Shubman Gill Century: ఇంగ్లాండ్ తో జ‌రిగిన మూడో వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 356 ప‌రుగులకు ఆలౌట్ అయింది. ఈ స్టేడియంలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.  శుభ‌మాన్ గిల్ స్ట‌న్నింగ్ సెంచ‌రీ (102 బంతుల్లో 112, 14 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్ (78), విరాట్ కోహ్లీ (52) అర్థ సెంచ‌రీలతో రాణించారు. బౌల‌ర్లలో ఆదిల్ ర‌షీద్ నాలుగు వికెట్లతో స‌త్తా చాటాడు. అంత‌కుముందు ఈ వ‌న్డేలో భారత్ మూడు మార్పులు చేసింది. ర‌వీంద్ర జ‌డేజా, మ‌హ్మ‌ద్ ష‌మీ, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తిల స్థానాల్లో వాషింగ్ట‌న్ సుంద‌ర్, అర్ష‌దీప్ సింగ్, కుల్దీప్ యాద‌వ్ ల‌ను జ‌ట్టులోకి తీసుకుంది. ఇక ఇంగ్లాండ్ కూడా ఒక మార్పు చేసింది. జామీ ఓవ‌ర్ట‌న్ ప్లేసులో టామ్ బంట‌న్ ను టీమ్ లోకి తీసుకుంది. ఇప్ప‌టికే మూడు వ‌న్డేల సిరీస్ ను భార‌త్ 2-0తో గెలుచుకోగా, ఈ వ‌న్డేలో గెలిచి వ‌చ్చేవారం నుంచి ప్రారంభ‌మ‌య్యే ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీకి ఆత్మ‌విశ్వాసంతో బ‌రిలోకి దిగాల‌ని భావిస్తోంది.  

ఆరంభంలోనే షాక్..టాస్ గెలిచి బ్యాట్ ఎంచుకున్న భార‌త్ కు ఆరంభంలోనే షాక్ త‌గిలింది. గ‌త మ్యాచ్ లో సూప‌ర్ సెంచ‌రీ చేసిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఒక్క ప‌రుగుకే వెనుదిరిగాడు. ఈ ద‌శ‌లో కోహ్లీతో క‌లిసి ఇన్నింగ్స్ ను నిర్మించాడు. తొలుత  కోహ్లీ బౌండ‌రీల‌తో చెల‌రేగి ఫీల్డు సెట్ చేయ‌గా, ఆ త‌ర్వాత కుదురుకున్న గిల్ చెల‌రేగి పోయాడు. ప‌ర్యాట‌క బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొన్న వీరిద్ద‌రూ రెండో వికెట్ కు 116 ప‌రుగులు జోడించారు. 51 బంతుల్లో గిల్ ఫిఫ్టీ పూర్తి చేయ‌గా, 50 బంతుల్లో ఫిఫ్టీ చేశాక‌, మ‌రోసారి ర‌షీద్ బౌలింగ్ లో కోహ్లీ వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన శ్రేయ‌స్ దూకుడుగా ఆడాడు. గిల్ కూడా గేర్ మార్చ‌డంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. అలా సెంచ‌రీకి చేరువైన గిల్.. మార్క్ వుడ్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి, వ‌న్డేల్లో 7వ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. అలాగే వేగంగా 2,500 ప‌రుగులు పూర్తి చేసిన క్రికెటర్ గా గిల్ (50 ఇన్నింగ్స్ ) నిలిచాడు. ఆ త‌ర్వాత స్కోరు వేగాన్ని పెంచే క్ర‌మంలో గిల్ ఔట‌య్యాడు. మూడో వికెట్ కు 116 పరుగులు భాగస్వామ్యం నమోదైంది. 

రాణించిన రాహుల్..గిల్ వెనుదిరిగాక‌, ఓ ఎండ్ లో శ్రేయ‌స్ వేగంగా ఆడాడు. అయితే సెంచ‌రీకి చేరువైన అయ్య‌ర్ ను ర‌షీద్ బోల్తా కొట్టించాడు. ఈ ద‌శ‌లో కేఎల్ రాహుల్ (40) త‌న వాడిని చూపించాడు. కాస్త టీ20 త‌ర‌హాలో ఆడుతూ వేగంగా ప‌రుగులు చేశాడు. మిడిలార్డ‌ర్లోని వాళ్లు త‌లో ఓ చేయి వేయ‌డంతో భార‌త్ 350+ ప‌రుగుల మార్కును దాటిండి. బౌల‌ర్ల‌లో మార్క్ వుడ్ కు రెండు, గ‌స్ అట్కిన్స‌న్, జో రూట్, సాకిబ్ మ‌హ్మూద్ ల‌కు త‌లో వికెట్ ద‌క్కింది. 

Read Also: Shubman Gill Century:  గిల్ సూప‌ర్ సెంచ‌రీ.. భారీ స్కోరు దిశ‌గా భారత్, కోహ్లీ ఫిఫ్టీ