IND Vs SL 1st ODI : శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ లో భారత్ 1-0 తో లీడ్ లో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటిన భారత్ శ్రీలంకను 67 పరుగుల తేడాతో ఓడించింది. సెంచరీతో రాణించిన విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. శ్రీలంకతో తొలి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ లు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 143 పరుగుల రికార్డు భాగస్వామ్యం అందించారు. రోహిత్ శర్మ (83), శుభ్ మన్ గిల్ (70) రాణించారు. విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ (87 బంతుల్లో 113 పరుగులు)తో శ్రీలంక ముందు 373 లక్ష్యం ఉంచింది భారత్. భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక బ్యాట్స్ మెన్ భారత్ పేసర్ల దాటికి క్రీజ్ లో నిలవలేకపోయారు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు, మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు, మహమ్మద్ షమీ, హార్థిక్ పాండ్యా, చాహల్ చెరో వికెట్ తీశారు.   


374 భారీ లక్ష్యాన్ని చేజింగ్ చేయడంలో తడబడిన శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ దసున్ శనక సెంచరీతో(88 బంతుల్లో 108 పరుగులు) అజేయంగా నిలవడంతో నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయిన శ్రీలంక 306 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాట్స్ మెన్ లో పాతుమ్ నిస్సాంక(80 బంతుల్లో 72 పరుగులు), ధనంజయ డి సిల్వా(40 బంతుల్లో 47 పరుగులు) రాణించారు.  శ్రీలంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్ల పడగొట్టగా, దిల్షన్ మధుశంక, చమిక కరుణరత్నే, దసున్ షనక, ధనంజయ డి సిల్వా చెరో వికెట్ తీశారు.  






కోహ్లీ, శనక సెంచరీలు 


గౌహతిలోని బర్సపరా స్టేడియంలో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, దసున్ శనక సెంచరీలతో ఆకట్టుకున్నారు. విరాట్ కోహ్లీ 87 బంతుల్లో 113 పరుగులు చేశాడు. కోహ్లీకి ఇది 73వ అంతర్జాతీయ సెంచరీ. శ్రీలంక కెప్టెన్ దసున్ శనక 88 బంతుల్లో అజేయంగా 108 పరుగులు చేయడంతో 50 ఓవర్ల కోటా పూర్తైన సరికి శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 306 వద్ద ఆట ముగించింది. శ్రీలంక కెప్టెన్ దసున్ శనక టాస్ గెలిచి ఆతిథ్య జట్టును మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ముందు బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది.  రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) 143 పరుగుల ఓపెనింగ్ స్టాండ్‌తో భారీ స్కోర్ కు బాటవేశారు. లంక బౌలర్లలో కసున్ రజిత మూడు వికెట్లు తీశాడు. అయితే అతను తన 10 ఓవర్ల స్పెల్‌లో 88 పరుగులను ఇచ్చాడు. శ్రీలంక ఛేజింగ్‌లో దసున్ షనక(108), పథౌమ్ నిస్సాంక (72), ధనంజయ డి సిల్వా (47) రాణించారు.  భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 57 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.