By: ABP Desam | Updated at : 13 Sep 2023 01:09 PM (IST)
యుజ్వేంద్ర చాహల్ ( Image Source : Twitter )
Yuzvendra Chahal: ఆసియా కప్‌తో పాటు త్వరలో జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌లో కూడా భారత జట్టు తరఫున చోటు కోల్పోయిన టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కౌంటీ క్రికెట్‌లో మాత్రం ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే ఇంగ్లాండ్ లోని కెంట్ టీమ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న చాహల్.. తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
ఇంగ్లాండ్‌లోని కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ వన్ - 2023లో భాగంగా నాటింగ్‌హమ్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో కెంట్ తరఫున ఎంట్రీ ఇచ్చిన చాహల్.. 29 ఓవర్లు వేసి 63 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆట మూడో రోజు చాహల్‌కు బౌలింగ్ వేసే అవకాశం దక్కగా చాహల్ ఇందులో ఏకంగా పది మెయిడిన్ ఓవర్లు వేయడం గమనార్హం.
What a peach from Yuzvendra Chahal in the County Championship.pic.twitter.com/ej1A4vuX5z
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2023
నాటింగ్‌హమ్‌షైర్ బ్యాటర్లలో మాథ్యూ మోంటగొమరీ, లిండన్ జేమ్స్, కల్విన్ హరీసన్‌లను చాహల్ పడగొట్టాడు. కెంట్ పేసర్ ఆరోన్ నిజ్జర్ 32 ఓవర్లు వేసి 67 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇతడు ఇంగ్లాండ్ దేశస్తుడే అయినా భారత మూలాలు ఉన్న పేసరే కావడం విశేషం. ఈ ఇద్దరూ కట్టడిచేయడంతో నాటింగ్‌హమ్‌షైర్ 265 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కెంట్.. 115.4 ఓవర్లలో 446 పరుగులకు ఆలౌట్ అయింది.
Chahal will be playing for Kent in County Cricket. [TOI]
— Johns. (@CricCrazyJohns) September 6, 2023
- Welcome to red ball cricket, Yuzi. pic.twitter.com/Ud8ch9mVD4
చాహల్‌కు కౌంటీ క్రికెట్‌లో ఇదే తొలి సీజన్. ఇంతవరకూ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 51 ఇన్నింగ్స్‌లలో 87 వికెట్లు తీసిన చాహల్.. కౌంటీలలో ఇదే తొలి సీజన్. దేశవాళీలో తన సొంత రాష్ట్రం హర్యానా తరఫున రంజీలు ఆడిన చాహల్ చివరిసారిగా 2022లో రంజీ ట్రోఫీ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. భారత్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పలు మ్యాచ్‌లు ఆడిన చాహల్ ఇంతవరకూ రెడ్ బాల్ క్రికెట్‌లో మాత్రం ఎంట్రీ ఇవ్వలేదు. కెంట్ అనుభవం ద్వారా చాహల్ టెస్టు క్రికెట్ లోకి ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి. ఇక వన్డే వరల్డ్ కప్‌లో చాహల్‌కు చోటుదక్కడంపై టీమిండియా మాజీలు సెలక్షన్ కమిటీపై విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ప్రపంచకప్ జట్టులో యుజ్వేంద్ర చాహల్ లేకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. అతడు ప్యూర్ మ్యాచ్ విన్నర్’ అని రాసుకొచ్చాడు.
🛎️
— RAJESH CHAUDHARY (@RAJESHC66643392) September 11, 2023
Indian Cricketer Yuzvendra Chahal makes his county debut for Kent against Nottinghamshire.#yuzvendrachahal #tuzi #yuzichahal #BCCI #Nottinghamshire #kentcricket pic.twitter.com/UgyAX5HUky
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
IND vs AUS, 2nd ODI: 2 సెంచరీలు 2 హాఫ్ సెంచరీలు - ఆసీస్‌కు టీమ్‌ఇండియా టార్గెట్ 400
IND vs AUS, 2nd ODI: సాహో శ్రేయస్.. జయహో శుభ్‌మన్! ఆసీస్‌పై కుర్రాళ్ల సెంచరీ కేక
IND vs AUS 2nd ODI: ఆసీస్‌దే రెండో వన్డే టాస్ - టీమ్‌ఇండియా ఫస్ట్ బ్యాటింగ్
IND vs AUS 2nd ODI: రెండో వన్డేకు బుమ్రా దూరం! బీసీసీఐ 'ఎమర్జెన్సీ' ట్వీట్!
Asian Games: బంగ్లా 51కే ఆలౌట్ - ఆసియా టీ20 ఫైనల్‌కు స్మృతి మంధాన సేన
YCP Counter To Purandeswari: ఈ తెలివితోనే మీరు కేంద్రమంత్రిగా పనిచేశారా? - పురందేశ్వరిపై వైసీపీ సెటైర్లు
మళ్ళీ ప్రభాస్ తో కలిసి నటిస్తారా? - డార్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్!
Motkupalli Narasimhulu: జగన్ ప్రభుత్వంతో ఏపీలో దుర్మార్గాలు, జనం నవ్వుకుంటున్నారు - దీక్షలో మోత్కుపల్లి కీలక వ్యాఖ్యలు
ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రధాని పచ్చజెండా, తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు
/body>