Team India Fast Bowler Barinder Sran: టీమిండియా పేసర్ బరీందర్ శ్రాన్(Barinder Sran).. అంతర్జాతీయ క్రికెట్(International)కు వీడ్కోలు పలికాడు. మిస్టర్ కూల్ ధోనీ సారథ్యంలో టీమిండియా(Team India)లోకి ఎంట్రీ ఇచ్చిన లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ బరీందర్ శ్రాన్.. కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు.. దేశవాళీ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలుకుతున్నట్లు 31 ఏళ్ల శ్రాన్ ప్రకటించాడు. భారత జట్టు తరపున 2016 జనవరిలో అరంగేట్రం చేసిన శ్రాన్... 2016 జూన్ వరకు మాత్రం టీమ్ ఇండియా తరపున బరిలోకి దిగాడు. కేవలం నాలుగు నెలల పాటే శ్రాన్ కెరీర్ కొనసాగింది. ఈ నాలుగు నెలల వ్యవధిలో శ్రాన్ భారత్ తరపున 6 వన్డేలు, రెండు టీ 20 మ్యాచ్‌లు ఆడాడు. శ్రాన్ వన్డేల్లో 7 వికెట్లు, టీ20ల్లో 6 వికెట్లు తీశాడు. దేశవాళీ క్రికెట్‌లో 137 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత శ్రాన్‌కు అవకాశాలు రాలేదు. 2016 జూన్ తర్వాత శ్రాన్‌కు ఎలాంటి అవకాశాలు రాలేదు. 2016 నుంచి దాదాపు ఎనిమిదేళ్లపాటు ఎదురుచూసిన భారత జట్టు నుంచి శ్రాన్‌కు పిలుపు రాలేదు. దీంతో 8 సంవత్సరాల తర్వాత శ్రాన్ రిటైర్మెంట్ ప్రకటించేశాడు.
ఇన్‌స్టాలో ప్రకటన
బరీందర్ శ్రాన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తాను కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. తన క్రికెట్ ప్రయాణంలో అండగా నిలిచిన వారందరకీ ధన్యవాదాలు తెలిపాడు. కోచ్‌లు, మేనేజ్‌మెంట్, బీసీసీఐకు శ్రాన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. కృతజ్ఞతా భావంతో తన క్రికెట్ ప్రయాణానికి వీడ్కోలు పలుకుతున్నట్లు శ్రాన్ తన రిటైర్‌మెంట్ ప్రకటనలో వెల్లడించాడు. తన అంతర్జాతీయ కెరీర్ చిన్నదే అయినా అక్కడ జ్ఞాపకాలు ఎప్పుడూ గుర్తుండిపోతాయని శ్రాన్ తెలిపాడు.
రిటైర్మెంట్ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ..." నేను అధికారికంగా నా క్రికెట్ కేరీర్‌కు ఫుల్‌స్టాప్ పెడుతున్నప్పుడు నా ప్రయాణాన్ని చూసుకుంటే... 2009లో బాక్సింగ్ నుంచి మారాల్సి వచ్చింది. తర్వాత క్రికెట్ నాకు లెక్కలేనన్ని అద్భుతమైన అనుభవాలను అందించింది. ఫాస్ట్ బౌలింగ్ నాకు అదృష్టంగా తగిలింది. ప్రతిష్టాత్మక IPL ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కల్పించింది. 2016లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అత్యున్నత గౌరవాన్ని పొందాను.
నా అంతర్జాతీయ కెరీర్ జర్నీ చిన్నదే అయినప్పటికీ, అందులో ఉండే జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. నా ఈ ప్రయాణంలో కోచ్‌లు మేనేజ్‌మెంట్ అందించిన సహకారం నన్ను శక్తిమంతుడిని చేశాయి. వాళ్లకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడనే. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ నుంచి రిటైర్ కావడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను, నాకు మద్దతు తెలిపిన వారికి ధన్యవాదాలు. నేను ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినప్పుడు, క్రికెట్ నాకు కల్పించిన అవకాశాలకు నేను కృతజ్ఞుడని. చివరగా,"ఆకాశంలా, కలలకు హద్దులు లేవు", కాబట్టి కలలు కంటూ ఉండండి" అని తన ఇస్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.
ఐపీఎల్‌లో
ఐపీఎల్‌లో అనేక ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించిన శ్రాన్... క్రికెట్ తనకు ఎన్నో అనుభవాలను అందించిందని తెలిపాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలకు శ్రాన్ ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో ఆడిన 24 మ్యాచ్‌లలో 18 వికెట్లు తీశాడు. శ్రాన్ ఫిబ్రవరి 2021లో విజయ్ హజారే ట్రోఫీలో చివరి మ్యాచ్ ఆడాడు.