ROKO Unstoppable: చీఫ్ సెలెక్టర్, హెడ్ కోచ్ కాదు.. గత 10 ఇన్నింగ్స్ చూస్తే రోహిత్, కోహ్లీని ఎవరూ తొలగించలేరు
Rohit Sharma ODI Innings | రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సిడ్నీలో 168 పరుగుల అజేయ భాగస్వామ్యంతో భారత్ ను గెలిపించారు. గత 10 వన్డేల్లో వారి గణాంకాలు చూస్తే రిటైర్మెంట్ గురించి నోరెత్తరు.

Virat Kohli ODI Innings | రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత క్రికెట్ జట్టుకు స్ట్రాంగ్ పిల్లర్స్ అని మరోసారి నిరూపించారు. ఆస్ట్రేలియాతో జరిగిన 2 మ్యాచ్‌లలో టీమ్ ఇండియా ఓడిపోయి 2-0తో సిరీస్ ఓడిపోయింది. కానీ రోహిత్ శర్మ, కోహ్లీలు మంచి టచ్ లోకి వచ్చి భారత్‌కు మంచి ఎండింగ్‌తో సిరీస్‌ను ముగించారు. సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో రోహిత్ 121 పరుగులు, విరాట్ కోహ్లీ 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఇండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు.
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే క్రికెట్ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తాయి. రోహిత్ అడిలైడ్‌లో 73 పరుగులు, ఇప్పుడు సిడ్నీలో 121 పరుగులు చేసి ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మరోవైపు కోహ్లీ వరుసగా రెండుసార్లు డకౌట్ అయిన తర్వాత సిడ్నీలో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గత 10 వన్డే ఇన్నింగ్స్‌లలో కోహ్లీ ప్రదర్శన చాలా బాగుంది. ఇది చూసిన చీఫ్ సెలెక్టర్, హెడ్ కోచ్ జట్టు నుండి తొలగించే ఆలోచన చేయలేరు.
గత 10 ఇన్నింగ్స్‌లలో రోహిత్ శర్మ ప్రదర్శన
గత 10 ఇన్నింగ్స్‌లలో రోహిత్ శర్మ 502 పరుగులు చేశాడు. గత కొంతకాలం నుంచి హిట్ మ్యాన్ విధ్వంసకర రీతిలో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో 180 పరుగులు చేశాడు. ఈ పరుగులు 100 స్ట్రైక్ రేట్‌తో చేశాడు.
𝐑𝐮𝐧 𝐌𝐚𝐜𝐡𝐢𝐧𝐞 🔢
— BCCI (@BCCI) October 25, 2025
Virat Kohli surpassed Kumar Sangakkara in the tally for Most Runs in ODI cricket history 🫡
Scorecard ▶ https://t.co/4oXLzrhGNG#TeamIndia | #3rdODI | #AUSvIND | @imVkohli pic.twitter.com/bf9lnynpn2
గత 10 వన్డే ఇన్నింగ్స్‌లలో 2 సెంచరీలు, 2అర్ధ సెంచరీలు సాధించాడు. రోహిత్ ప్రస్తుతం 2025లో భారత్ తరపున అత్యధిక పరుగులు (504) చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. అతని తర్వాత శ్రేయస్ అయ్యర్ (496) ఉన్నాడు. ఈ గణాంకాలు రోహిత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని, అతన్ని జట్టు నుండి తీసేసే ఆలోచన కూడా తప్పు అని నిరూపిస్తున్నాయి.
గత 10 ఇన్నింగ్స్‌లలో విరాట్ కోహ్లీ ప్రదర్శన
గత 10 వన్డే ఇన్నింగ్స్‌లలో విరాట్ కోహ్లీ 349 పరుగులు చేశాడు. అతడు 43.6 సగటుతో పరుగులు చేశాడు. విరాట్ చాలా ఇన్నింగ్స్‌లలో ఫ్లాప్ అయ్యాడు. ఒక ఆటగాడు ఫ్లాప్ అవుతున్నప్పటికీ 43 సగటుతో పరుగులు చేస్తున్నాడంటే జట్టులో తన ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది వన్డేల్లో ఒక సెంచరీ, 3 అర్ధ సెంచరీలు చేశాడు.
విరాట్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతను 218 పరుగులు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యటర్ శ్రేయాస్ అయ్యర్ (243). ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వరుసగా 2 సార్లు ఖాతా తెరవకుండానే అవుట్ కావడంతో అతని రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు ఊపందుకోగా, సిడ్నీలో 74 పరుగులు చేయడంతో విమర్శకుల నోరు మూయించాడు.





















