Sanjay Manjrekar: ఆసీస్ పిచ్ లపై హర్షల్ ప్రభావం చూపలేడు.. భారత మాజీ బ్యాట్స్ మెన్

Sanjay Manjrekar: ఆసీస్ లాంటి బౌన్సీ పిచ్ లపై భారత బౌలర్ హర్షల్ పటేల్ ప్రభావం చూపలేడని.. భారత మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. అతని స్లో బంతులు బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేవని అభిప్రాయపడ్డాడు.

Continues below advertisement

Sanjay Manjrekar: ఆస్ట్రేలియా పరిస్థితుల్లో భారత బౌలర్ హర్షల్ పటేల్ ఏమాత్రం ప్రభావం చూపుతాడనే విషయంలో తనకు సందేహాలు ఉన్నాయని.. టీమిండియా మాజీ బ్యాట్స్ మెన్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. అక్టోబర్ 16 నుంచి ఆసీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభమవనుంది. ఇందుకోసం ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో హర్షల్ పటేల్ చోటు దక్కించుకున్నాడు. 

Continues below advertisement

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లోనూ హర్షల్ పటేల్ భాగమయ్యాడు. సెప్టెంబర్ 20న జరిగిన తొలి మ్యాచులో 209 పరుగులను కాపాడుకోవడంలో భారత్ విఫలమైంది. ఈ మ్యాచ్ లో హర్షల్ పటేల్ తన 4 ఓవర్ల కోటాలో 49 పరుగులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ హర్షల్ బౌలింగ్ పై సందేహాలు వ్యక్తంచేశారు. అతని స్లో బంతులు బ్యాటర్లను ఇబ్బందిపెట్టలేవని అభిప్రాయపడ్డారు.

మిడిల్, డెత్ ఓవర్లలో కీలక బౌలర్

2021 ఐపీఎల్ లో 32 వికెట్లు తీసి హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన హర్షల్.. బౌలింగ్ యాక్షన్ లో మార్పు లేకుండా స్లో డెలివరీలతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అంతర్జాతీయంగా 18 టీ 20ల్లో ఓవర్ కు 8 ఎకానమీతో 23 వికెట్లు తీశాడు. 
పక్కటెముకల గాయం నుంచి కోలుకున్న తర్వాత 31 ఏళ్ల హర్షల్ పటేల్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. టీ20ల్లో భారత్ కు డెత్ ఓవర్లలో, మిడిల్ ఓవర్లలో కీలకంగా మారాడు. 

ఆ పిచ్ లపై హర్షల్ ఇబ్బంది పడతాడు

ఈ క్రమంలోనే హర్షల్ బౌలింగ్ యాక్షన్ పై సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతను చివరి సారి బౌలింగ్ చేసినప్పుడు అతని స్లోయర్ బంతులు 120 కి.మీల వేగంతో ఉన్నాయి. పేస్ లో భారీ తగ్గుదల లేదు. పిచ్ ఫ్లాట్ గా, బౌన్సీగా, పేసీగా ఉంటే హర్షల్ ఇబ్బంది పడతాడు. ఆస్ట్రేలియా పిచ్ లు అలానే ఉంటాయి. కాబట్టి హర్షల్ ప్రభావం ఏమాత్రం ఉంటుందో చూడాలని మంజ్రేకర్ అన్నారు. 

ఎకానమీ ఆందోళనకరం

హర్షల్ పటేల్ ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో టీ20 క్రికెట్ ఆడలేదు. ఈ ఏడాది ప్రారంభంలో ఐర్లాండ్ లోని ఫ్లాట్ పిచ్ పై 4 ఓవర్ల స్పెల్ లో 54 పరుగులు ఇచ్చాడు. 2022 లో అతని ఎకానమీ 9కి పైగానే ఉంది. అయితే అతని వికెట్ టేకింగ్ సామర్థ్యాన్ని గుర్తించిన భారత మేనేజ్ మెంట్ అతనికి ప్రపంచకప్ లో చోటు కల్పించింది. 


బుమ్రా.. బౌలింగ్ సమస్యలు పరిష్కరించగలడు

భారత బౌలింగ్ పైనా సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. బౌలింగ్ వైఫల్యాల గురించి తాను పెద్దగా ఆందోళన చెందడంలేదని తెలిపాడు. బుమ్రా, షమీ అందుబాటులో ఉంటే బౌలింగ్ విభాగం బలోపేతమవుతుందని చెప్పాడు. వారిద్దరి చేరికతో పేస్ బౌలింగ్ మెరుగవుతుందని అన్నాడు. 

ఇటీవల కాలంలో భారీ స్కోర్లను కాపాడుకోవడంలోనూ భారత్ విఫలమవుతోంది. ఆసియా కప్ సూపర్- 4 మ్యాచ్ ల్లో శ్రీలంక, పాకిస్థాన్ తో ఓటమికి బౌలర్ల వైఫల్యం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20లోనూ 209 పరుగుల భారీ స్కోరును కాపాడుకోలేకపోయింది. 

ఆసియా కప్ తో పాటు ఆసీస్ తో జరిగిన తొలి టీ 20కి భారత్ ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విశ్రాంతి తీసుకున్నాడు. సెప్టెంబర్ 23న నాగ్ పుర్ లో జరగనున్న రెండో టీ20 కి బుమ్రా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. 

<

Continues below advertisement