ICC Champions Trophy: భారత ఆటగాళ్లతో ఫ్రెండ్లీగా ఉండొద్దు.. ఉంటే ఆ నష్టం తప్పదు.. తమ ప్లేయర్లకు పాక్ మాజీ హెచ్చరిక
వచ్చేనెల 23న దుబాయ్ లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలా వ్యవహరించాలో మొయిన్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. మైదానంలో భారత ఆటగాళ్లతో అంత కలివిడిగా ఉండాల్సిన అవసరం లేదన్నాడు.

Ind Vs Pak Updates: భారత క్రికెటర్లతో ఫ్రెండ్లీగా ఉండవద్దని తమ క్రికెటర్లకు పాకిస్థాన్ దేశ మాజీ ప్లేయర్ చెబుతున్నాడు. ప్లేయర్ల పట్ల గౌరవం ఉంటే మంచిదే అని, అది ఫీల్డులో చూపించాల్సిన అవసరం లేదని పాక్ మాజీ వికెట్ కీపర్ మొయిన్ ఖాన్ అభిప్రాయ పడ్డాడు. వచ్చేనెల 23న దుబాయ్ లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలా వ్యవహరించాలో మొయిన్ ఖాన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. మైదానంలో భారత ఆటగాళ్లతో అంత కలివిడిగా ఉండాల్సిన అవసరం లేదని, అలా ఉంటే అది బలహీనతగా ప్రొజెక్టు అవుతుందని పేర్కొన్నాడు. ఈసారి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తోంది. అయితే భద్రతా కారణాల రిత్యా ఆ దేశానికి క్రికెటర్లను పంపేందుకు బీసీసీఐ విముఖత చూపడంతో ఐసీసీ చొరవ చూపించి, హైబ్రిడ్ పద్దతిలో మ్యాచ్ లను నిర్వహిస్తున్నారు. భారత్ ఆడే లీగ్ మ్యాచ్ లతోపాటు, ఒకవేళ నాకౌట్ కు చేరితే ఆ మ్యాచ్ లను కూడా దుబాయ్ లోనే నిర్వహిస్తారు.
అలా చేయలేదు..
భారత జట్టుతో తాము ఎన్నో మ్యాచ్ లను ఆడామని, ద్వైపాక్షిక సిరీస్ లు కూడా ఆడిన మైదానంలో ఫ్రెండ్లీగా ఎప్పుడు లేమని మొయిన్ ఖాన్ గుర్తు చేశాడు. తమ జనరేషన్లో చాలా దిగ్గజాలు భారత జట్టులో ఉండేవారని, వారితో ఆడినప్పుడు కేవలం ప్రత్యర్థులుగానే ట్రీట్ చేసేవాళ్లమని తెలిపాడు. అయితే ఇప్పుడు జరుగుతున్న భారత్, పాక్ మ్యాచ్ ల్లో ఫ్రెండ్లీనెస్ ఓవర్ అయిందని విమర్శించాడు. భారత ఆటగాళ్లు క్రీజులోకి రాగానే, వాళ్ల బ్యాట్లను తడిమి చూడటం, స్నేహపూర్వకంగా ఉండటం సరికాదని వ్యాఖ్యానించాడు. ఇలాంటి చేష్టలను వీక్ నెస్ గా ప్రత్యర్థి టీమ్ లు భావించే అవకాశముందని, అంతిమంగా జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపించే అవకాశముందని అభిప్రాయపడ్డాడు. ఇక మొయిన్ ఖాన్ జమానాలో ఐసీసీ టోర్నీల్లో భారత్ ను ఎప్పుడూ ఓడించింది లేదు. ముఖ్యంగా వన్డే ప్రపంచకప్ లో ఒక్క మ్యాచ్ కూడా నేటికి ఓడించలేకపోయింది పాక్ జట్టు.
ప్రతీకారం కోసం..
ఇక చివరిసారిగా 2017లో ఇంగ్లాండ్ వేదికగా భారత్, పాక్ లు తలపడ్డాయి. లీగ్ దశలో పాక్ పై భారత్ విజయం సాధించగా, ఫైనల్లో మాత్రం భారత్ పై పాక్ భారీ విజయం సాధించి, కప్పును ఎగరేసుకు పోయింది. పాక్ సాధించిన చివరి ఐసీసీ టోర్నీ అదే కావడం విశేషం. మరోవైపు ఆనాటి ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత జట్టు గట్టి పట్టుదలతో ఉంది. ఫిబ్రవరి 23న ఇరుజట్లు తలపడనున్నాయి. గత కొంతకాలంగా పాక్ పై వన్డేల్లో భారత్ అద్బుత ప్రదర్శన చేస్తోంది. ఈసారి కూడా అదే రీతిలో ప్రదర్శన ఇవ్వాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ టోర్నీలో గ్రూప్-ఏలో భారత్ ఆడుతోంది. ఈ గ్రూపులో భారత్, పాక్ లతోపాటు బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఆడుతున్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, మార్చి 2న న్యూజిలాండ్ తో భారత్ తలపడనుంది. టీమిండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు.
Also Read: Virat In Ranji Trophy: రంజీల్లోనూ నిరాశ పర్చిన కోహ్లీ.. ఈసారి క్లీన్ బౌల్డ్ (వీడియో)