అన్వేషించండి

Kohli Sachin Milestone: సచిన్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన  కోహ్లీ.. వన్డే చేజింగ్‌లో సరికొత్త చరిత్ర, నంబర్ 3లో అరుదైన ఘనత

ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించి వన్డే చేజింగ్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Kohli Breaks Master Record: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత క్రికెట్ రారాజు విరాట్ కోహ్లీ పరుగుల సునామీ సృష్టించి చరిత్ర పుటలను తిరగరాశాడు. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ మైదానంలో కేవలం 51 బంతుల్లోనే 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 74 పరుగులు చేసిన కోహ్లీ, వన్డే రన్ చేజింగ్‌లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఆల్ టైమ్ వరల్డ్ రికార్డును తుడిచిపెట్టాడు. ఇప్పటివరకు సచిన్ 242 ఇన్నింగ్స్‌లలో 42.33 సగటుతో 17 శతకాలు, 52 అర్ధ శతకాలతో 8,720 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉండేవాడు. తాజా మెరుపు ఇన్నింగ్స్‌తో కోహ్లీ 169 ఇన్నింగ్స్‌లలోనే 66.21 అద్భుత సగటుతో 30 సెంచరీలు, 46 అర్ధ సెంచరీల సాయంతో 8,741 పరుగులు పూర్తి చేసుకుని చేజ్ మాస్టర్‌గా తన కిరీటాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. విజయవంతమైన చేజింగ్‌లలో చూస్తే 108 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 89.95 సగటు, 98కి పైగా స్ట్రైక్ రేట్‌తో 25 సెంచరీలు బాది 6,477 పరుగులు నమోదు చేయడం విశేషం.

అరుదైన మైలురాయి..
ఈ మ్యాచ్‌తోనే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ వన్డేల్లో మూడో స్థానంలో 13,000 పరుగుల మైలురాయిని దాటిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా అవతరించాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ ఘనతకు 12 పరుగుల దూరంలో ఉన్న అతడు, 186 పరుగుల లక్ష్య ఛేదనలో ఏడో ఓవర్లో తాను ఆడిన 13వ బంతికే ఈ చారిత్రక రికార్డును అందుకున్నాడు. నంబర్ 3 స్థానంలో 251 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ 61.61 సగటుతో 48 శతకాలు, 70 అర్ధ శతకాలతో మొత్తం 13,062 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ స్థానంలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ (330 ఇన్నింగ్స్‌లలో 12,662 పరుగులు) కంటే కోహ్లీ చాలా తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకోవడమే కాకుండా అతడితో ఉన్న వ్యత్యాసాన్ని మరింత పెంచాడు. ప్రపంచ క్రికెట్‌లో ఈ స్థానంలో 10 వేల పరుగులు దాటిన ఏకైక బ్యాటర్లుగా వీరిద్దరూ మాత్రమే ఉన్నారు. కుమార సంగక్కర (9,747), జాక్వెస్ కల్లిస్ (7,774), కేన్ విలియమ్సన్ (6,504), బాబర్ ఆజం (6,054), జో రూట్ (5,525) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

రికీ పాంటింగ్ రికార్డు సమం: కివీస్‌పై అత్యధిక పరుగులు
న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ రికార్డును కూడా విరాట్ కోహ్లీ సమం చేశాడు. పాంటింగ్ 50 ఇన్నింగ్స్‌లలో 45.83 సగటుతో 1,971 పరుగులు చేయగా, కోహ్లీ కేవలం 37 ఇన్నింగ్స్‌లలోనే 57.97 సగటు, 97.86 స్ట్రైక్ రేట్‌తో ఏడు శతకాలు, 11 అర్ధ శతకాలతో సరిగ్గా 1,971 పరుగులు పూర్తి చేసి ఆ స్థానాన్ని పంచుకున్నాడు.

2026లో తిరుగులేని జోరు..
ప్రస్తుత 2026 క్యాలెండర్ ఇయర్ లో విరాట్ కోహ్లీ అసాధారణ ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఆడిన 10 వన్డే ఇన్నింగ్స్‌లలో 69.55 అద్భుత సగటు, 120.61 మెరుపు స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 626 పరుగులు పిండుకున్నాడు. ఇందులో రెండు శతకాలు, నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. వెస్టిండీస్‌పై 88 బంతుల్లోనే అజేయంగా 139 పరుగులు చేసిన కోహ్లీ, రాబోయే వన్డే ప్రపంచకప్‌కు తాను ఎంత పక్కాగా సిద్ధమవుతున్నాడో తన బ్యాట్ ద్వారా నిరూపిస్తున్నాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND Playing XI Vs NZ: కివీస్ తో రేపే నాలుగో వన్డే.. టీమిండియాలో మార్పులు.. ఆస‌క్తిక‌రంగా ప్లేయింగ్ లెవ‌న్!
కివీస్ తో రేపే నాలుగో వన్డే.. టీమిండియాలో మార్పులు.. ఆస‌క్తిక‌రంగా ప్లేయింగ్ లెవ‌న్!
IND VS PAK Final: కెప్టెన్ రాయ్‌చందానీ, ఆర్యవీర్ సెహ్వాగ్ మెరుపులు.. అఫ్గాన్ చిత్తు.. టీమిండియా బంప‌ర్ విక్టరీ, ఫైనల్లో పాకిస్తాన్‌తో ఢీ
కెప్టెన్ రాయ్‌చందానీ, ఆర్యవీర్ సెహ్వాగ్ మెరుపులు.. అఫ్గాన్ చిత్తు.. టీమిండియా బంప‌ర్ విక్టరీ, ఫైనల్లో పాకిస్తాన్‌తో ఢీ
Pat Cummins Sandpapergate: శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
Axar Patel Captaincy: కెప్టెన్సీ వద్దంటూ DCకి అక్షర్ ఊహించని షాక్.. యాజమాన్యానికి కొత్త తలనొప్పి, పంత్ రీఎంట్రీతో మారనున్న సమీకరణాలు
కెప్టెన్సీ వద్దంటూ DCకి అక్షర్ ఊహించని షాక్.. యాజమాన్యానికి కొత్త తలనొప్పి, పంత్ రీఎంట్రీతో మారనున్న సమీకరణాలు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana IPS Transfers 2026: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
AP Investment Protection Act : పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
AP Local Body Elections: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
Ramayana Collections : రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
Pat Cummins Sandpapergate: శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
Alcohol Release Date : అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget