ధర్మశాల స్టేడియాన్ని పొగ మంచు కమ్మేసింది. దాంతో వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్, టీమిండియాల మధ్య జరుగుతున్న మ్యాచ్ కు కాసేపు ఆటంకం ఏర్పడింది. టీమిండియా స్కోరు 15.4 ఓవర్లలో 100/2 వద్ద మ్యాచ్ కొద్దిసేపు నిలిపివేశారు. కాసేపటి తరువాత ఇరు జట్ల కెప్టెన్లు, ఆటగాళ్లతో చర్చించిన అనంతరం అంపైర్లు మ్యాచ్ తిరిగి కొనసాగించారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు. అయితే పొగ మంచు అటు బ్యాటింగ్ జట్టుతో పాటు ఫీల్డింగ్ చేస్తున్న కివీస్ జట్టుకు సైతం ఇబ్బంది కలిగిస్తోంది. ఒకవేళ మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాక రద్దు చేస్తే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు.

 





ప్రపంచకప్‌లో టీమిండియాకు న్యూజిలాండ్‌ భారీ లక్ష్యం నిర్దేశించింది. ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్‌ బ్యాటర్లు రాణించారు. డేరిల్‌ మిచెల్‌ అద్భుత శతకంతో రోహిత్‌ సేన ముందు 274 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. పిచ్‌ పేసర్లకు అనుకూలిస్తుందన్న అంచనాల నేపథ్యంలో టాస్‌ గెలిచిన టీమిండియా సారధి రోహిత్‌ శర్మ.. బౌలింగ్‌ ఎంచుకున్నాడు. సారధి రోహిత్‌ నిర్ణయం సరైందేనని కాసేపటికే అర్ధమైంది.

 

బుమ్రా.. సిరాజ్‌.. షమీ.. ఆరంభంలో కట్టుదిటంగా బౌలింగ్‌ చేశారు. ఆరంభంలోనే వికెట్‌ తీసి మహ్మద్‌ సిరాజ్‌ కివీస్‌కు షాక్‌ ఇచ్చాడు. ఈ ప్రపంచకప్‌లో మంచి ఫామ్‌లో ఉన్న కాన్వే సిరాజ్‌ బౌలింగ్‌లో అయ్యర్‌ పట్టిన చురుకైన క్యాచ్‌కు వెనుదిరిగాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొన్న కాన్వే ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. దీంతో తొమ్మిది పరుగులకే న్యూజిలాండ్ తొలి వికెట్‌ కోల్పోయింది. కాసేపటికే ఈ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న షమీ.. కివీస్‌కు రెండో షాక్‌ ఇచ్చాడు. విల్‌ యంగ్‌ను షమీ బౌల్డ్‌ చేయడంతో 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ రచిన్‌ రవీంద్ర, డేరిల్‌ మిచెల్‌ అద్భుత భాగస్వామ్యంతో కివీస్‌ మళ్లీ పోరులోకి వచ్చింది. వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు 159 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి కివీస్‌ భారీ స్కోరుకు బాటలు వేశారు. టీమిండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న మిచెల్‌, రచిన్‌ రవీంద్ర.. సమయం దొరికినప్పుడల్లా భారీ షాట్లు ఆడారు. మరింత ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని షమీ విడగొట్టాడు. 87 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సుతో 75 పరుగులు చేసిన రచిన్‌ రవీంద్ర... షమీ బౌలింగ్‌లో గిల్‌కు సులభమైన క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. రచిన్‌ రవీంద్ర అవుటైనా మిచెల్‌ పోరాటం ఆపలేదు. టామ్‌ లాథమ్‌ తక్కువ పరుగులకే వెళ్లిపోయాడు. కుల్‌దీప్‌ యాదవ్‌...లాథమ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం మిచెల్‌కు గ్లెన్‌ ఫిలిప్స్‌ జతకలిశాడు.ఒక వైపు వికెట్లు పడతున్నా మిచెల్‌ మాత్రం పట్టువదలలేదు. 127 బంతుల్లో 9 ఫోర్లు, అయిదు  సిక్సర్లతో 130 పరుగులు చేశాడు. 

 

వికెట్లు చేతులో ఉండడంతో కివీస్‌ తేలిగ్గానే మూడు వందల పరుగులు చేస్తుందని అనిపించింది. 44 ఓవర్లకు అయిదు వికెట్ల నష్టానికి 243 పరుగులతో పటిష్టంగా కనిపించిన కివీస్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. కానీ చివర్లో భారత బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. ఓవైపు పరుగులు ఇవ్వకుండా కట్టడి చేస్తూ... మరోవైపు వరుసగా వికెట్లు తీశారు. 23 పరుగులు చేసిన గ్లెన్‌ ఫిలిప్‌ను కుల్‌దీప్‌ యాదవ్‌ అవుట్‌ చేయగా.. ఆరు పరుగులు చేసిన చాప్‌మన్‌ను బుమ్రా బౌల్డ్‌ చేశాడు. ముఖ్యంగా షమీ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి కివీస్‌ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాడు. శాంటర్న్‌.. హెన్రీని వరుస బంతుల్లో షమీ వెనక్కి పంపాడు. హ్యాట్రిక్‌ను ఫెర్గ్యూసన్ అడ్డుకున్నాడు.

 

భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్‌కు పరుగులు రావడం మందగించింది. ఓ దశలో 300 పరుగులు చేస్తుందనుకున్న కివీస్‌ 280 పరుగులకే పరిమితమైంది. టీమిండియా బౌలర్లలో బ్రుమా 1, మహ్మద్‌ సిరాజ్‌ 1, షమీ 4, కుల్‌దీప్‌ యాదవ్‌ రెండు వికెట్లు తీశారు. ఈ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న షమీ 10 ఓవర్లు బౌలింగ్‌ చేసి కేవలం 54 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు నేలకూల్చి సత్తా చాటాడు. 

 

286 పరుగుల లక్ష్యాన్నిటీమిండియా ఛేదించడం కష్టమేమీ కాదని మాజీలు అంచనా వేస్తున్నారు. టాపార్డర్‌లో రోహిత్‌, కోహ్లీ, కేఎల్ రాహుల్ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. అఫ్గాన్‌పై సెంచరీ చేసిన రోహిత్‌... దాయాది పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌పై కూడా మంచి ఇన్నింగ్సులు ఆడాడు. కోహ్లీ కూడా మంచి ఫామ్‌ అందిబుచ్చుకున్నాడు. బంగ్లాదేశ్‌పై సెంచరీ కూడా బాదాడు. కేఎల్ రాహుల్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు విలువైన స్కోర్ అందిస్తున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌, జడేజా కూడా రాణిస్తే టీమిండియా లక్ష్యాన్ని ఛేదించడం కష్టమేమీ కాదు.