Indian Cricket Team Jersey: ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అదే సమయంలో ఆసియా క్రీడలను చైనాలో నిర్వహించనున్నారు. అయితే ఆసియా క్రీడల కోసం భారత క్రికెట్ జట్టు జెర్సీ ఫస్ట్ లుక్ రివీల్ అయింది. ఆసియా క్రీడల కోసం భారత క్రికెట్ జట్టు జెర్సీలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు యశస్వి జైస్వాల్, రింకూ సింగ్‌ కనిపిస్తున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.






సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫోటో...
సోషల్ మీడియాలో ఆసియా క్రీడల కోసం భారత క్రికెట్ జట్టు జెర్సీని అభిమానులు ఇష్టపడుతున్నారు. అయితే ఈ జెర్సీకి, భారత సీనియర్ జట్టు జెర్సీకి ఎంతో తేడా ఉంది. ఆసియా క్రీడల కోసం భారత క్రికెట్ జట్టు జెర్సీపై సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూనే ఉన్నారు. దీనికి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ కూడా వస్తుంది.


ఆసియా క్రీడలకు చైనా ఆతిథ్యం
త్వరలో చైనా వేదికగా జరగనున్న 19వ ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల జట్లు క్రికెట్ ఈవెంట్‌లో పాల్గొంటుండటం విశేషం. మెరుగైన ర్యాంకింగ్ కారణంగా, రెండు జట్లూ తమ ఈవెంట్‌ల క్వార్టర్ ఫైనల్లో నేరుగా పోటీపడతాయి. 19వ ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ ఈవెంట్ సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కాగా షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 26వ తేదీన జరగనుంది. పురుషుల క్రికెట్ ఈవెంట్ సెప్టెంబర్ 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 7వ తేదీన జరుగుతుంది.


ఆసియా క్రీడలకు భారత జట్టు
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్)


మరోవైపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఐదు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్ శనివారం జరిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టుకు సంబంధించి ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ కొత్త రికార్డు సృష్టించారు. డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ జోడీ కేవలం 10 ఓవర్లలోనే జట్టు స్కోరును 100 పరుగులకు దాటించింది. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే మ్యాచ్‌ల్లో ఏ జట్టు కూడా ఈ ఘనత ఎప్పుడూ సాధించలేదు. డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ జోడీ ఈ భాగస్వామ్యంతో కొత్త చరిత్ర సృష్టించింది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial