T20 World Cup Hat tricks: టీ20 ప్రపంచ కప్ లో హ్యాట్రిక్ సాధించిన 9 మంది బౌలర్లు వీరే.. అతడు మాత్రం వెరీ వెరీ స్పెషల్
ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ టీ20 ప్రపంచ కప్ (T20 world cup)లో తొలి హ్యాట్రిక్ సాధించాడు. అతనితో పాటు మరో 8 మంది బౌలర్లు పొట్టి ప్రపంచ కప్‌లో ఈ ఘనత సాధించారు.

Bowlers who have taken hat tricks in T20 world cup : పొట్టి ప్రపంచ కప్ 2026 ఇదివరకే మొదలైంది. తొలి రెండు రోజుల్లోనే హ్యాట్రిక్ వికెట్ ఫీట్ సైతం నమోదైంది. ఈసారి టోర్నమెంట్‌లో మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. 5 జట్లను ఓ గ్రూపుగా, మొత్తం 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. లీగ్ దశలో, ప్రతి గ్రూప్ నుండి 2 టీమ్స్ సూపర్-8కి చేరుకుంటాయి. ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. T20 ఫార్మాట్ బౌలర్లకు చాలా కష్టమైనది. బ్యాటర్లకు కలిసొచ్చే ఫార్మాట్ అని చెబుతుంటారు. కానీ ఈ పొట్టి పార్మాట్ వరల్డ్ కప్‌లోనూ అద్భుతాలు చేసి చూపించారు.
ICC T20 ప్రపంచ కప్‌లో కొంతమంది బౌలర్లు హ్యాట్రిక్ వికెట్ ఫీట్ సాధించారు. ఈ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు, T20 ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ 8 మంది బౌలర్లు హ్యాట్రిక్ సాధించారు. ఇటీవల వెస్టిండీస్ కు చెందిన పేసర్ రొమారియో షెఫర్డ్ సైతం హ్యాట్రిక్ ఫీట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
T20 ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ సాధించిన 9 మంది బౌలర్లు
1. బ్రెట్ లీ (ఆస్ట్రేలియా)
ఐసీసీ T20 ప్రపంచ కప్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్ బ్రెట్ లీ. ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ 2007లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు.
2. కర్టిస్ క్యాంఫర్ (ఐర్లాండ్)
బ్రెట్ లీ తర్వాత, T20 ప్రపంచ కప్‌లో 14 సంవత్సరాల తర్వాత ఐర్లాండ్ ఆటగాడు కర్టిస్ క్యాంఫర్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. క్యాంఫర్ 2021 T20 ప్రపంచ కప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు సాధించాడు. T20 ప్రపంచ కప్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన రెండవ బౌలర్‌గా కర్టిస్ క్యాంఫర్ నిలిచాడు.
3. వనిందు హసరంగా (శ్రీలంక)
శ్రీలంక ఆల్ రౌండర్ వనిందు హసరంగా 2021 T20 ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ సాధించాడు. హసరంగా ఈ ఫీట్‌ను దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సాధించాడు. ఇది పొట్టి ప్రపంచ కప్ చరిత్రలో మూడవ హ్యాట్రిక్.
4. కగిసో రబాడా (దక్షిణాఫ్రికా)
అదే ఏడాది T20 ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా కూడా హ్యాట్రిక్ సాధించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీ పేసర్ రబాడ ఈ ఫీట్ సాధించాడు. T20 ప్రపంచ కప్‌లో ఇది నాల్గవ హ్యాట్రిక్ వికెట్ ఫీట్.
5. కార్తీక్ మయప్పన్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి చెందిన కార్తీక్ మయప్పన్ T20 ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ సాధించిన ఐదవ బౌలర్. మయప్పన్ ICC T20 ప్రపంచ కప్ 2022లో ఈ ఫీట్‌ను సాధించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించాడు.
6. జోష్ లిటిల్ (ఐర్లాండ్)
T20 ప్రపంచ కప్ 2022లో ఐర్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోష్ లిటిల్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జోష్ లిటిల్ ఈ ఫీట్ సాధించాడు. ICC T20 ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ సాధించిన 6వ బౌలర్‌గా నిలిచాడు.
7. పాట్ కమ్మిన్స్ (ఆస్ట్రేలియా)
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ T20 ప్రపంచ కప్ 2024లో వరుసగా రెండు హ్యాట్రిక్ సాధించాడు. కమ్మిన్స్ మొదటి హ్యాట్రిక్ బంగ్లాదేశ్ జట్టుపై సాధించాడు. తర్వాతి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై సైతం హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండు హ్యాట్రిక్‌లు సాధించిన ఏకైక బౌలర్ కమ్మిన్స్. కానీ ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌నకు అతడు దూరమయ్యాడు.
8. క్రిస్ జోర్డాన్ (ఇంగ్లాండ్)
T20 ప్రపంచ కప్ 2024లో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ జోర్డాన్ హ్యాట్రిక్ సాధించాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో జోర్డాన్ ఈ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. T20 ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ సాధించిన 8వ బౌలర్ క్రిస్ జోర్డాన్.
9. రొమారియో షెఫర్డ్ (వెస్టిండీస్)
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రొమారియో షెఫర్డ్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. దాంతో వెస్టిండీస్ 35 పరుగుల తేడాతో స్కాట్లాండ్ మీద విజయం సాధించింది. అతడు ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. టీ20 వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ సాధించిన 9వ బౌలర్‌గా నిలిచాడు.

















