Team India Former Captain Suryakumar Opens Up About Captaincy Removal: భారత టీ20 జట్టుకు 2026 వరల్డ్ కప్ ట్రోఫీని అందించిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అనూహ్యంగా జట్టుకే దూరం కావడంపై తొలిసారి మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టాడు. అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను సెలెక్టర్లు టీ20 కెప్టెన్‌గా నియమించడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల నుంచి సూర్యను పూర్తిగా తప్పించారు. ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని నెలల తర్వాత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాతో జరిగిన ఇంటర్వ్యూలో సూర్యకుమార్ తన మనసులోని భావాలను పంచుకున్నాడు. జట్టు జాబితాలో తన పేరు లేకపోవడం చూసినప్పుడు తాను కేవలం నవ్వుకున్నానని చెప్పాడు. 

Continues below advertisement

Read Also: Kaif Slams Tactics: దినుష వీక్‌నెస్ పసిగట్టడంలో టీమ్ ఇండియా ఘోరంగా విఫలం.. అంతమంది కోచ్ లు ఉండి ఏం లాభమని మాజీ క్రికెటర్ ఫైర్..!

ఒలింపిక్స్ వ‌ర‌కు..రాబోయే ఒలింపిక్స్ తో పాటు తర్వాతి టీ20 వరల్డ్ కప్ వరకు తనే కెప్టెన్‌గా ఉంటానని అనుకున్నట్లు సూర్య వ్యాఖ్యానించాడు. "జట్టు ప్రకటనలో నా పేరు కనిపించనప్పుడు ఒక్కసారిగా నవ్వాను. కెరీర్‌లో ఒత్తిడి వచ్చినప్పుడల్లా నేను రిలాక్స్‌గా ఉంటూ నవ్వుతూనే ముందుకు సాగాను. 2026 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మరో రెండేళ్ల పాటు జట్టును ముందుకు తీసుకెళ్లగలనని, ఒలింపిక్స్ లో సారథ్యం వహిస్తానని భావించాను. అయితే సెలెక్టర్ల ఆలోచనలు వేరేలా ఉన్నాయి. భవిష్యత్తు కోసం వేరొకరు కెప్టెన్‌గా ఉంటే మంచిదని వారు భావిస్తే ఆ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. మరొకరి నాయకత్వంలో జట్టు బాగా ఆడితే నాకు ఎలాంటి సమస్యా లేదు" అని సూర్యకుమార్ తెలిపాడు.

Continues below advertisement

Read Also: Trans Cricketer Anaya Bangar Debate: విమెన్స్ బిగ్ బాష్ లీగ్ లోకి అనయ బంగర్ ఎంట్రీ.. మారిజానే కాప్ విమర్శలకు కౌంటర్ తో స‌మాధానం..

ఒక్క సిరీస్ ఓడిపోక పోయినా..తన తర్వాత కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, అతడు గొప్ప లీడర్ అని సూర్య కొనియాడాడు. అయితే సెలెక్టర్ల నిర్ణయం తనను తీవ్రంగా నిరాశపరిచిందని తెలిపాడు. "రెండేళ్ల కాలంలో మేం ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా ఓడిపోలేదు. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ టైటిళ్లు గెలిచాం. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో ఇలాంటి ఆకస్మిక మార్పు ఎందుకు జరిగిందో నాకు అర్థం కాలేదు. గెలవగానే ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్న నా మనసులో మెదిలింది. దాదాపు నెలన్నర పాటు ఇంట్లోనే కూర్చుండిపోయాను. బంధువులు, స్నేహితులు వచ్చి ఓదార్చినా వారు వెళ్లిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ఆ బాధ తెలిసేది" అని పేర్కొన్నాడు.

ఎప్పుడైనా సిద్ధం..జట్టు ఎంపిక ప్రకటనకు రెండు మూడు రోజుల ముందే సెలెక్టర్లు తనకు ఫోన్ చేసి 'ఇక వేరే మార్గంలో ముందుకెళ్లే సమయం వచ్చింది' అని చెప్పినట్లు సూర్యకుమార్ తెలిపాడు. "వారు అలా చెప్పినప్పుడు నేను ఏమాత్రం కోపగించుకోలేదు. జట్టు మంచి కోసం వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని హుందాగా స్వీకరించాను. దేశం కోసం ఆడటానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. మీరు ఎప్పుడు పిలిచినా బరిలోకి దిగేందుకు నా బ్యాట్ సిద్ధంగా ఉంటుంది" అని సూర్యకుమార్ తెలిపాడు.