T20 world cup 2026: కోలుకుంటున్న బుమ్రా, అభిషేక్ శర్మ.. నెక్ట్స్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ ఔట్
T20 World Cup 2026: అనారోగ్యం కారణంగా మొదటి మ్యాచ్ ఆడని జస్ప్రిత్ బుమ్రా నమీబియాతో మ్యాచ్ ఆడనున్నాడు. దాంతో భారత్ జట్టులో మార్పులు తప్పనిసరి.

Jasprit bumrah In T20 World Cup | టీ20 వరల్డ్ కప్ 2026ను టీమిండియా విజయంతో ప్రారంభించింది. అయితే అతికష్టమ్మీద తొలి మ్యాచులో అమెరికాపై భారత జట్టు 29 పరుగుల తేడాతో నెగ్గిందని తెలిసిందే. అయితే నమీబియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఓ సవాల్ ఎదురైంది. తరువాత మ్యాచ్‌లో గత మ్యాచ్ స్టార్ కు అవకాశం దక్కపోవచ్చు. మహమ్మద్ సిరాజ్ తరువాత మ్యాచ్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అభిషేక్ శర్మ ఆరోగ్యం కూడా బాగాలేదని, మరోవైపు జస్ప్రీత్ బుమ్రా కూడా అనారోగ్యం కారణంగానే తొలి మ్యాచ్ ఆడలేదని తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు T20 ప్రపంచ కప్ లో వరుస విజయాలు సాధిస్తున్న జట్టుగా నిలిచింది. గత వరల్డ్ కప్ లో ఒక్క ఓటమి కూడా లేకుండా రోహిత్ శర్మ జట్టుకు ట్రోఫీని అందించాడు. ఈ వరల్డ్ కప్ తొలి మ్యాచులో భారత బ్యాటర్లు అమెరికా బౌలర్లను ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డారు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను మినహాయిస్తే, మరే ఇతర బ్యాటర్ అంతగా రాణించలేదు. అభిషేక్ శర్మ, శివమ్ దూబే గోల్డెన్ డక్ కాగా, అభిషేక్ ఆ తర్వాత ఫీల్డింగ్ చేయడానికి కూడా ఫీల్డ్ లోకి దిగలేదు. అభిషేక్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని అతడికి కడుపునొప్పి, అస్వస్థత అని సూర్యకుమార్ ధృవీకరించాడు.
అభిషేక్ శర్మ ఆరోగ్యం బాగాలేదు
వాతావరణం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు జ్వరంతో బాధ పడుతున్నాడు. మరోవైపు అభిషేక్ పరిస్థితి దాదాపు అంతేనని సూర్యకుమార్ చెప్పాడు. అయితే, అభిషేక్‌కు కడుపు నొప్పి ఉందని, నెక్ట్స్ మ్యాచ్ నమీబియాతో బరిలోకి దిగుతాడని సిరాజ్ తెలిపాడు. అంతా బాగానే ఉంది, కడుపు నొప్పి, స్వల్ప అస్వస్థత కారణంగా ఫీల్డింగ్ చేయడానికి రాలేదని తెలిపాడు. నమీబియాతో జరిగే మ్యాచ్‌లో సిరాజ్ జట్టు నుంచి బయటకు వెళ్లనున్నాడు.
వాషింగ్టన్ సుందర్ ఢిల్లీలో టీమిండియాతో చేరతాడని సూర్యకుమార్ తెలిపాడు. భారత్ తమ నెక్ట్స్ మ్యాచ్ గురువారం, ఫిబ్రవరి 12న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడనుంది. జస్ప్రీత్ బుమ్రా కోలుకుని తిరిగి జట్టుతో చేరే అవకాశం ఉంది.
ఎవరు బయటకు వెళ్తారు?
Painting the ground with his masterful shot-making 🎨👏
— BCCI (@BCCI) February 7, 2026
One word for Captain @surya_14kumar's match-winning knock? 👇
Scorecard ▶️ https://t.co/Rlm2ARPVEt#TeamIndia | #MenInBlue | #T20WorldCup | #INDvUSA pic.twitter.com/GWjMyNy9Rt
జస్ప్రీత్ బుమ్రా వైరల్ ఫీవర్ కారణంగా అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్ ఆడలేదు, అందుకే అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌కు ప్లేయింగ్ 11లో అవకాశం ఇచ్చారు. సిరాజ్ టోర్నమెంట్ ప్రారంభానికి ఒక్కరోజు ముందు జట్టుతో చేరాడు. హర్షిత్ రాణా స్థానంలో జట్టులోకి వచ్చిన సిరాజ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.
యుఎస్‌ఎతో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరపున మహ్మద్ సిరాజ్ అత్యధికంగా 3 వికెట్లు తీశాడు. పవర్‌ప్లేలోనే 2 వికెట్లు తీసి అమెరికాను దెబ్బతీసి జట్టుకు మంచి ప్రారంభం అందించాడు. కానీ నమీబియాతో మ్యాచ్ బుమ్రా ఆడితే, సిరాజ్ ప్లేయింగ్ 11లో చోటు కోల్పోతాడు. తొలి మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసినా బుమ్రా జట్టులోకి రావడంతో సిరాజ్‌ను బయటకు పంపించవచ్చు.





















