ 4X400మీ. రిలే: మహమ్మద్‌ అనాస్‌ యహియా, నోహా నిర్మల్‌ టామ్‌, వీకే విస్మయ, జిస్నా మాథ్యూ


ఆర్చరీ (4)



  • పురుషుల రికర్వ్‌ వ్యక్తిగత విభాగం: అతాను దాస్‌, తరుణ్‌ దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌. పురుషుల టీమ్‌ ఈవెంట్‌లోనూ ఈ త్రయమే పాల్గొంటుంది.

  • మహిళల వ్యక్తిగత రికర్వ్‌: దీపికా కుమారి

  • మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌: దీపిక-అతాను


బ్యాడ్మింటన్ (4)



  • మహిళల సింగిల్స్‌: పీవీ సింధు

  • పురుషుల సింగిల్స్‌: సాయి ప్రణీత్‌

  • పురుషుల డబుల్స్‌: సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి


బాక్సింగ్ (9)



  1. పురుషుల 52కేజీ ఫ్లయ్‌వెయిట్‌: అమిత్‌ పంగల్‌

  2. పురుషుల 63కేజీ లైట్‌వెయిట్‌: మనీశ్‌ కౌశిక్‌

  3. పురుషుల 69కేజీ వెల్టర్‌వెయిట్‌: వికాస్‌ క్రిషన్‌

  4. పురుషుల 75కేజీ మిడిల్‌వెయిట్‌: ఆశీష్‌ కుమార్‌

  5. పురుషుల 91కేజీ సూపర్‌ హెవీవెయిట్‌: సతీశ్‌ కుమార్‌

  6. మహిళల 51కేజీ ఫ్లయ్‌వెయిట్‌: మేరీ కోమ్‌

  7. మహిళల 60కేజీ ఫ్లయ్‌వెయిట్‌: సిమ్రన్‌జిత్‌ కౌర్‌

  8. మహిళల 69కేజీ వెల్టర్‌వెయిట్‌: లవ్లీనా బొర్గోహేన్‌

  9. మహిళల 75కేజీ మిడిల్‌వెయిట్‌: పూజా రాణి


ఈక్వెస్ట్రియస్ (1)



  • ఫౌవాద్‌ మీర్జా


ఫెన్సింగ్ (1)



  • మహిళల సబ్రే: సీఏ భవానీ దేవి


గోల్ఫ్ (3)



  • పురుషుల వ్యక్తిగత: అనిర్బన్‌ లాహిరి, ఉదయన్‌ మనే

  • మహిళల వ్యక్తిగత: అదితి అశోక్‌


జిమ్నాస్టిక్స్​ (1) 



  • మహిళల వాల్ట్‌: ప్రణతి నాయక్‌


జూడో (1)



  • సుశీల దేవీ


రోయింగ్ (2)



  • అర్జున్, అరవింద్​ సింగ్


స్విమ్మింగ్ (3)



  • పురుషుల 220 మీ బటర్​ఫ్లై - సంజన్ ప్రకాశ్

  • పురుషుల 100మీ బ్యాక్​స్ట్రోక్- శ్రీహరి నటరాజ్

  • మహిళల 100మీ బ్యాక్​స్ట్రోక్​- మానా పటేల్


టెన్నిస్ (2)



  • మహిళల డబుల్స్- సానియా మీర్జా, అంకిత రైనా


టేబుల్ టెన్సిస్ (4)



  • శరత్ కమల్, సాతియన్ జ్ఞానశేఖరన్

  • సుథీర్థ ముఖర్జీ, మానిక బాత్రా


సెయిలింగ్ (4)



  1. నేత్రా కుమనన్

  2. విష్ణు శరవణన్

  3. కేసీ గణపతి, వరుణ్ టక్కర్


వెయిట్​ లిఫ్టింగ్ (1)



  • మీరాబాయ్ చాను


షూటింగ్



  1. 10మీ ఉమెన్స్​ ఎయిర్​ రైఫిల్- అంజుమ్ మౌద్గిల్, అపూర్వీ చండేలా

  2. 10మీ మెన్స్​ ఎయిర్​ రైఫిల్- దివ్యాంశ్​ సింగ్​ పాన్వార్, దీపక్​ కుమార్

  3. 10మీ ఉమెన్స్​ ఎయిర్​ పిస్టోల్- మను బాకర్, యశస్విని సింగ్ దేశ్వాల్

  4. 10మీ మెన్స్​ ఎయిర్​ పిస్టోల్- సౌరభ్​ చౌదరి, అభిషేక్ వర్మ

  5. 25మీ ఉమెన్స్​ పిస్టోల్- రహి సర్నోబాత్, ఎలావెనిల్ వలరివాన్

  6. 50మీ ఉమెన్స్​ రైఫిల్​ 3 పొజీషన్- తేజస్విని సావంత్

  7. 50మీ మెన్స్​ రైఫిల్ 3 పొజిషన్- సంజీవ్ రాజ్​పుత్, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్

  8. మెన్స్​ స్కీట్- అంగద్​ వీర్ సింగ్ బాజ్వా, మిరాజ్ అహ్మద్ ఖాన్


రెజ్లింగ్..



  • ఉమెన్స్ ఫ్రీస్టైల్- సీమా బిస్లా (50 కేజీ), వినేశ్ ఫోగాట్ (53 కేజీ), అన్షు మాలిక్ (57 కేజీ), సోనమ్ మాలిక్ (62 కేజీ)

  • మెన్స్​ ఫ్రీస్టైల్- రవి కుమార్ దహియా (57 కేజీ), బజరంగ్ పూనియా (65 కేొదజీ), దీపక్ పూనియా (86 కేజీ)


హాకీ


ఒలింపిక్స్​లో భారత పురుషుల హాకీ టీమ్ 20వ సారి బరిలోకి దిగుతోంది. వీరితో పాటు మహిళల హాకీ టీమ్ కూడా సత్తా చాటాలనుకుంటోంది.