Asian Games Facilities: నచ్చకపోతే సొంతంగా ఏర్పాట్లు చేసుకోండి.. ఏషియన్ గేమ్స్ వసతుల వివాదంపై జేసీఏ సీఈవో మియాజీ హాట్ కామెంట్స్
ఏషియన్ గేమ్స్ లో పాల్గొనే జట్లకు హోటల్ వసతి కల్పించామని, నచ్చకపోతే సొంత ఏర్పాట్లు చేసుకోవచ్చని జపాన్ క్రికెట్ అసోసియేషన్ సీఈవో నవోకి మియాజీ వ్యాఖ్యానించాడు.

Asian Games, JCA Clarifies Asian Games Accommodation And Amenities: జపాన్ లోని ఐచి నగోయా వేదికగా సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభం కానున్న ఏషియన్ గేమ్స్ క్రికెట్ ఈవెంట్ వసతులపై నెలకొన్న వివాదంపై జపాన్ క్రికెట్ అసోసియేషన్ (జేసీఏ) సీఈవో నవోకి అలెక్స్ మియాజీ స్పందించాడు. నిస్సిన్ సిటీలోని కొరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికకు 20 కిలోమీటర్ల దూరంలో హోటల్ కేటాయించడంపై ప్రముఖ క్రికెట్ దేశాలు ఇటీవల ఏసీసీ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అతడు తాజాగా మాట్లాడాడు. క్రికెట్ జట్లకు హోటల్ వసతిని ఆర్గనైజింగ్ కమిటీ ఆఫర్ చేసిందని, ఒకవేళ ఆ సౌకర్యాలు నచ్చకపోతే జట్లు తమ సొంత ఖర్చులతో నచ్చిన చోట బస ఏర్పాటు చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉందని అతడు తెలిపాడు.
🚨 ASIAN GAMES 2026 ACCOMMODATION UPDATE!
— Clutch Sports (@Clutchsportsz) September 1, 2026
Japan Cricket Association CEO Naoki Alex Miyaji says participating cricket teams at the Asian Games can arrange their own accommodation if they choose, while hotel accommodation is also being offered.
The ACC and AINAGOC have… pic.twitter.com/3CFdZew0rO
వాళ్ల కంటే బెటరే..
ఇతర క్రీడల అథ్లెట్లతో పోలిస్తే క్రికెటర్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించామని మియాజీ పేర్కొన్నాడు. "చాలా ఇతర క్రీడా విభాగాల క్రీడాకారులకు క్రూయిజ్ షిప్‌లు లేదా కంటైనర్ హోటళ్లలో పరిమిత వసతులు కల్పించారు. కానీ క్రికెట్ జట్ల కోసం ఏసీసీ, ఐనాగోక్ చర్చించి హోటల్ వసతిని సిద్ధం చేశాయి. ఒకవేళ ఆ సౌకర్యాలు సరిపోవని భావిస్తే జట్లు తమ స్వంత ఏర్పాట్లు చేసుకోవచ్చు" అని అన్నాడు. అంతేకాకుండా డ్రెస్సింగ్ రూమ్ లకు అర కిలోమీటరు దూరంలో వాష్ రూమ్స్ ఉన్నాయన్న వార్తలను అతడు ఖండించాడు. ప్లేయర్స్ ఏరియా పరిధిలోనే తాత్కాలిక, శాశ్వత వాష్ రూమ్స్, డ్రెస్సింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నామని తెలిపాడు.
Asian Games Japan 2026
— Aswin Dugout 🏏 (@M_Aswin100) August 27, 2026
- The AINAGOC Has Unveiled the Fixtures & Schedule for the T20I Cricket to be Held in Asian Games 🥳
Time for Shreyas Iyer & Co to Bring the Gold for India 🇮🇳 pic.twitter.com/qqp6coRUvR
లంక సాయంతో..
ఐచి ప్రిఫెక్చర్‌లో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మైదానాలు ఏవీ లేకపోవడంతో కేవలం 17 నెలల స్వల్ప వ్యవధిలోనే కొరోగి స్పోర్ట్స్ పార్క్‌ను గ్రౌండ్ లెవల్ నుంచి సిద్ధం చేసినట్లు మియాజీ పేర్కొన్నాడు. "పరిమిత సమయం, వనరుల నడుమ అత్యుత్తమ మైదానాన్ని తీర్చిదిద్దాం. శ్రీలంక క్రికెట్ బోర్డు తమ అనుభవజ్ఞులైన క్యూరేటర్లను పంపించి టర్ఫ్, హైబ్రిడ్ పిచ్‌ల నిర్మాణంలో అద్భుత సహకారం అందించింది. జపాన్‌లో క్రికెట్ ప్రధాన క్రీడ కానప్పటికీ, ఏషియన్ గేమ్స్ చరిత్రలోనే అత్యుత్తమ పిచ్, ఔట్‌ఫీల్డ్‌ను ఇక్కడ అందిస్తున్నాం" అని తెలిపాడు.
ప్రధాన ఆకర్షణ..
ఈ మెగా ఈవెంట్ కోసం నిస్సిన్ నగరంలోని పాఠశాలలు, షాపింగ్ సెంటర్లలో క్రికెట్ ప్రచార కార్యక్రమాలు నిర్వహించామని మియాజీ పేర్కొన్నాడు. ఆసియాలోని అగ్రశ్రేణి క్రికెట్ జట్లు జపాన్ గడ్డపై అడుగుపెట్టడం ఇదే తొలిసారని, ఈ ఈవెంట్ గేమ్స్ లోనే అతిపెద్ద ఆకర్షణగా నిలుస్తుందని అతడు విశ్వాసం వ్యక్తం చేశాడు.
Before You Go
Ishan Kishan Century Duleep Trophy Final | సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్
ట్రెండింగ్ వార్తలు



















