Duleep Trophy, Tilak Varma Leads South Zone: ఇండియా టి20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మకు సౌత్ జోన్ కెప్టెన్సీ లభించింది. బెంగళూరులోని బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగబోయే దులీప్ ట్రోఫీకి 15 మందితో కూడిన సౌత్ జోన్ టీమ్ ను అనౌన్స్ చేశారు. ఆంధ్ర బ్యాటర్ రికీ భుయ్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా, ఆంధ్ర సీనియర్ కోచ్ ఎమ్‌ఎన్ విక్రమ్ వర్మ హెడ్ కోచ్ గా నియమితుడయ్యాడు. రీసెంట్ గా జింబాబ్వేపై 3-0 తో సిరీస్ గెలిచిన ఇండియన్ టి20 టీమ్ లో తిలక్ వర్మ కీ రోల్ ప్లే చేశాడు.

Continues below advertisement

Continues below advertisement

సెలెక్షన్ కమిటీ మీటింగ్.. సౌత్ ఇండియా స్టేట్స్ ప్రతినిధులుఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) సెక్రటరీ సనా సతీష్ బాబు లీడ్ లో ఈ సెలెక్షన్ కమిటీ మీటింగ్ జరిగింది. మాజీ రంజీ ప్లేయర్ ఆర్‌వి చంద్రమౌళి ప్రసాద్ సెలెక్షన్ ప్యానెల్ ఛైర్మన్ గా వ్యవహరించగా తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్, గోవా, పాండిచ్చేరి, కేరళ స్టేట్స్ ప్రతినిధులు మీటింగ్ లో పాల్గొన్నారు. వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ తో పాటు 2025/26 రంజీ సీజన్ లో 950 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచిన ఆర్ స్మరన్, హైదరాబాద్ కి చెందిన కె హిమతేజ టీమ్ లో చోటు దక్కించుకున్నారు.

వికెట్ కీపర్ గా ఎన్ జగదీశన్.. డైరెక్ట్ సెమీస్ కి సౌత్ జోన్ఇండియా 'ఎ' తరఫున లంక పర్యటనలో రాణించిన షేక్ రషీద్, జగదీశన్ లు స్క్వాడ్ లో ఉన్నారు. ఎన్ జగదీశన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చూడనున్నాడు. లాస్ట్ ఎడిషన్ లో రన్నరప్ గా నిలిచిన సౌత్ జోన్ ఈసారి డైరెక్ట్ గా సెమీఫైనల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆగస్టు 30న క్వార్టర్ ఫైనల్ 2 విన్నర్ తో సెమీస్ లో తలపడనుంది.

స్పిన్, పేస్ బౌలింగ్ అటాక్ వివరాలులెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్, లెగ్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ స్పిన్ విభాగాన్ని లీడ్ చేయనుండగా, కే సాయి తేజ, త్రిపురాణ విజయ్, విద్వత్ కావేరప్ప, ఎమ్‌డి నిదీష్ లు పేస్ అటాక్ బాధ్యతలు పంచుకోనున్నారు.

సౌత్ జోన్ కంప్లీట్ స్క్వాడ్తిలక్ వర్మ (కెప్టెన్), రికీ భుయ్ (వైస్ కెప్టెన్), అభినవ్ తేజరానా, షేక్ రషీద్, కెఎమ్‌ హిమతేజ, ఆర్ స్మరన్, ఎన్ జగదీశన్, కరుణ్ నాయర్, తనయ్ త్యాగరాజన్, శ్రేయస్ గోపాల్, కే సాయి తేజ, టి విజయ్, విద్వత్ కావేరప్ప, హెచ్ అమన్ ఖాన్, ఎమ్‌డి నిదీష్ ఉన్నారు.