South Africa vs Australia WTC Final 2025: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ ఇంగ్లాండ్‌లోని లార్డ్స్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగింది. ఇక్కడ దక్షిణాఫ్రికా శనివారం నాడు ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాకు 282 పరుగులు లక్ష్యం నిర్దేశించింది. దీనిని దక్షిణాఫ్రికా మార్క్రమ్ సెంచరీ, కెప్టెన్ టెంబా బావుమా అర్ధ సెంచరీ సహాయంతో నాల్గో రోజు మొదటి సెషన్‌లో ఛేదించింది. దక్షిణాఫ్రికాకు ఇది 27 సంవత్సరాలలో మొదటి ICC ట్రోఫీ. దక్షిణాఫ్రికా టైటిల్ గెలిచినందుకు ICC నుంచి 30.78 కోట్ల రూపాయలు అందుకుంది. అదే సమయంలో ఆస్ట్రేలియాపై కూడా నోట్ల వర్షం కురిసింది.
దక్షిణాఫ్రికాకు 30.78 కోట్లు, ఆస్ట్రేలియా భారీగా బహుమతులు
దక్షిణాఫ్రికా టైటిల్ గెలిచినందుకు ICC నుంచి 30.78 కోట్ల రూపాయలు అందుకుంది. ఇది గతంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్న జట్టు కంటే రెట్టింపు. అదే సమయంలో, ఈ సంవత్సరం ఫైనల్‌లో ఓడిపోయినప్పటికీ, ఆస్ట్రేలియా 18.46 కోట్ల రూపాయలు గెలుచుకుంది, ఇది గతంలో రన్నరప్‌గా నిలిచిన జట్టు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. 2023లో టైటిల్ గెలిచినందుకు ఆస్ట్రేలియాకు 13.69 కోట్ల రూపాయలు లభించాయి. అదే సమయంలో, రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు 6.84 కోట్ల రూపాయలు గెలుచుకుంది.
దక్షిణాఫ్రికా విజయంలో హీరో మార్క్‌రమ్
దక్షిణాఫ్రికా 27 సంవత్సరాల తర్వాత ICC ట్రోఫీని గెలుచుకుంది. అంతకుముందు, వారు 1998లో ICC నాకౌంట్ ట్రోఫీని గెలుచుకున్నారు, ఇది ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీగా పిలుపుస్తున్నారు. దక్షిణాఫ్రికా విజయంలో చాలా మంది హీరోలు ఉన్నారు. ఇందులో మొదటి పేరు మార్క్‌రమ్ కూడా ఉంది. మార్క్‌రమ్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో పరుగులు ఏం చేయకుండానే అవుట్ అయ్యాడు. కానీ అతని జట్టు 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు, అతను సెంచరీ సాధించి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు.
మార్క్రమ్ 136 పరుగులు చేశాడు. మార్క్రమ్ ఈ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు కొట్టాడు. మార్క్రమ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో సెంచరీ సాధించిన మూడో ఆటగాడు. అంతకుముందు 2023 ఫైనల్‌లో స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ సెంచరీలు సాధించారు. అప్పుడు వారిద్దరు జట్టులో గెలుపులో భాగమయ్యారు. ఐడెన్ మార్క్రమ్ (207 బంతుల్లో 136 పరుగులు) అద్భుతమైన సెంచరీ చేశాడు. అతనికి టెంబా బవుమా (134 బంతుల్లో 66 పరుగులు) మద్దతు ఇచ్చాడు, అతను నొప్పిని తట్టుకుని పోరాడాడు. ఈ జంట కలిసి 147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది, లార్డ్స్‌లో విజిటింగ్ బ్యాట్స్‌మెన్ అత్యధిక నాల్గో ఇన్నింగ్స్ లో ఎక్కువ సమయం క్రీజ్‌లో ఉన్న జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. వీళ్లిద్దరు ఈ ఇన్నింగ్స్‌లో ఎంత పాత్ర పోషించారో కగిసో రబాడా దక్షిణాఫ్రికా బౌలింగ్ హీరోగా అవతరించాడు, ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్‌ను కూల్చి మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ఆస్ట్రేలియాను ఓడించి తొలి ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకోవడం ద్వారా చాలా కాలంగా తమపై ఉన్న 'చోకర్స్' లేబుల్ తొలగించుకున్నారు. ప్రోటీస్ 27 సంవత్సరాల ICC టైటిల్ దాహాన్ని తీర్చుకున్నారు. WTC ట్రోఫీని వరుసగా ఎనిమిది టెస్ట్ విజయాలతో గ్రాండ్‌గా ముగించింది.