T20 World Cup 2026: భారత్, దక్షిణాఫ్రికా సూపర్ 8 మ్యాచ్ రద్దైతే, సెమీఫైనల్ రేసు ఎలా ఉంటుంది ?
IND vs SA Weather: భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన సూపర్ 8 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే, ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. కానీ తరువాత అన్ని మ్యాచ్‌లు నెగ్గితేనే సెమీఫైనల్ రేసులో ఉంటారు.

India vs South Africa Rain Chances: టీ20 వరల్డ్ కప్ 2026లో సూపర్-8లో మొట్టమొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దు చేయాల్సి వచ్చింది. ఈరోజు సూపర్-8లో భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. సాయంత్రం 6.30 గంటలకు టాస్ వేస్తారు. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే, సెమీఫైనల్ సమీకరణం ఎలా ఉంటుందో తెలుసుకోండి.
భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దయితే నెక్ట్స్ ఏంటీ..
ఒకవేళ టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆదివారం రాత్రి జరగాల్సిన సూపర్-8 మ్యాచ్ వర్షం లేదా ఇతర కారణాల వల్ల రద్దయితే, రెండు జట్లలో ఏదీ టోర్నీ నుండి నిష్క్రమించదు. ఎందుకంటే ఇది సూపర్ 8 మ్యాచ్. అంతేగానీ సెమీఫైనల్ లాంటి నాకౌట్ మ్యాచ్ కాదు. పాకిస్థాన్, న్యూజిలాండ్‌లకు లభించినట్లే, ఈ రెండు జట్లకు కూడా ఐసీసీ చెరో పాయింట్ కేటాయిస్తుంది. నేటి మ్యాచ్ రద్దయినా, భారత్, దక్షిణాఫ్రికా జట్లు తమ తరువాత మ్యాచ్ లలో వరుసగా నెగ్గితే సెమీఫైనల్‌కు వెళతాయి.
South Africa hone the details before the #T20WorldCup Super 8 showdown begins 👊
— ICC (@ICC) February 21, 2026
Catch them in action LIVE, tournament broadcast details ➡️ https://t.co/NPykWM7qqY pic.twitter.com/yQuWtzbi9V
భారత జట్టు ఫిబ్రవరి 26న జింబాబ్వేతో, మార్చి 1న వెస్టిండీస్‌తో తరువాత మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌ల్లో గెలిచి కూడా ఇండియా సెమీఫైనల్‌లో తన స్థానాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. దక్షిణాఫ్రికాకు కూడా ఇదే విషయం వర్తిస్తుంది. ఎందుకంటే ఆ జట్టు కూడా సూపర్-8లో మరో 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
Ahmedabad’s mood right now! pic.twitter.com/99smclLDZv
— Vimal कुमार (@Vimalwa) February 22, 2026
ఈరోజు వాతావరణం ఎలా ఉంటుంది?
ఈ సూపర్-8 మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అహ్మదాబాద్‌లో ఆకాశం సాధారణంగా ఉంది. తేలికపాటి గాలి వీస్తుందని వాతావరణశాఖ అంచనా వేసింది. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ వరకు, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల వరకు ఉండవచ్చు. భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ సమయంలో కూడా ఉక్కపోత ఎక్కువగా ఉండవచ్చు.
ముఖాముఖి రికార్డులు (Head to Head Record)
భారత్, దక్షిణాఫ్రికా ఇప్పటివరకు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 35 సార్లు తలపడగా.. ఇందులో 21 సార్లు భారత్ విజయం సాధించగా, సఫారీలు కేవలం 13 సార్లు మాత్రమే గెలుపొందారు. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. 2024 ప్రారంభం నుండి ఇప్పటివరకు రెండు జట్లు 9 సార్లు తలపడగా, దక్షిణాఫ్రికా కేవలం 2 సార్లు విజయం సాధించింది.





















