IND vs NED Highlights:ఉత్కంఠ పోరులో ఆఖరి ఓవర్లో గెలిచిన భారత్!, నెదర్లాండ్స్‌పై 17 పరుగుల తేడాతో విజయం!
IND vs NED Highlights: నమీబియాను టీమిండియా 17 పరుగుల తేడాతో ఓడించింది. టీం ఇండియా తరపున శివం దుబే అర్ధ సెంచరీ సాధించాడు. అతనితోపాటు వరుణ్ చక్రవర్తి కూడా బంతితో మెరిశాడు.

IND vs NED Highlights: టీ20 వరల్డ్ కప్‌లో ఆఖరి లీగ్‌దశ మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగుల తేడాతో నమీబియాను ఓడించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో, టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 193 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా నెదర్లాండ్స్ 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. శివం దూబే అర్ధ సెంచరీ సాధించడమే కాకుండా బంతితో కూడా రాణించాడు. వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీసుకుంటే దూబే ఒక వికెట్ తీసుకొని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కించుకున్నాడు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (34), తిలక్ వర్మ (331) రాణించారు. అయితే, శివం దుబే 31 బంతుల్లో 66 పరుగులు చేసి అత్యంత అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన ఇచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో దుబే నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదాడు. హార్దిక్ పాండ్యా కూడా 30 పరుగులు చేశాడు.
చివరి వరకు పోరాడిన నెదర్లాండ్స్
194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నెదర్లాండ్స్ జట్టు పేలవమైన, స్లో ప్రారంభం లభించింది. మొదటి ఎనిమిది ఓవర్లలో, డచ్ జట్టు రన్ రేట్ దాదాపు 6. ఆ తర్వాత కాలిన్ అకెర్మాన్, బాస్ డి లీడ్ 49 రన్స్ జోడించి స్కోరును పరుగులు పెట్టించారు. అకెర్మాన్ 23, డి లీడ్ 33 పరుగులు చేశారు. 15.5 ఓవర్ల నాటికి, నెదర్లాండ్స్ 125/6తో నిలిచింది. పెద్ద ఓటమి దాదాపు ఖాయం అనిపించింది.
జాక్ లియాన్, నోహ్ క్రాస్ బ్యాట్‌తో తుఫాను సృష్టించారు, వారు చివరి ఓవర్ వరకు నెదర్లాండ్స్ విజయపు ఆశలను సజీవంగా ఉంచారు. వారు కేవలం 23 బంతుల్లో 47 పరుగులు జోడించారు. నెదర్లాండ్స్ గెలవడానికి చివరి రెండు ఓవర్లలో 46 పరుగులు అవసరం అయ్యేలా జట్టును నడిపించారు. 19వ ఓవర్ 18 పరుగులు రాబట్టింది, చివరి ఓవర్లో డచ్ జట్టు 28 పరుగులు మాత్రమే చేసింది. శివమ్ దూబే 20వ ఓవర్లో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.
2026 T20 ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలో భారత్‌కు ఇది వరుసగా నాల్గో విజయం. ఇప్పటివరకు టోర్నమెంట్‌లో టీమిండియా అజేయంగా నిలిచింది. ఫిబ్రవరి 22న దక్షిణాఫ్రికాతో తమ తొలి సూపర్ 8 మ్యాచ్ ఆడనుంది.




















