ఆరు వేర్వేరు ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్లలో గోల్స్ కొట్టిన రొనాల్డో రేర్ రికార్డుకు గుర్తుగా నైకీ ఈ స్పెషల్ ఎడిషన్ షూలను రిలీజ్ చేసింది. వీటిపై 'CR7' అని ప్రింట్ చేసి ఉంది.
Cristiano Ronaldo Special Golden Shoes: గ్రౌండ్ లోకి రాకముందే రొనాల్డో గోల్డెన్ కిక్.. నైకీ నుంచి స్పెషల్ కానుక, కొలంబియాతో పోరుకు నయా ప్లాన్!
కొలంబియాతో జరగబోయే కీలక మ్యాచ్ కు ముందు క్రిస్టియానో రొనాల్డో నైకీ డిజైన్ చేసిన స్పెషల్ గోల్డెన్ కలర్ షూస్ వేసుకుని ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు.

Cristiano Ronaldo Trains In Special Gold Scorpion Shoes: ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్ స్టేజ్ లో కొలంబియాతో జరగబోయే లాస్ట్ మ్యాచ్ కు ముందు పోర్చుగల్ ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో అందరి అటెన్షన్ క్యాచ్ చేశాడు. ఉజ్బెకిస్తాన్‌పై ట్విన్ గోల్స్ తో ఫామ్‌లోకి వచ్చిన రొనాల్డో, ఇప్పుడు కొలంబియా మ్యాచ్ లోనూ గోల్స్ వరద పారించి గోల్డెన్ బూట్ రేసులో ముందుకు వెళ్లాలని చూస్తున్నాడు. ప్రెజెంట్ పోర్చుగల్ టీమ్ ఒక విక్టరీ, ఒక డ్రాతో నాలుగు పాయింట్లు సాధించి గ్రూప్ లో సెండ్ ప్లేస్ లో ఉంది. రెండు మ్యాచులూ గెలిచి టాప్ లో ఉన్న కొలంబియాను ఓడించి రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ బెర్త్‌ను సేఫ్ గా కన్ఫర్మ్ చేసుకోవాలని రొనాల్డో ఆర్మీ ప్లాన్ చేస్తోంది.
ఆరు వరల్డ్ కప్‌ల రేర్ రికార్డ్..
ఈ క్రూషియల్ మ్యాచ్ కు ముందు రొనాల్డో సరికొత్త గోల్డెన్ కలర్ షూస్ వేసుకుని ట్రైనింగ్ సెషన్ లో కనిపించాడు. తాజా రిపోర్ట్ ప్రకారం, వరుసగా ఆరు వేర్వేరు ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్లలో గోల్స్ కొట్టిన వరల్డ్ ఏకైక ప్లేయర్‌గా రొనాల్డో క్రియేట్ చేసిన రేర్ రికార్డుకు రెస్పెక్ట్ ఇస్తూ ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ నైకీ (Nike) ఈ స్పెషల్ ఎడిషన్ ను రిలీజ్ చేసింది. 'గోల్డ్ స్కార్పియన్ మెర్క్యురియల్ సూపర్‌ఫ్లై 11' పేరుతో డిజైన్ చేసిన ఈ షూస్ పై రొనాల్డో అఫీషియల్ మోనికర్ 'CR7' అని వైట్ కలర్ లో ప్రింట్ చేశారు. ఈ లగ్జరీ లుక్ షూస్ ప్రెజెంట్ సోషల్ media లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
యుసేబియో వరల్డ్ రికార్డ్ బద్దలు..
ఉజ్బెకిస్తాన్‌ను 5-0 తో చిత్తు చేసిన మ్యాచ్ లో రొనాల్డో రెండు గోల్స్ తో టీమ్‌ను ముందుండి నడిపించాడు. ఆ మ్యాచ్ లో నునో మెండిస్, రాఫెల్ లియావో కూడా గోల్స్ కొట్టగా, ఉజ్బెకిస్తాన్ కీపర్ అబ్దువోహిద్ నెమటోవ్ సెల్ఫ్ గోల్ వేయడంతో ఫాబియో కానవారో టీమ్‌కు ఘోర పరాజయం ఎదురైంది. ఈ ట్విన్ గోల్స్ తో రొనాల్డో పోర్చుగల్ ఫుట్‌బాల్ హిస్టరీలోనే వరల్డ్ కప్ లో హైయెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. టోటల్ గా 10 గోల్స్ పూర్తి చేసుకుని పోర్చుగల్ లెజెండ్ యుసేబియో పేరిట ఉన్న 9 గోల్స్ రికార్డును రొనాల్డో బ్రేక్ చేశాడు. 1965 బాలోన్ డి ఓర్ విన్నర్ అయిన యుసేబియో 1966 వరల్డ్ కప్ లో పోర్చుగల్‌ను థర్డ్ ప్లేస్ లో నిలిపాడు. వీరి తర్వాత పౌలేటా 4 గోల్స్ తో థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు.
డార్క్ ఫేజ్ ఎండ్..
ఉజ్బెకిస్తాన్ మ్యాచ్ లో కొట్టిన గోల్స్ తో రొనాల్డో ఇంటర్నేషనల్ కెరీర్ లో ఉన్న ఒక పెద్ద బ్యాడ్ ప్యాచ్ ఎండ్ అయింది. మేజర్ టోర్నమెంట్లలో (వరల్డ్ కప్, యూరో కప్ కలిపి) వరుసగా 10 మ్యాచుల పాటు గోల్స్ చేయలేకపోయిన రొనాల్డో, లాస్ట్ మ్యాచ్ తో మళ్లీ కింగ్ లా కంబ్యాక్ ఇచ్చాడు. ఓపెనింగ్ మ్యాచ్ లో డీఆర్ కాంగో టీమ్ తో 1-1 డ్రా చేసుకోవడం వల్ల పోర్చుగల్ ఆటతీరుపై ఫ్యాన్స్ నుంచి విమర్శలు వచ్చాయి. కానీ ఉజ్బెకిస్తాన్‌పై సాధించిన బిగ్ విక్టరీతో పోర్చుగల్ క్యాంప్ లో మళ్లీ జోష్ వచ్చింది, పైగా గోల్ డిఫరెన్స్ కూడా బాగా మెరుగైంది. శనివారం కొలంబియాపై రొనాల్డో తన గోల్డెన్ షూస్ తో మ్యాజిక్ చేయడం ఖాయమని తెలుస్తోంది.
Frequently Asked Questions
రొనాల్డో ధరించిన కొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్ ప్రత్యేకత ఏమిటి?
ఫిఫా వరల్డ్ కప్‌లలో రొనాల్డో సాధించిన సరికొత్త రికార్డు ఏమిటి?
ఉజ్బెకిస్తాన్‌పై రెండు గోల్స్ తో, రొనాల్డో పోర్చుగల్ తరపున వరల్డ్ కప్‌లలో అత్యధిక గోల్స్ (10) చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇతను యుసేబియో 9 గోల్స్ రికార్డును బద్దలు కొట్టాడు.
కొలంబియాతో జరగబోయే మ్యాచ్ పోర్చుగల్ కు ఎందుకు కీలకం?
పోర్చుగల్ ప్రస్తుతం గ్రూప్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది. కొలంబియాను ఓడించి రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ బెర్త్‌ను సేఫ్ గా కన్ఫర్మ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది.
ట్రెండింగ్ వార్తలు






















