IND vs GHA, Men's Hockey : భారత పురుషుల హాకీ జట్టు కామన్ వెల్త్ గేమ్స్ 2022 లో శుభారంభం చేసింది. భారత్ తన మొదటి మ్యాచ్‌లో ఘనాతో తలపడింది. ఈ మ్యాచ్ లో ఘనాపై 11-0 తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. 






బర్మింగ్‌హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో మన్‌ప్రీత్ సింగ్, శ్రీజేష్ నేతృత్వంలోని భారత పురుషుల హాకీ జట్టు పూల్ B పోరులో ఘనాతో తలపడింది. ఘనాపై పెనాల్టీ కార్నర్ నుంచి మొదటి నిమిషంలోనే అభిషేక్ భారత్ కు ఆధిక్యాన్ని అందించాడు. హర్మాన్ ప్రీత్ సింగ్ భారత హాకీ జట్టు ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. హర్మాన్ ప్రీత్ సింగ్ రెండో గోల్ చేశారు. ఆ తర్వాత షంషేర్ సింగ్ గోల్ చేయడంతో భారత్ ఆధిక్యం 3-0కు చేరింది.






హర్మాన్ ప్రీత్ హ్యాట్రిక్


ఘనాతో జరిగిన భారత పురుషుల హాకీ జట్టులో ఆకాశ్‌దీప్ సింగ్ నాలుగో గోల్ చేశాడు. జుగ్రాజ్ పెనాల్టీ స్ట్రైక్‌ను గోల్ గా మార్చాడు. జుగ్‌రాజ్, ఆకాష్‌దీప్ హాఫ్-టైమ్ విరామానికి ముందు ఘనాపై నాల్గో, ఐదవ గోల్‌లు చేశారు. పసికూనలు ఘనాపై భారత్ హాకీ జట్టు తడాఖా చూపింది. రెండో క్వార్టర్ పూర్తి అయ్యే సమయానికి 5-0 ఆధిక్యంలో ఉన్న భారత్ మూడో క్వార్టర్‌ను కూల్ గా ప్రారంభించింది. హర్మాన్ ప్రీత్ మూడో క్వార్టర్ లో మరో గోల్ చేయడంతో భారత్ ఆధిక్యం ఆరుకు చేరింది. ఈ మ్యాచ్ లో హర్మాన్ కు ఇది రెండో గోల్. పసికూన ఘనా ఏ సమయంలోనూ భారత్ కు పోటీ ఇవ్వలేకపోయింది. మ్యాచ్ ఆరంభం నుంచి భారత్ ఆధిక్యత ప్రదర్శించింది. భారత పురుషుల హాకీ జట్టు ఘనాపై 11-0 తేడాతో విజయం సాధించింది. హర్మాన్ ప్రీత్ ఈ మ్యాచ్ లో హ్యాట్రిక్ గోల్స్ చేశాడు.