అన్వేషించండి

IND VS BRA Football Match Update: ఆతిథ్య గడ్డపై సాంబార్ల గోల్స్ వర్షం.. భారత ఫుట్‌బాల్ పోరాటానికి బ్రెజిల్ చెక్, సాల్ట్ లేక్ వేదికగా బంప‌ర్ విక్ట‌రీ

కోల్‌కతాలో బ్రెజిల్‌తో జరిగిన చారిత్రక మ్యాచ్‌లో భారత జట్టు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్లు 4-0 తేడాతో ఘన విజయం సాధించారు.

Canarinho Outclass Indian Tigers In Historic International Friendly At Salt Lake:  కోల్‌కతాలోని ప్రఖ్యాత సాల్ట్ లేక్ స్టేడియం వేదికగా శనివారం జరిగిన అరుదైన అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఐదుసార్లు ప్రపంచకప్ విజేత బ్రెజిల్ తమ క్లాస్ ఆటతీరును ప్రదర్శించింది. భారత సీనియర్ పురుషుల జట్టుతో తొలిసారి తలపడిన ఈ పోరులో బ్రెజిల్ 4-0 తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాలు నగరానికి వస్తున్నారన్న వార్తతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొన్నప్పటికీ, 65 వేల సామర్థ్యం ఉన్న మైదానం సగం మాత్రమే నిండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. రియల్ మాడ్రిడ్ స్టార్ వినీసియస్ జూనియర్, మార్కిన్హోస్ లాంటి దిగ్గజాలు బరిలోకి దిగినప్పటికీ టికెట్ ధరలు భారీగా ఉండటమే ప్రేక్షకులు తక్కువగా రావడానికి కారణమని విమర్శలు వచ్చాయి. ప్రారంభ ధర రూ.999 ఉన్న టికెట్లు క్షణాల్లో అమ్ముడుపోగా, తర్వాతి శ్రేణి టికెట్లు రూ.3,500 నుంచి రూ.25,000 వరకు ఉండటంతో సాధారణ అభిమానులు దూరమయ్యారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 138వ స్థానంలో ఉన్న ఇండియాకు ఈ మ్యాచ్ అగ్రశ్రేణి జ‌ట్టుని ఎదుర్కొనేందుకు మంచి అవకాశంగా నిలిచింది.

గోల్‌పోస్ట్ వద్ద గుర్ ప్రీత్ వీరోచిత విన్యాసాలు.. ఎస్టీవో మెరుపు గోల్
మ్యాచ్ ప్రారంభం నుంచే బ్రెజిల్ ఆటగాళ్లు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఎనిమిదో నిమిషంలోనే వినీసియస్ కొట్టిన ప్రమాదకరమైన షాట్‌ను భారత కెప్టెన్, గోల్‌కీపర్ గుర్ ప్రీత్ సింగ్ సంధు అద్భుత డైవ్‌తో అడ్డుకున్నాడు. భారత్ కూడా కొన్ని సార్లు ఎదురుదాడి చేసి బ్రెజిల్ డిఫెన్స్‌ను పరీక్షించింది. అయితే 28వ నిమిషంలో చెల్సియా స్టార్ ఎస్టీవో తన ఎడమకాలితో కొట్టిన మెరుపు షాట్ గుర్ ప్రీత్‌‌ను దాటుకుని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. ఈ గోల్‌తో భారత్ డిఫెన్స్ ఒత్తిడికి గురైంది. అనంతరం 42వ నిమిషంలో పెడ్రో రెండో గోల్ నమోదు చేసి బ్రెజిల్‌కు తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు.

రాణించిన మన్వీర్ సింగ్.. సబ్‌స్టిట్యూట్ లినో డబుల్ స్ట్రైక్
రెండో అర్ధభాగంలో భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడటానికి ప్రయత్నించారు. 55వ నిమిషంలో భారత స్టార్ మన్వీర్ సింగ్ సంధించిన బలమైన షాట్ గోల్ అయ్యేలా కనిపించినప్పటికీ, బ్రెజిల్ కీపర్ అప్రమత్తంగా ఆపి భారత్‌కు నిరాశ మిగిల్చాడు. ఆ వెంటనే వినీసియస్ స్థానంలో బరిలోకి వచ్చిన శామ్యూల్ లినో 58వ నిమిషంలో భారత రక్షణ శ్రేణి తప్పిదాన్ని అవకాశంగా మలుచుకుని మూడో గోల్ చేశాడు. ఆఖరి విజిల్‌కు కొద్ది క్షణాల ముందు లినో వ్యక్తిగతంగా రెండో గోల్ సాధించడంతో బ్రెజిల్ 4-0తో స్పష్టమైన ఆధిక్యంతో విజయాన్ని అందుకుంది.

పునర్నిర్మాణంలో బ్రెజిల్ జట్టు.. పాఠాలు నేర్చిన భారత్
జూలై ప్రపంచకప్‌లో నార్వే చేతిలో అనూహ్య ఓటమి చవిచూసిన తర్వాత కార్లో అన్సెలొట్టి నేతృత్వంలోని బ్రెజిల్ జట్టు తమ పునర్నిర్మాణ బాటలో సాగుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల తర్వాత ఈ విజయంతో బ్రెజిల్ ఊపు తెచ్చుకుంది. ఇంతటి భారీ స్థాయి అంతర్జాతీయ మ్యాచ్ ద్వారా భారత ఫుట్‌బాల్ ఎన్నో కీలక పాఠాలను ఒడిసిపట్టింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget