అన్వేషించండి

World's Richest Cricketers 2026: పరుగుల వీరులే కాదు వ్యాపార సామ్రాజ్య అధిపతులు కూడా! కోహ్లీ, ధోనీ ఆస్తుల అసలు రహస్యం ఇదే!

World's Richest Cricketers 2026: ప్రపంచ క్రికెట్‌లో  పరుగుల వీరులే కాదు, కాసుల వర్షం కురిపించే కుబేరులు వీరే. ధోనీ, కోహ్లీ వేల కోట్ల ఆస్తులు, వారి వ్యాపార సామ్రాజ్య రహస్యాల గురించి తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విరాట్ కోహ్లీ ఆటతో పాటు బ్రాండ్ల ద్వారా ఆదాయం ఆర్జిస్తున్నారు.
  • ధోని రిటైర్మెంట్ తర్వాత కూడా పెట్టుబడులతో సంపద పెంచుకుంటున్నారు.
  • సచిన్ టెండూల్కర్ వ్యాపార పెట్టుబడులతో ధనవంతుడిగా కొనసాగుతున్నారు.
  • ఐపీఎల్, సోషల్ మీడియా వల్ల క్రికెటర్ల ఆదాయం గణనీయంగా పెరిగింది.

World's Richest Cricketers 2026: క్రికెట్ అంటే భారత్‌లో కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు. అది ఒక భావోద్వేగం. ఒక మతం. అయితే ఆధునిక కాలంలో క్రికెట్ అనేది కేవలం బ్యాట్, బాల్‌కు పరిమితం కాకుండా ఒక భారీ వ్యాపార సామ్రాజ్యంగా రూపాంతరం చెందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎలైట్‌ క్రికెటర్లు ఇప్పుడు కేవలం ప్రొఫెషనల్ కాంట్రాక్టుల ద్వారానే కాకుండా, అంతర్జాతీయ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, తెలివైన వాణిజ్య పెట్టుబడుల ద్వారా భారీగా సంపదను ఆర్జిస్తున్నారు. 2026 నాటికి ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెటర్ల జాబితాను పరిశీలిస్తే, భారతీయ ఆటగాళ్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. 

వేల కోట్ల బ్రాండ్‌లకు ఐకాన్‌గా విరాట్ కోహ్లీ

ప్రస్తుతం తరం క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ ఆటతోపాటు స్టైల్ ఐకాన్‌గా ఉన్నారు. దీంతో కోహ్లీ ఒక గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగారు. కోహ్లీ నికర ఆస్తి విలువ దాదాపు వెయ్యికోట్లకుపైగా ఉంది. కోహ్లీ ఆదాయం కేవలం బీసీసీఐ కాంట్రాక్టులు లేదా ఐపీఎల్ పారితోషికాలకే పరిమితం కాలేదు. అతను ప్రీమియం ఫ్యాషన్‌ లేబుల్స్‌, ఫిట్‌నెస్‌ సెంటర్‌ చైన్‌లు, మిలియన్ డాలర్ల కార్పొరేట్‌ అడ్వర్టైజింగ్‌ క్యాంపెయిన్ల ద్వారా భారీ రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. కోహ్లీ కేవలం ఒక ఆటగాడిగానే కాకుండా, ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా తన ముద్రవేస్తున్నారు. 

మిస్టర్ కూల్ ఎంఎస్‌ ధోనీ స్మార్ట్ ఇన్వెస్టర్ 

భారత్ మాజీ సారథి మహీంద్ర సింగ్ ధోనీ తన ఆదాయ వనరులను వైవిధ్యంగా మార్చుకోవడంలో సిద్ధహస్తుడని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ధోనీ ఆస్తి విలువ కోహ్లీతో సమానంగా వెయ్యి కోట్లు ఉంది. ధోని తన ఆర్థిక పోర్ట్‌ఫోలియోను కేవలం క్రికెట్‌కే పరిమితం చేయలేదు. కమర్షియల్ ఆర్గానిక్ ఫార్మింగ్‌, ఫిట్‌నెస్‌ బ్రాండ్లు, బైక్ కలెక్షన్స్‌, డొమెస్టిక్‌ లీగ్ కాంట్రాక్టుల ద్వారా తన సంపదను నిరంతరం పెంచుకుంటున్నారు. ధోనీ పక్కా ప్లానింగ్‌తో రిటైర్మెంట్ తర్వాత కూడా ఆర్థికంగా ఎలా బలంగా ఉండాలో ప్రపంచానికి చూపిస్తున్నాడు. 

మాస్టర్ ప్లాన్‌తో 1400 కోట్లకు అధినేతగా సచిన్ 

క్రికెట్‌ గాడ్‌గా పిలుచుకునే సచిన్ టెండూల్కర్‌ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని దశాబ్దం దాటినా, సంపాదనలో మాత్రం ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. సచిన్ టెండూల్కర్‌ నికర ఆస్తుల విలువ సుమారు 1400కోట్లు దాటినట్టు అంచనా. సచిన్ తన కెరీర్‌ ముగిసిన తర్వాత కూడా హై ప్రొఫైల్ బ్రాండ్ అసోసియేషన్ల ద్వారా తన సంపద పెంచుకుంటున్నారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, వ్యూహాత్మక వ్యాపార పెట్టుబడులు పెట్టడం ద్వారా తన ఆర్థిక సామ్రాజ్యాన్ని పటిష్టం చేసుకున్నారు. క్రికెట్ ఆడుతున్నప్పుడు ఎంతటి క్రమశిక్షణతో ఉండేవారో,రిటైర్మెంట్ తర్వాత కూడా తన బ్రాండ్ వాల్యూ తగ్గకుండా జాగ్రత్త పడటమే సచిన్ విజయ రహస్యం. 

రికీ పాంటింగ్‌ ఆదాయం ఎంత అంటే?

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ ప్రపంచ ధనిక క్రికెటర్ల జాబితాలో నాల్గో స్థానంలో ఉన్నారు. పాటింగ్‌ తన కెరీర్ ముగిసిన తర్వాత కూడా క్రికెట్‌తో విడదీయరాని బంధాన్ని కలిగి ఉన్నారు. అంతర్జాతీయ టోర్నమెంట్‌లకు కోచింగ్ కాంట్రాక్టులు, అత్యధిక పారితోషికం లభించే మీడియా కామెంటరీ ద్వారా తన సంపద పెంచుకుంటున్నారు. 

బ్రియాన్ లారా సంపద

వెస్టిండీస్‌ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా టాప్ 5 జాబితాలో ఉన్నారు. లారా తన లెజెండరీ హోదాను అద్భుతంగా వాడుకుంటున్నారు. బ్రాడ్ కాస్టింగ్ డీల్స్, ప్రీమియం కమర్షియల్‌ స్పాన్స్‌ర్‌షిప్‌ల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు.  

క్రికెట్ ప్రపంచంలో ఈ స్థాయి సంపద చేకూరడానికి ప్రధాన కారణం. గ్లోబలైజేషన్ గతంలో క్రికెటర్లు కేవలం మ్యాచ్‌ ఫీజులపైనే ఆధారపడే వారు. కానీ ఐపీఎల్ వంటి లీగ్‌లు ఆటగాళ్ల బ్రాండ్ వాల్యూను అమాంతం పెంచేశాయి. సోషల్ మీడియా ద్వారా ఆటగాళ్లు నేరుగా అభిమానులతో కనెక్ట్ అవ్వడం వల్ల బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్లు కోట్లలో వస్తున్నాయి. నేటి క్రికెటర్లు సంపాదించిన డబ్బును స్టార్టప్‌లు, రియల్ ఎస్టేట్‌, స్టాక్ మార్కెట్‌లలో పెట్టుబడిగా పెడుతున్నారు. ఈ జాబితాలో టాప్‌ 3లో ఇండియన్ క్రికెటర్లే ఉన్నారు. ఇది భారత్ ఆటగాళ్ల బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచానికి తెలియజేస్తుంది. 

Frequently Asked Questions

విరాట్ కోహ్లీ ఆదాయ వనరులు ఏమిటి?

విరాట్ కోహ్లీ ఆదాయం బీసీసీఐ కాంట్రాక్టులు, ఐపీఎల్ పారితోషికాలకే పరిమితం కాలేదు. అతను ప్రీమియం ఫ్యాషన్ లేబుల్స్, ఫిట్నెస్ సెంటర్ చైన్లు, కార్పొరేట్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ల ద్వారా భారీగా సంపాదిస్తున్నారు.

ఎంఎస్ ధోనీ సంపద ఎలా పెంచుకుంటున్నారు?

ధోనీ తన ఆర్థిక పోర్ట్ఫోలియోను క్రికెట్కే పరిమితం చేయలేదు. కమర్షియల్ ఆర్గానిక్ ఫార్మింగ్, ఫిట్నెస్ బ్రాండ్లు, బైక్ కలెక్షన్స్, డొమెస్టిక్ లీగ్ కాంట్రాక్టుల ద్వారా తన సంపదను పెంచుకుంటున్నారు.

సచిన్ టెండూల్కర్ నికర ఆస్తి విలువ ఎంత?

సచిన్ టెండూల్కర్ నికర ఆస్తుల విలువ సుమారు 1400 కోట్లు దాటినట్లు అంచనా. రిటైర్మెంట్ తర్వాత కూడా హై ప్రొఫైల్ బ్రాండ్ అసోసియేషన్లు, వ్యూహాత్మక వ్యాపార పెట్టుబడుల ద్వారా సంపద పెంచుకుంటున్నారు.

నేటి క్రికెటర్లు సంపాదించిన డబ్బును ఎలా పెట్టుబడి పెడుతున్నారు?

నేటి క్రికెటర్లు సంపాదించిన డబ్బును స్టార్టప్లు, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిగా పెడుతున్నారు. ఐపీఎల్ వంటి లీగ్లు, సోషల్ మీడియా వల్ల వారి బ్రాండ్ విలువ పెరిగింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

T20 World Cup - IND W VS NL W Result Update: టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై భారీ విజ‌యం.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై విజయంతో టాప్ ప్లేస్ కు.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
IND Win ODI Series VS AFg: సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
TG 20 Tournament Controversy:విజయ్‌ దేవరకొండ, వెంకటేష్‌కు లీగల్ నోటీసులు! టీజీ 20 టోర్నీ చుట్టూ ముదురుతున్న వివాదం!
విజయ్‌ దేవరకొండ, వెంకటేష్‌కు లీగల్ నోటీసులు! టీజీ 20 టోర్నీ చుట్టూ ముదురుతున్న వివాదం!
Vaibhav Sooryavanshi Survives: ఔట్ అనుకొని బౌండరీ లైన్ దాకా వెళ్లిన వైభవ్.. థర్డ్ అంపైర్ వివాదస్ప‌ద నిర్ణ‌యంతో  తిరిగి బ‌రిలోకి..  అఫ్గాన్ ప్లేయర్స్ ఫైర్!
ఔట్ అనుకొని బౌండరీ లైన్ దాకా వెళ్లిన వైభవ్.. థర్డ్ అంపైర్ వివాదస్ప‌ద నిర్ణ‌యంతో  తిరిగి బ‌రిలోకి..  అఫ్గాన్ ప్లేయర్స్ ఫైర్!
Advertisement

వీడియోలు

Ind W vs NL W World Cup | నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం
Vaibhav Not-Out vs Afgan A | వైరల్ అవుతున్న వైభవ్ సూర్యవంశీ అవుట్ వివాదం
India vs Afghanistan ODI Series | ఆఫ్ఘనిస్థాన్‌ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్
Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NDA Delimitation Magic Number:ఢిల్లీ పీఠంపై బీజేపీకి తిరుగులేని పట్టు! డీలిమిటేషన్ వైపు మోదీ సర్కార్‌ వేగంగా అడుగులు! జస్ట్‌ 6 ఓట్లు దొరికితే ఆ బిల్లులు అమోదం పొందినట్టే!
ఢిల్లీ పీఠంపై బీజేపీకి తిరుగులేని పట్టు! డీలిమిటేషన్ వైపు మోదీ సర్కార్‌ వేగంగా అడుగులు! జస్ట్‌ 6 ఓట్లు దొరికితే ఆ బిల్లులు అమోదం పొందినట్టే!
Drishyam 3 OTT : దృశ్యం 3 ఓటీటీ స్ట్రీమింగ్ - తెలుగు వెర్షన్‌పై బిగ్ ట్విస్ట్... ఎన్ని భాషల్లో చూడొచ్చంటే?
దృశ్యం 3 ఓటీటీ స్ట్రీమింగ్ - తెలుగు వెర్షన్‌పై బిగ్ ట్విస్ట్... ఎన్ని భాషల్లో చూడొచ్చంటే?
Gade Saikrishna Missing Case: సాయికృష్ణ ఏమయ్యాడు? మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి పవర్‌ఫుల్ ఆఫీసర్!
సాయికృష్ణ ఏమయ్యాడు? మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి పవర్‌ఫుల్ ఆఫీసర్!
Breaking News:ఆంధ్రప్రదేశ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల! డైరెక్ట్ లింక్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల! డైరెక్ట్ లింక్ ఇదే!
Ambernath Suicide Case:బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
Celebrity Divorce: విడాకులు తీసుకుంటున్న సీరియల్ హీరోయిన్?
విడాకులు తీసుకుంటున్న సీరియల్ హీరోయిన్?
US Iran Peace Deal:అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం! ముగిసిన యుద్దం! ఆయిల్ ధరలు తగ్గుతాయా?
అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం! ముగిసిన యుద్దం! ఆయిల్ ధరలు తగ్గుతాయా?
Kids Fall Sick After Schools Reopen : స్కూల్స్ రీ-ఓపెన్ తర్వాత పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? వైద్యులు చెప్పిన కారణాలు ఇవే
స్కూల్స్ రీ-ఓపెన్ తర్వాత పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? వైద్యులు చెప్పిన కారణాలు ఇవే
Embed widget