Sri Lanka vs England Highlights: లో స్కోరింగ్ మ్యాచ్‌లో శ్రీలంకపై ఇంగ్లాండ్ ఘన విజయం.. సూపర్-8 మ్యాచ్‌లో బౌలర్లదే హవా
ENG vs SL Highlights: ఆతిథ్య శ్రీలంకపై ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇంగ్లాండ్ 146 పరుగులు చేయగా, శ్రీలంక వంద కూడా చేయలేక ఆలౌట్ అయింది.

England vs Sri Lanka Highlights Super 8: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక జట్టును 51 పరుగుల తేడాతో ఓడించి ఇంగ్లాండ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంగ్లాండ్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్ బౌలింగ్‌లో సత్తాచాటడంతో శ్రీలంక బ్యాటర్లు క్రీజులో కుదురుకోలేకపోయారు. శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక చివరి వరకు పోరాడినప్పటికీ, ఓటమిని అడ్డుకోలేకపోయాడు. పల్లెకెలె స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ కు దిగి నిర్ణీతో ఓవర్లలో 146 పరుగులు చేసింది. అయితే ఇది చాలా తక్కువ స్కోరు అని, ఆతిథ్య లంక జట్టు ఈజీగా ఛేజ్ చేస్తుందని అంతా భావించారు. కానీ శ్రీలంక జట్టు సొంతగడ్డపై ప్రేక్షకులకు షాకిస్తూ 95 పరుగులకే ఆలౌట్ అయింది.
టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలన్న శ్రీలంక నిర్ణయం ఆ జట్టుకు కలిసి రాలేదు. శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లలో బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 19 వికెట్లు తీశారు. ప్రారంభంలోనే విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్ వరుసగా వికెట్లు తీస్తూ శ్రీలంక జట్టుకు షాక్ ఇచ్చారు. దాంతో ఆ జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.
ఇంగ్లాండ్ అద్భుత విజయం
సూపర్-8లో ఇంగ్లాండ్‌కు ఈ విజయం అద్భుతం అని చెప్పాలి. శ్రీలంక తన సొంత గడ్డపై ఆడుతోంది. అయినా అక్కడి పరిస్థితులు అర్థం చేసుకుని ఇంగ్లాండ్ ఆడింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (40 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయడంతో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. చివర్లో విల్ జాక్స్ (14 బంతుల్లో 21 పరుగులు) పరవాలేదనిపించాడు. అంతా ఇంగ్లాండ్ ఓటమి ఖాయమని, సొంతగడ్డపై లంక విజయం తేలికని భావించారు. కొనీ కొన్ని నిమిషాల్లోనే సీన్ రివర్స్ అయింది.
𝐈𝐂𝐂 𝐌𝐞𝐧'𝐬 𝐓𝟐𝟎 𝐖𝐨𝐫𝐥𝐝 𝐂𝐮𝐩 𝟐𝟎𝟐𝟔
— All India Radio News (@airnewsalerts) February 22, 2026
England beat Sri Lanka by 51 runs
🏴 ENG 146/9 (20)
🇱🇰 SL 95 (16.4)
📍Pallekele International Cricket Stadium, Pallekele #ICCT20WorldCup2026 #T20WorldCup2026 #SLvsENG pic.twitter.com/PimrdFcaOJ
జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్ ప్రారంభ స్పెల్ లంక జట్టును పూర్తిగా దెబ్బతీసింది. వీరి బౌలింగ్ ధాటికి ఓ దశలో శ్రీలంక జట్టు 34 పరుగుల స్కోరుకే 5 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ దాసున్ షనక పోరాటం కొనసాగిస్తూ 24 బంతుల్లో 30 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో ఎవరైనా నిలబడితే రిజల్ట్ వేరేలా ఉండేది.
సూపర్ ఫాంలో ఉన్న నిస్సాంక (7)ను జోఫ్రా ఆర్చర్ ఔట్ చేశాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో విల్ జాక్స్ వరుస బంతుల్లో కుశాల్ మెండిస్ (4), రత్న నాయకే(0)లను ఔట్ చేయడంతో లంక జట్టులో టెన్షన్ పెరిగింది. అప్పటికి లంక స్కోరు 20 పరుగులే. జట్టు స్కోరు 22 పరుగుల వద్ద మరో ఓపెనర్ కమిల్ మిశారా (6)ను సైతం జోఫ్రా ఆర్చర్ ఔట్ చేశాడు. ఓవర్టన్ క్యాచ్ అందుకోవడంతో మిశారా నిరాశగా పెవిలియన్ చేరాడు.
వెల్లలగే (13), హేమంత (5), చమీరా (6), మహీష్ తీక్షణ (10 నాటౌట్) లంక పరువు కాపాడేందుకు ప్రయత్నించారు. 16.4 ఓవర్లలో 95 పరుగులకు లంక ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీయగా, విల్ జాక్స్ 3 వికెట్లు పడగొట్టారు. డాసన్, ఆదిల్ రషీద్ సైతం చెరో 2 వికెట్లు పడగొట్టగా, ఓవర్టన్ కు వికెట్ లభించింది.





















