టీమ్‌ఇండియాతో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గబ్బర్‌సేన నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 39 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దాంతో మూడు వన్డేల సిరీస్‌ను శ్రీలంక 1-2 తేడాతో కోల్పోయింది. అంతకుముందు భారత్ తొలి రెండు వన్డేలు గెలుపొందడంతో సిరీస్ కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక జట్టులో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(76; 98 బంతుల్లో 4x4, 1x6), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ భానుక రాజపక్స(65; 56 బంతుల్లో 12x4) కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 109 పరుగులు జోడించి లంక విజయానికి బలమైన పునాది నిర్మించారు. తర్వాత చారిత్ అసలంక (24; 28 బంతుల్లో 3x4), రమేశ్ మెండిస్(15 నాటౌట్; 18 బంతుల్లో 1x4) వీలైనన్ని పరుగులు చేశారు. భారత్ నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 39 ఓవర్లలో ఛేదించింది.
ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(76), భానుక రాజపక్స(65) ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు భారత్ ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైనా 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 225 పరుగులకే ఆలౌటైంది. వర్షం కారణంగా మ్యాచ్ సమయం వేస్ట్ కావడంతో.. 47 ఓవర్లకి మ్యాచ్‌ని అంపైర్లు కుదించారు. 43.1 ఓవర్లలోనే టీమిండియా కుప్పకూలిపోయింది. జట్టులో కనీసం ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకోలేకపోయారు. శ్రీలంక స్పిన్నర్లు అఖిల ధనంజయ, జయవిక్రమ మూడేసి వికెట్లు పడగొట్టారు.
* జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన అవిష్క ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.
* భారత ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు.
బతికిపోయిన సూర్యకుమార్
23 ఓవర్లకు భారత్ 147/3: జయవిక్రమ వేసిన 22.1 ఓవర్‌కు సూర్యకుమార్ బతికిపోయాడు. అతడు తొలి బంతిని ఎదుర్కోగా లంక బౌలర్ ఎల్బీగా అప్పీల్ చేశాడు. అంపైర్ ఔటిచ్చాడు. కానీ రివ్యూకు వెళ్లిన సూర్యకుమార్ అక్కడ నాటౌట్‌గా తేలాడు. బంతి వికెట్లకు నేరుగా పిచ్ అవ్వకపోవడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు.
ఆరేళ్ల తర్వాత..
టీమ్‌ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్ భారత్ తరఫున ఆరేళ్ల తర్వాత వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2015లో తొలిసారి టీ20 జట్టులో చోటు సంపాదించుకున్న అతడు అప్పుడు జింబాబ్వేపై జులై 19న తొలి టీ20 ఆడాడు. ఇక అప్పటి నుంచి మొత్తం ఏడు టీ20లే ఆడిన అతడు నేడు వన్డే అరంగేట్రం చేశాడు. దాంతో రెండు ఫార్మాట్ల మధ్య అంతరాయం ఆరేళ్లుగా నెలకొనడం గమనార్హం.
ఒకే వన్డేలో ఐదుగురు అరంగేట్రం
ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు ప్లేయర్స్‌కు ఒకే వన్డేలో తొలిసారి అవకాశం ఇచ్చింది టీమిండియా. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో ఆరు మార్పులతో బరిలోకి దిగిన ధావన్ సేన.. అందులో ఐదుగురు కొత్త ప్లేయర్స్‌ను తీసుకుంది. సంజు శాంసన్‌తోపాటు నితీష్ రాణా, కే గౌతమ్, చేతన్ సకారియా, రాహుల్ చహర్‌లు తమ తొలి వన్డే ఆడుతున్నారు. ఇలా ఒకే మ్యాచ్‌లో ఐదుగురు ప్లేయర్స్ ఇండియా తరఫున అరంగేట్రం చేయడం ఇది రెండోసారి మాత్రమే. తొలిసారి 1980లో ఇలా ఒకే వన్డేలో ఐదుగురు కొత్త వాళ్లకు అవకాశమిచ్చిన ఇండియన్ టీమ్.. మళ్లీ 41 ఏళ్ల తర్వాత దానిని రిపీట్ చేసింది.