Rishabh Pant Health:  రిషభ్ పంత్, టీమిండియా అభిమానులకు చేదువార్త. రోడ్డు ప్రమాదానికి గురై ప్రస్తుతం చికిత్స పొందుతున్న భారత యువ బ్యాటర్ రిషభ్ పంత్ వచ్చే వన్డే ప్రపంచకప్ నకు దూరం కానున్నాడు. గతవారం పంత్ ఎడమకాలి లిగమెంట్ కు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇంకో 6 వారాల తర్వాత పంత్ కు మరో శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపినట్లు సమాచారం. 


రిషభ్ పంత్.... గతేడాది డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత వారం అతను లిగమెంట్ కు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. మరో 6 వారాల తర్వాత పంత్ కు మరో సర్జరీ చేయనున్నారు. కాబట్టి పంత్ కోలుకునేందుకు కనీసం 8-9 వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. దీంతో స్వదేశంలో ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ కు రిషభ్ పంత్ దూరమైనట్లే.


ఇంకో సర్జరీ అవసరం


రోడ్డుప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిషభ్ పంత్ ఇప్పటికే ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ, ఐపీఎల్- 2023కి దూరమయ్యాడు. ఇప్పుడు వన్డే ప్రపంచకప్ నకు దూరమయ్యే అవకాశం ఉంది. గత వారం పంత్ కు ముంబై లోని కోకిలాబెన్ ఆసుపత్రి వైద్యులు లిగమెంట్ కు శస్త్రచికిత్స చేశారు. మరో 6వ వారాల తర్వాత ఇంకో సర్జరీ అవసరమని తెలిపారు.  దీనిపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడారు. 'పంత్ ఎప్పుడు తిరిగి వస్తాడో ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. అతని తాజా వైద్య నివేదికల ప్రకారం కనీసం 8-9 నెలలు ఆటకు దూరంగా ఉండనున్నాడు. కాబట్టి వన్డే ప్రపంచకప్ కు దూరమయ్యే అవకాశం ఉంది. అయితే ఇది అతని తదుపరి సర్జరీ ఎలా సాగుతుందనే దానిపై ఆధారపడి ఉంది.' అని ఆయన తెలిపారు. 


రిషభ్ పంత్ మైదానంలోకి తిరిగి రావడం అనేది అతని పునరావాసం, ఇంకా డిశ్చార్జి తర్వాత అతను తీసుకునే శిక్షణపై ఆధారపడి ఉంటుంది. మరో వారంరోజుల పాటు పంత్ ఆసుపత్రిలోనే ఉంటాడని సమాచారం. రానున్న రోజుల్లో వాకర్, ఆసరాతో నడిచేలా ప్రోత్సహిస్తామని వైద్యులు తెలిపారు. అతనికి 2వ శస్త్రచికిత్సను మరో 6 వారాల తర్వాత నిర్వహించనున్నట్లు చెప్పారు.