Cristiano Ronaldo: ఆటలోనే కాదు ఆదాయంలోనూ క్రిస్టియానో రొనాల్డో రికార్డు కొట్టాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసగా మూడో ఏడాది అత్యధిక సంపాదన కలిగిన వ్యక్తిగా నిలిచాడు. 2017 సౌదీ అరేబియాకు వెళ్లిన తర్వాత గత జులైలో ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందే అథ్లెట్‌గా రొనాల్డో నిలిచాడు. తాజాగా 2023 ఇన్‌స్టాగ్రామ్ రిచ్ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇన్‌స్టాగ్రామ్ షెడ్యూలింగ్ టూల్ హాప్పర్ హెచ్‌క్యూ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఆదాయలను రికార్డ్ చేస్తుంది. ప్రతి పోస్ట్‌కు వినియోగదారు ఎంత వసూలు చేస్తున్నారో అంతర్గత, పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా జాబితా రూపొందించింది.
హాప్పర్ హెచ్‌క్యూ ప్రకారం, ఈ పోర్చుగల్ ఆటగాడు సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో 600 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ప్రతి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు $3.23 మిలియన్లు చార్జ్ చేస్తున్నాడు. ఆయన తరువాత స్థానంలో లియోనెల్ మెస్సీ ఉన్నాడు. $2.6 మిలియన్లు సంపాదిస్తూ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
ఈ జాబితాలో ఈ ఇద్దరు ఫుట్‌బాల్ టైటాన్‌లను ఇతర అథ్లెట్‌ల కంటే ముందు ఉన్నారు. గాయని, నటి సెలీనా గోమెజ్, రియాలిటీ స్టార్, మేకప్ మొగల్ వంటి ప్రముఖులు, కైలీ జెన్నర్, నటుడు డ్వేన్ 'ది రాక్' జాన్సన్, మరో ఇద్దరు అథ్లెట్లు మాత్రమే టాప్ 20లో నిలిచారు. ఇందులో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బ్రెజిలియన్ ఫుట్‌బాల్ ఆటగాడు నెయ్‌మార్‌కు టాప్ 20లో స్థానం దక్కింది
నెయ్‌మార్ తన ప్యారిస్ సెయింట్-జర్మైన్ సహచరుడు కైలియన్ ఎంబప్పే కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడు. దీనిపై హాప్పర్ హెచ్‌క్యూ సహ వ్యవస్థాపకుడు మైక్ బందర్ మాట్లాడుతూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ద్వారా వచ్చే వార్షిక ఆదాయం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండటం నన్ను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తోందని వ్యాఖ్యానించారు.
అగ్రస్థానంలో ఉన్న స్థిరమైన ఆటగాళ్లు ఉండడంతో తనను ఎక్కువగా ఆకర్షిస్తుందని, సాంప్రదాయ ఇన్‌ఫ్లుయెన్సర్ స్టేటస్‌పై ఇప్పటికీ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. రొనాల్డో, మెస్సీలు స్టేడియంలో మాత్రమే కాకుండా డిజిటల్ గోళంలో కూడా ఆధిపత్యం చెలాయిస్తున్నారని అన్నారు. వారి వ్యక్తిగత బ్రాండింగ్ సాధారణ వ్యక్తులపై ప్రభావం చూపుతుందన్నారు. టిక్‌టాక్ స్టార్ ఖాబీ లేమ్, అత్యధికంగా సంపాదిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, జాబితాలో 40వ స్థానంలో ఉన్నారు. రొనాల్డో తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టింగ్‌ల కోసం లేమ్ కంటే పది రెట్లు ఎక్కువ ఆదాయం ఆర్జిస్తున్నాడు.