Flashback 2024: 2024  భారత క్రికెట్ జట్టుకు చాలా కలిసొచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 11 సంవత్సరాల కరువుకు ముగింపు పలికినట్టుగా జట్టు ICC ట్రోఫీని (T20 ప్రపంచ కప్ 2024) గెలుచుకుంది. చివరగా 2013లో చాంపియన్స్ ట్రోఫీ రూపంలో ఐసీసీ టోర్నీని నెగ్గిన భారత్.. ఇన్నాళ్లకు తన కరువును తీర్చుకుంది.  మరోవైపు జట్టు ఆటగాళ్లకు కొన్ని ఒడిదొడుకులు కూడా ఎదురయ్యాయి. టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వీడ్కోలు పలికారు. భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయ్యాడు. చాలా మార్పులు జరిగిన ఈ 2024 గురించి వివరంగా తెలుసుకుందాం..
రోహిత్ శర్మ: భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో ఇప్పటి వరకు 27 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 37 ఇన్నింగ్స్‌ల్లో 33.29 సగటుతో 1132 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతను 3 సెంచరీలు మరియు 7 అర్ధ సెంచరీలు సాధించాడు. అయితే ధోనీ తర్వాత ఐసీసీ ట్రోఫీని అందించిన కెప్టెన్ గా రికార్డులకెక్కాడు.





విరాట్ కోహ్లీ:
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి ఈ ఏడాది ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో 22 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 29 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన అతను 22.62 సగటుతో 611 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ,  2 అర్ధ సెంచరీలు సాధించాడు. అయితే ప్రస్తుత ఆసీస్ సిరీస్ లోనూ అంతకుముందు జరిగిన న్యూజిలాండ్ సిరీస్ లోనూ ఈ స్టార్ బ్యాటర్ విఫలమయ్యాడు. 
సూర్యకుమార్ యాదవ్: ఈ ఏడాది భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2024లో ఇప్పటివరకు టీమిండియా తరఫున సూర్య 18 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 17 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన అతను 26.81 సగటుతో 429 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 4 అర్ధ సెంచరీలు సాధించాడు. అలాగే సౌతాఫ్రికాను దాని సొంతగడ్డపై టీ20 సిరీస్ లో ఓడించి, ఘనత వహించాడు.





హార్దిక్ పాండ్యా:
స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 2024లో టీమ్ ఇండియా తరఫున ఇప్పటివరకు 17 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 14 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన హార్దిక్ 44.00 సగటుతో 352 పరుగులు చేశాడు. అందులో 1 అర్ధ సెంచరీ కూడా ఉంది. ఇది కాకుండా, 16 ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసి, హార్దిక్ 26.25 సగటుతో 16 వికెట్లు తీశాడు, అందులో అత్యుత్తమ సంఖ్య 3/20.



ఇక టీ20 ప్రపంచకప్ లో అటు బ్యాట్ తోనూ, ఇటు బంతితోనూ సత్తాచాటి సిసలైన ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. ఇంకా చాలామంది భారత బ్యాటర్లు ఉన్నప్పటికీ, ఈ ఏడాది వీరు లైమ్ లైట్ లో నిలిచారు. 
(నోట్: ఈ వివరాలు బ్రిస్బేన్ టెస్టుకు ముందు వరకు ఉన్న గణాంకాలుగా గమనించగలరు)


Also Read: Rohit Vs Gambhir: రోహిత్, గంభీర్ మధ్య విబేధాలు!! టీమ్ సెలెక్షన్ రాంగ్- భారత జట్టుపై మాజీ క్రికెటర్ విశ్లేషణ