T20 world cup India vs usa: అమెరికాపై టీమిండియా ఘన విజయం.. సూర్య కెప్టెన్ ఇన్నింగ్స్, రాణించిన సిరాజ్, అర్షదీప్, అక్షర్
Ind vs USA: టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ 84 పరుగులతో రాణించంతో అమెరికాపై 29 పరుగుల తేడాతో భారత్ నెగ్గింది.

India vs USA Match highlights: భారత క్రికెట్ జట్టు విజయంతో టీ20 ప్రపంచ కప్ 2026 ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇండియా ప్రత్యర్థి USAని 29 పరుగుల తేడాతో ఓడించింది. T20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచులో భారత జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగిన నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ఛేజింగ్‌కు దిగిన USA జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులు మాత్రమే చేయడంతో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 84 పరుగులతో అజేయంగా నిలిచాడు. కీలక సమయంలో సూర్య ఆడిన ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది.
మ్యాచ్‌లో USA టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. అమెరికా బౌలర్లు భారత బ్యాటటర్లను పెద్ద షాట్లు ఆడకుండా సక్సెస్ అయ్యారు. అభిషేక్ శర్మ, శివం దూబేలు ఖాతా కూడా తెరవలేదు. తెలుగుతేజం తిలక్ వర్మ 25 పరుగులు, ఇషాన్ కిషన్ 20 పరుగులు చేసి పరవాలేదనిపించారు. ఈ దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. చివరి ఓవర్లలో సూర్య బౌండరీలు బాదుతూ పరుగులు రాబట్టాడు. సూర్య 25వ హాఫ్ సెంచరీ (49 బంతుల్లో 84 పరుగులు) చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ సూర్య బ్యాట్ ఝులిపించకపోతే ఇండియా 130-140 స్కోరు కూడా చేయకపోయేది.
Painting the ground with his masterful shot-making 🎨👏
— BCCI (@BCCI) February 7, 2026
One word for Captain @surya_14kumar's match-winning knock? 👇
Scorecard ▶️ https://t.co/Rlm2ARPVEt#TeamIndia | #MenInBlue | #T20WorldCup | #INDvUSA pic.twitter.com/GWjMyNy9Rt
USA జట్టు తరఫున బౌలర్ షెడ్లీ వాన్ షాల్క్‌విక్ మెరిశాడు. ఒకే ఓవర్లో భారత బ్యాటర్లు ఇషాన్ కిషన్, తిలక్ వర్మతో పాటు శివం దూబేలను అవుట్ చేసి సంచలనం సృష్టించాడు. షాడ్లీ 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. హర్మిత్ సింగ్ కూడా 2 వికెట్లు తీశాడు.
భారత్ తొలి విజయం
ఇది T20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టుకు తొలి విజయం దక్కింది. అంతకుముందు పాకిస్తాన్, వెస్టిండీస్ కూడా పొట్టి ప్రపంచ కప్‌లో తమ తొలి మ్యాచ్‌లు గెలిచాయి. బౌలింగ్‌లో భారత్ తరఫున మహ్మద్ సిరాజ్ విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. చివరి నిమిషంలో దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. సిరాజ్ 4 ఓవర్లలో కేవలం 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. సిరాజ్ భారత్ అసలు జట్టులో లేడు. గాయపడిన హర్షిత్ రాణా స్థానంలో జట్టులోకి వచ్చాడని తెలిసిందే.
Innings Break!
— BCCI (@BCCI) February 7, 2026
Captain Surya Kumar Yadav's terrific 8⃣4⃣*(49) propel #TeamIndia to 1⃣6⃣1⃣ 👌👌
Over to our bowlers 🙌
Scorecard ▶️ https://t.co/Rlm2ARPnOV#MenInBlue | #T20WorldCup | #INDvUSA pic.twitter.com/6cI4ctXIVk
అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీశాడు. హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చాడు. అతడికి వికెట్ దక్కలేదు.





















