Ishan Kishan Wedding: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న ఇషాన్ కిషన్.. వధువు ఎవరు, ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి ?
Ishan Kishan Wife Name | టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ పెళ్లి వార్త టీ20 వరల్డ్ కప్ మధ్యలో వచ్చింది. కాబోయే భార్య ఎవరో తెలుసుకోండి.

Ishan Kishan Likely to get Married soon | టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ 2026 T20 ప్రపంచ కప్‌లో భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. 27వ లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఇషాన్ కిషన్ ధనాధన్ ఇన్నింగ్స్ ఇండియాను గెలిపించడంలో కీలక పాత్ర పోషించింది. టోర్నమెంట్ మధ్యలో ఇషాన్ కిషన్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడనే శుభవార్త వినిపిస్తోంది.
వాస్తవానికి, భారత లెఫ్ట్ హ్యాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తాత అనురాగ్ పాండే తన మనవడి పెళ్లి గురించి కీలక ప్రకటన చేశారు. నవభారత్ టైమ్స్‌లో ప్రచురితమైన ఒక నివేదికలో, ఇషాన్ తాత తన మనవడు మోడల్ అదితి హుండియాను ఇష్టపడతాడని తెలిపారు. ఇషాన్, అదితి త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారని అనురాగ్ పాండే పేర్కొన్నారు.
ఎవరీ అదితి హుండియా..
ఇషాన్ కిషన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అదితి హుండియా ఎవరు అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన అదితి హుండియా మోడలింగ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మోడలింగ్‌తో పాటు, అదితి తన సొంత ఫ్యాషన్ బ్రాండ్‌ను కూడా ప్రారంభించింది. ఆమె బ్రాండ్ పేరు 'లేబుల్ అదితి హుండియా'. అదితి తండ్రి జైపూర్‌కు చెందిన వ్యాపారవేత్త అని సమాచారం. తండ్రి బాటలోనే నడుస్తూ ఆమె అటు మోడలింగ్ చేస్తూనే, ఇటు వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టింది.
View this post on Instagram
మోడలింగ్‌లో పేరు తెచ్చుకున్న అదితి
అదితి 2016లో మోడలింగ్‌లో కెరీర్ ప్రారంభించింది. తరువాత సంవత్సరం, అంటే 2017లో ఆమె 'ఎఫ్‌బిబి కలర్స్ ఫెమినా మిస్ ఇండియా రాజస్థాన్' టైటిల్ సాధించింది. తరువాత 2018లో అదితి 'మిస్ దివా సూపర్‌నేషనల్' టైటిల్ దక్కించుకుంది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్
అదితి హుండియా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను 2 లక్షల 70 వేల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఆమె తరచుగా తన పాలోవర్స్ కోసం సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇషాన్ కిషన్ ఎప్పటినుంచో సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అవుతున్నాడు. అదే విధంగా క్రికెటర్ ఇషాన్ కిషన్ ఇన్‌స్టా ఫాలోయింగ్ జాబితాలో అదితి పేరు ఉంది. వీరికి కొన్నేళ్ల కిందటే పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. కెరీర్ మళ్లీ గాడిన పడి టీమిండియాలో అవకాశాలు దక్కించుకుని తన ఆటతీరుతో ప్రశంసలు అందుకుంటున్న ఇషాన్ కిషన్ పెళ్లి వార్త క్రికెట్ ప్రపంచంలో మార్మోగిపోతుంది. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.





















