Srikkanth Slams Team Management Over Samson Snub:  జింబాబ్వేతో రీసెంట్ గా ముగిసిన టి20 సిరీస్ కు వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ను సెలెక్ట్ చేయకపోవడంపై బిసిసిఐ మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమ్ మేనేజ్‌మెంట్ కొంతమంది ప్లేయర్ల పట్ల పక్షపాతం చూపిస్తోందని ఆరోపించాడు. ఈ ఇయర్ బిగినింగ్ లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో సంజూ శాంసన్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఓపెనర్ అభిషేక్ శర్మకు వరుసగా ఛాన్సెస్ ఇస్తూ సంజూ శాంసన్ ను ఎందుకు పక్కన పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాడు.

Continues below advertisement

Read Also: Arshdeep - Samreen Romance: "మై పర్సన్" అంటూ పిక్స్ షేర్ చేసిన అర్షదీప్ .. బాలీవుడ్ బ్యూటీతో యూకేలో రొమాంటిక్ వెకేషన్!

సంజూ ఎంవిపి ప్లేయర్.. అభిషేక్ కి మాత్రమే లాంగ్ రోప్ ఎందుకు?తన యూట్యూబ్ ఛానెల్ లో శ్రీకాంత్ మాట్లాడుతూ.. "వరల్డ్ కప్ లో సంజూ శాంసన్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP) గా నిలిచాడు. అతనికి ఛాన్స్ ఇవ్వకుండా అభిషేక్ శర్మకు మాత్రమే ఇన్ని ఛాన్సెస్ ఎలా ఇస్తారు? ఇది చాలా వాలిడ్ క్వశ్చన్. అభిషేక్ కి లాంగ్ రోప్ ఇస్తున్నప్పుడు శాంసన్ కి ఎందుకు ఇవ్వరు? ఒక ప్లేయర్ విషయంలో ఒకలా, ఇంకొకరి విషయంలో వేరేలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు?" అని తీవ్ర స్థాయిలో ప్రశ్నించాడు.

Continues below advertisement

Read Also: Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్

కూల్ గా ఆడి రన్స్ చేయాలి.. సంజూకి శ్రీకాంత్ బిగ్ అడ్వైస్అయితే సంజూ శాంసన్ తన బ్యాటింగ్ స్టైల్ ని కొంచెం మార్చుకుని రన్స్ చేసే వేరే రూట్ వెతుక్కోవాలని శ్రీకాంత్ సజెస్ట్ చేశాడు. "సంజూ త్వరలోనే స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇస్తాడని భావిస్తున్నా. గ్రౌండ్ లోకి రాగానే బంతిని వేస్ట్ చేయకుండా ఫస్ట్ కొన్ని బాల్స్ కూల్ గా డిఫెండ్ చేసుకోవాలి. అతనికి రన్ రేట్ కవర్ చేసే ఎబిలిటీ ఉంది. ఫస్ట్ 100 స్ట్రైక్ రేట్ తో ఆడి సెట్ అయ్యాక దాన్ని 200 కి తీసుకెళ్లొచ్చు, అంతేకానీ వికెట్ ని త్వరగా పడేసుకోకూడదు" అని అడ్వైస్ ఇచ్చాడు.

టి20 వరల్డ్ కప్ హిస్టారిక్ కంబ్యాక్.. 321 రన్స్ తో రికార్డుల వేటసొంత‌గ‌డ్డ‌ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో సంజూ శాంసన్ మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్ ఇచ్చి ఇండియా టైటిల్ గెలవడంలో మెయిన్ రోల్ ప్లే చేశాడు. స్టార్టింగ్ లో ప్లేయింగ్ 11 లో లేకపోయినా, ఆ తర్వాత లభించిన ఛాన్సెస్ లో 5 ఇన్నింగ్స్ లలోనే 80.25 యావరేజ్, 199.37 స్ట్రైక్ రేట్ తో 321 రన్స్ సాధించాడు. ఇండియా తరఫున టాప్ రన్ స్కోరర్ గా నిలవడమే కాకుండా, ఒకే వరల్డ్ కప్ ఎడిషన్ లో 24 సిక్సర్లు బాది ఆల్ టైమ్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు.