India vs England Highest Test Score: భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో మ్యాచ్ బుధవారం నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు గురువారం రెండో రోజున 587 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్‌లో భారత జట్టు 600 మార్కును దాటుతుందని అంతా అంచనా వేశారు. కానీ కెప్టెన్ గిల్ అవుట్ అయిన తర్వాత ఎక్కువ సమయం భారత్ బ్యాట్స్‌మెన్‌ పోరాడలేకపోయారు. 

ఇప్పటి వరకు ఇంగ్లండ్‌లో భారత జట్టు మూడుసార్లు మాత్రమే 600 మార్కును దాటింది. మరోసారి 600 స్కోరు చూస్తామని క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురు చూశారు. కానీ ఆ ముచ్చట తీరలేదు. ఇప్పటి వరకు టీమ్ ఇండియా 2007లో ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌లో అత్యధిక స్కోరు సాధించింది.

18 సంవత్సరాల క్రితం అత్యధిక స్కోరు భారత జట్టు 2007లో ఓవల్ మైదానంలో అత్యధిక స్కోరు సాధించింది. భారత జట్టు ఈ మైదానంలో 664 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, ఎంఎస్ ధోనీ అద్భుతమైన అర్ధ సెంచరీలు చేశారు. అదే సమయంలో అనిల్ కుంబ్లే ఈ మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. అందరి అద్భుతమైన ఆట తీరుతో భారత్ పెద్ద స్కోరు చేయగలిగింది. 

ఇంగ్లండ్‌లో భారత్ రెండో అత్యధిక స్కోరు లీడ్స్ మైదానంలో 628 పరుగులు చేసింది. మూడో అత్యధిక స్కోరు ఓవల్ మైదానంలో 606 పరుగులు చేసింది.

ఎడ్జ్‌బాస్టన్‌లో 587 పరుగులు  ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు రెండో రోజున భారత జట్టు ఏడు వికెట్ల నష్టానికి 564 పరుగులు చేసింది. ఆ సమయంలో ఇంకా శుభ్‌మన్‌ గిల్‌ క్రీజ్‌లో ఉన్నాడు. అతను ట్రిపుల్ సెంచరీ చేస్తాడు. భారత్ స్కోర్ కూడా 600 దాటిపోతుందని అంతా భావించారు. కానీ అప్పుడే శుభ్‌మన్‌ గిల్ అవుటం... అనంతరం రెండు వికెట్లు పడటానికి ఎక్కువ సమయం పట్టలేదు. 

దీంతో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 151 ఓవర్లలో 587 పరుగులు సాధించింది. శుభ్‌మాన్ గిల్ డబుల్ సెంచరీకి తోడు యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా అద్భుతమైన సహాకారం అందించారు. 

ఎలైట్ క్లబ్‌లో చేరిన శుభ్‌మన్ గిల్భారత్ టెస్టు జట్టు కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో అద్భుతమైన డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ట్రిపుల్ సెంచరీ సాధిస్తాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా 269 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇప్పటి వరకు 1979లో ది ఓవల్‌లో సునీల్ గవాస్కర్ చేసిన 221 పరుగులే ఇంగ్లండ్‌లో అత్యధిక స్కోరు. ఇప్పుడు దాన్ని గిల్ అధిగమించాడు. 

ఇంగ్లాండ్‌లో భారత ఆటగాళ్ళు చేసిన 10 అతిపెద్ద నాక్‌లు:శుబ్‌మన్ గిల్ - 269 (ఎడ్జ్‌బాస్టన్, 2025)సునీల్ గవాస్కర్ - 221 (ది ఓవల్, 1979)రాహుల్ ద్రవిడ్ - 217 (ది ఓవల్, 2002)సచిన్ టెండూల్కర్ - 193 (లీడ్స్, 2002)రవి శాస్త్రి - 187 (ది ఓవల్, 1990)వినూ మన్కడ్ - 184 (లార్డ్స్, 1952)మహమ్మద్ అజారుద్దీన్ - 179 (మాంచెస్టర్, 1990)సచిన్ టెండూల్కర్ - 177 (నాటింగ్‌హామ్, 1996)దిలీప్ వెంగ్‌సర్కార్ - 157 (లార్డ్స్, 1982)విరాట్ కోహ్లీ – 149 (ఎడ్జ్‌బాస్టన్, 2018)

విదేశాల్లో అరుదైన ఫీట్గిల్ డబుల్ సెంచరీ మైలురాయి 2016లో నార్త్ సౌండ్‌లో విరాట్ కోహ్లీ డబుల్‌ సెంచరీ తర్వాత విదేశీ టెస్టులో భారత కెప్టెన్ చేసిన రెండో డబుల్ సెంచరీ.