Ravindra Jadeja Against England: లార్డ్స్ టెస్ట్‌లో రవీంద్ర జడేజా అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. వారియర్ మాదిరిగా భారత్‌ను గెలుపు దిశగా తీసుకురావడంలో ఇంగ్లండ్‌ను టెన్షన్ పెట్టడంలో విజయవంతమయ్యాడు. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ జడేజా ఆట తీరుకు, టెయిలెండర్స్‌ను ఆడిస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లడంతో ఆయన తీసుకున్న చొరవను ప్రశంసిస్తున్నారు. అతని నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ గతంలో చాలానే చూసినప్పటికీ లార్డ్స్‌వేదికగా మరోసారి అలాంటి చారిత్రాత్కమైన ఇన్నింగ్స్ చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ఆయన్ని వారియర్‌గా వైరల్ చేస్తుమన్నారు.
లార్డ్స్‌లో ఆడటమే గొప్ప అనుకుంటే అలాంటిది మంచి ఫైటింగ్ స్పిరిట్‌తో అర్ధసెంచరీ కూడా పూర్తి చేశాడు. అయితే యాభై పరుగులు పూర్తి కాగానే జడేజా సడెన్‌గా బ్యాట్లు అక్క పడేసి డ్రెస్సింగ్ రూమ్ వైపు పరుగులు పట్టాడు. ఎందుకు అలా పరుగెత్తుతున్నాడో చాలా మంది ఆశ్చర్యపోయారు.
వాష్‌రూమ్‌కు పరుగులు పెట్టిన జడేజా
జడేజాకు టాయిలెట్‌కు వెళ్లేందుకు అలా పరుగులు పెట్టాడని తెలుసుకొని కాసేపు నవ్వుకున్నారు. చిన్న విరామం తీసుకొని మైదానం నుంచి బయటకు వెళ్ళాడు. జడేజా మొదటి సెషన్ నుంచే బ్యాటింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో జడేజా రెండో సెషన్‌లో కూడా బ్యాటింగ్ చేశాడు. జడేజా మ్యాచ్ ఆడటంతోపాటు టీ-బ్రేక్ లో వెళ్దామని అనుకున్నాడు. కానీ అప్పటికి భారత్ 9 వికెట్లు కోల్పోయింది. ఇంకో వికెట్ కోల్పోతే మ్యాచ్ ముగుస్తుంది. అందుకని టీ బ్రేక్‌ను పొడిగించారు.
రవీంద్ర జడేజా సహనం కోల్పోయాడు. అప్పటి వరకు ఉగ్గబెట్టుకొని ఉన్న జడేజా అర్ధసెంచరీ చేసిన తర్వాత మాత్రం ఆగలేకపోయాడు. అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత అతను డ్రెస్సింగ్ రూమ్ వైపు పరిగెత్తాడు. జడేజా టాయిలెట్‌కు వెళ్లడం వల్ల మ్యాచ్ కొంతకాలం నిలిచిపోయింది. జడేజా మైదానంలో పరిగెత్తడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు, కాని దీని వెనుక అసలు కారణం ఏమిటంటే అతను వాష్‌రూమ్‌కు వెళ్లవలసి వచ్చింది.
జడేజా సహనంతో బ్యాటింగ్ టీమిండియా ఐదో వికెట్ కోల్పోయిన తర్వాత రవీంద్ర జడేజా లార్డ్స్‌లో క్రీజ్‌లోకి వచ్చాడు. బాధ్యతలు స్వీకరించాడు. జడేజా మొదట కెఎల్ రాహుల్‌తో 10 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పాడు. తరువాత వాషింగ్టన్ సుందర్ ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. దీని తరువాత జడేజా, నితీష్ రెడ్డి మధ్య 30 పరుగుల బలమైన భాగస్వామ్యం ఏర్పడింది. నితీష్ వికెట్ పడిపోయిన తరువాత జస్ప్రీత్ బుమ్రాతో కలిసి జడేజా 35 పరుగులు జోడించాడు. ఆఖరుకు జడేజా, మహ్మద్ సిరాజ్‌తో కలిసి భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. వీళ్లద్దరు కలిసి 23 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరిలో సిరాజ్ ఓ దురదృష్టకరమైన అవుట్‌తో టీమిండియా పోరాటం ముగిసింది. దీంతో లార్డ్స్‌లో జడేజా పోరాటం ఫలించలేదు.