IND vs PAK T20 World Cup: పాకిస్థాన్‌తో తలపడే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే! అర్షదీప్‌ను పక్కన పెడతారా?
India vs Pakistan T20 World Cup Match: ఆర్ ప్రేమదాస స్టేడియం పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది కనుక భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగవచ్చు. అయితే అర్షదీప్ కు అవకాశం దక్కడం కష్టమే అనిపిస్తుంది.

కొలంబో: టీ20 వరల్డ్ కప్ 2026లో అత్యంత కీలకమైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ నేడు కొలంబోలో జరగనుంది. ఆర్. ప్రేమదాస స్టేడియం పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఈ కారణంగా ఇండియా ప్లేయింగ్ 11లో ఒక అదనపు స్పిన్నర్‌ను చేర్చుకునే అవకాశం ఉంది. మరో స్పిన్నర్ కావాలంటే అర్ష్‌దీప్ సింగ్‌ను పక్కన పెట్టాల్సి రావచ్చు. అభిషేక్ శర్మ బరిలోకి దిగుతామని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ శనివారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపాడు. టీమిండియా, పాకిస్తాన్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందని క్రికెట్ ప్రేమికులు ఆలోచిస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్ 10వ ఎడిషన్‌లో భారత్, పాక్ జట్లు ఆడిన రెండు మ్యాచులో విజయం సాధించాయి. ఈరోజు విజయం సాధించే జట్టు హ్యాట్రిక్ విన్ నమోదు చేస్తుంది. కొలంబో వర్ష ప్రభావం జట్టు ఆటగాళ్ల ఎంపికపై ప్రభావం చూపుతోంది. వాతావరణ పరిస్థితులను గమనిస్తే ఆరంభ ఓవర్లలో ఫాస్ట్ బౌలర్లు స్వింగ్ రాబట్టి బ్యాటర్లను ఇబ్బంది పెడతారు. ఇది బ్యాటర్లకు సవాలుగా మారుతుంది. హిస్టరీ చెక్ చేస్తే ఆర్. ప్రేమదాస స్టేడియం పిచ్ స్పిన్నర్లకు అనుకూలం. కనుక నేటి మ్యాచ్ కుల్దీప్ యాదవ్ లేదా వాషింగ్టన్ సుందర్లలో ఒకరికి జట్టులో చోటు దక్కవచ్చు. అర్ష్‌దీప్ సింగ్ మాత్రం బెంచ్‌కే పరిమితం కావచ్చు.
Prep mode 🔛
— BCCI (@BCCI) February 14, 2026
📸 𝙎𝙣𝙖𝙥𝙨𝙝𝙤𝙩𝙨 from #TeamIndia's training session in Colombo! 💪#MenInBlue | #T20WorldCup pic.twitter.com/ia1ehyvMFS
రెండో ఫాస్ట్ బౌలర్‌గా హార్దిక్ పాండ్యా ?
ఈరోజు జస్ప్రీత్ బుమ్రా టీమిండియా పేస్ బౌలింగ్ అటాక్ నడిపిస్తాడు. ఒకే ఒక స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్‌ను ప్లేయింగ్ 11లో చేర్చుకునే ఛాన్స్ ఉంది. దాంతో పవర్‌ప్లేలో హార్దిక్ పాండ్యా 3 ఓవర్లు బౌలింగ్ వేయవచ్చు. భారత్ ఇందుకోసం ఇప్పటికే ప్రాక్టీస్ చేసింది. నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా ఫస్ట్ ఓవర్ వేశారు. గత కొంతకాలం నుంచి హార్దిక్ బౌలింగ్ లో రాణిస్తున్నాడు. అతడితో పాటు శివమ్ దూబే సైతం ఓవర్లను పంచుకుంటాడు.
కుల్దీప్ లేదా వాషింగ్టన్, ఎవరికి అవకాశం ?
వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్ సాధించి జట్టుతో చేరినా ఈరోజు కూడా బెంచ్ మీద కూర్చునే అవకాశం ఉంది. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలతో పాటు కుల్దీప్ యాదవ్‌ను 3వ స్పిన్నర్‌గా ప్లేయింగ్ 11లో చూడవచ్చు. చైనామన్ బౌలర్ కుల్దీప్ తన గూగ్లీలతో పాకిస్థాన్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు.
బరిలోకి దిగనున్న అభిషేక్ శర్మ
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అభిషేక్ శర్మపై క్లారిటీ ఇచ్చాడు. ‘ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆడాలని మీరు కోరుకుంటే, అతడు తప్పకుండా బరిలోకి దిగుతాడు’ అన్నాడు. అంతకు ముందు పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా మాట్లాడుతూ, ‘అభిషేక్ ఆడాలని మేం కోరుకుంటున్నాం. ఇండియా బెస్ట్ టీంతో తలపడాలని అనుకుంటున్నాం’ అన్నాడు. దీంతో అభిషేక్ ప్లేయింగ్ 11లో ఉంటాడని సూర్య బదులిచ్చాడు..
భారత్ ప్లేయింగ్ 11 అంచనా: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.
పాకిస్థాన్ ప్లేయింగ్ 11 అంచనా: సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, బాబర్ ఆజం, సల్మాన్ అఘా (కెప్టెన్), ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్.





















