India tour of Australia 2025: వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. టీమ్ ఇండియా ఆస్ట్రేలియాతో 8 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో 3 వన్డేలు, 5 టీ20లు ఉన్నాయి. ఈ రెండు సిరీస్‌ల కోసం మొదట భారత్ జట్టును ప్రకటించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా టీ20, వన్డే సిరీస్‌లకు జట్టును ప్రకటించింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే వన్డే, టీ20 సిరీస్‌ల పూర్తి షెడ్యూల్, మ్యాచ్ సమయాల గురించి తెలుసుకుందాం.
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్
భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. వన్డే సిరీస్ అక్టోబర్ 19న ప్రారంభమై అక్టోబర్ 25 వరకు జరుగుతుంది, ఇందులో మూడు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. అలాగే, అక్టోబర్ 29 నుంచి టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది, ఇది నవంబర్ 8 వరకు కొనసాగుతుంది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాలకు ప్రారంభమవుతాయి.
IND vs AUS వన్డే సిరీస్
- మొదటి వన్డే - అక్టోబర్ 19, పెర్త్
- రెండో వన్డే - అక్టోబర్ 23, అడిలైడ్
- మూడో వన్డే - అక్టోబర్ 25, సిడ్నీ
IND vs AUS టీ20 సిరీస్
- మొదటి టీ20 - అక్టోబర్ 29, కాన్‌బెర్రా
- రెండో టీ20 - అక్టోబర్ 31, మెల్‌బోర్న్
- మూడో టీ20 - నవంబర్ 2, హోబర్ట్
- నాల్గ టీ20 - నవంబర్ 6, గోల్డ్ కోస్ట్
- ఐదో టీ20 - నవంబర్ 8, బ్రిస్బేన్
ODI సిరీస్ కోసం భారతదేశ జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), ప్రసిద్ధ్ కృష్ణ, యశస్వి జైస్వాల్.
T20 సిరీస్ కోసం భారతదేశ జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజు సామ్సన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్.
ODI సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, ట్రావిస్ హెడ్, అలెక్స్ కారీ, కూపర్ కోనోలీ, బెన్ ద్వార్‌షూయిస్, జోష్ ఇంగ్లిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్‌షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.
T20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్‌షూయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమన్, మిచెల్ ఓవెన్, జోష్ హేజిల్‌వుడ్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.