అన్వేషించండి

Pakistan Vs Namibia: నేడు పాకిస్తాన్‌కు చావో రేవో.. నమీబియా చేతిలో ఓడితే టోర్నీ నుంచి ఔట్

ICC T20 ప్రపంచ కప్‌ 2026లో పాకిస్తాన్‌కు లీగ్ స్టేజీ చివరి మ్యాచ్ డూ-ఆర్-డై గా మారింది. టీమిండియా చేతిలో చేతిమి పాక్ జట్టును ఇరకాటంలో పడేసింది. నేడు నమీబియాపై నెగ్గితేనే సూపర్ 8 చేరుతుంది.

Pakistans Do Or Die Match Against Namibia: తన చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాభవం తరువాత టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ కథ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈరోజు నమీబియాతో జరిగే మ్యాచ్ ఆ జట్టుకు డూ ఆర్ డై లాంటిది. మొన్నటివరకూ పాకిస్థాన్ సూపర్ 8లో చోటు దక్కించుకునే జట్లలో ఒకటిగా పటిష్ట స్థితిలో కనిపించింది. కానీ టీమిండియా చేతిలో ఓటమి ఆ జట్టును తీవ్రంగా దెబ్బకొట్టింది. దీంతో గ్రూప్-ఎ లోని తన చివరి మ్యాచ్‌లో పాక్ తప్పక గెలవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది.

టీ20 ప్రపంచ కప్‌లో ప్రతి గ్రూప్ నుండి లీగ్ స్టేజీ నుంచి 2 జట్లు మాత్రమే సూపర్ 8కు చేరుకుంటాయి. లీగ్ స్టేజీని తొలి 2 స్థానాలతో పూర్తి చేస్తేనే ఆ అవకాశం పాక్‌కు లభిస్తుంది. పాకిస్థాన్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్, అమెరికా తర్వాత 3వ స్థానంలో ఉంది. భారత్ 3 మ్యాచ్‌లలో నెగ్గి నేరుగా సూపర్ 8కు అర్హత సాధించగా, అమెరికా 4 పాయింట్లు, మెరుగైన రన్ రేట్ కారణంగా 2వ స్థానంలో ఉంది.

నమీబియాపై నెగ్గితేనే పాకిస్థాన్‌కు ఛాన్స్.. 
నమీబియా చేతిలో ఓడిపోవడం అసాధ్యంగా అనిపించినప్పటికీ, పాకిస్థాన్ నిలకడలేమిని బట్టి చూస్తే ఏదైనా జరగొచ్చు అనిపిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే పాకిస్థాన్ టోర్నమెంట్ నుండి ఇంటిదారి పడుతుంది. అమెరికా సూపర్ 8లో చోటు దక్కించుకుంటుంది. అయితే పాకిస్థాన్ ఎదుర్కొంటున్న జట్టు ఇప్పటికే ఆడిన 3 మ్యాచ్‌లలో ఓడిపోయి గ్రూప్‌లో చివరి స్థానంలో ఉంది. బాబర్ ఆజం, ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా రాణిస్తేనే పాకిస్థాన్ నెగ్గుతుంది. 

భారత్‌తో మ్యాచులో పాక్ బ్యాటర్లు ఫెయిల్
భారత ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా జోడీ పాకిస్థాన్ జట్టును 3 వికెట్లకు 13 పరుగులుగా చేసింది. పాకిస్థాన్ మిడిల్ ఆర్డర్ ఎలాంటి ప్రభావం చూపలేదు. నమీబియా కనుక సంచలనం చేస్తే పాక్ ఇంటికి వెళ్లడం ఖాయం. ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది రెండు ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు. సైమ్ అయూబ్ రాణించి 3 వికెట్లు తీసి భారత్ టాపార్డర్‌ను కష్టాల్లోకి నెట్టాడు. నమీబియాపై ఆఫ్రిది వికెట్లు తీయాలి. పవర్ ప్లేలో ఓపెనర్లు ఔట్ చేస్తే పాకిస్థాన్ మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశం ఉంటుంది.

పాకిస్థాన్‌కు పవర్‌ప్లే బలహీనత
పాకిస్థాన్ పవర్‌ప్లే వీక్ నెస్ ఉంది. గత మ్యాచ్‌లో పవర్‌ప్లేలో 4 వికెట్లు కోల్పోయింది. మిడిల్ ఆర్డర్‌లో పదేపదే మార్పులు టీంను దెబ్బతీస్తున్నాయి. నమీబియా వద్ద టాలెంటెడ్ బౌలర్లు ఉన్నారు. టాపార్డర్ ను త్వరగా ఔట్ చేస్తే, పాక్ కోలుకోవడం కష్టమే. ఒక్క విజయంతోనైనా టోర్నీ నుంచి నిష్క్రమించాలని టీం భావిస్తోంది. ఒకవేళ ఆ జట్టు పాకిస్థాన్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేస్తే మరో సంచలనం తప్పదు. 

గెర్హార్డ్ ఎరాస్మస్, జెజె స్మిత్‌లపై నమీబియా ఆశలు
భారత్‌పై 4 వికెట్లు తీసిన ఆల్‌రౌండర్, కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్, ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ జెజె స్మిత్ ప్రత్యర్థి జట్టును దెబ్బతీయగలరు. ఓపెనర్ లారెన్ స్టెయిన్‌క్యాంప్ గత మ్యాచ్‌ల్లో రాణించగా, జాన్ నికోలా ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ నమీబియాకు ఆశాకిరణాలుగా ఉన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kuldeep Yadav Wedding: ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Spirit of cricket: బంగ్లా, పాక్ జట్ల మధ్య రనౌట్ చిచ్చు - అలా కూడా ఔట్ చేస్తారా? క్రీడాస్ఫూర్తి ఏం కావాలి?
బంగ్లా, పాక్ జట్ల మధ్య రనౌట్ చిచ్చు - అలా కూడా ఔట్ చేస్తారా? క్రీడాస్ఫూర్తి ఏం కావాలి?
IPL 2026: ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
Advertisement

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget