IND VS SL India Prepares For Lanka Pitch:  శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభం కాబోయే టూ-టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కోసం ఇండియన్ టీమ్ యాజమాన్యం స్పెషల్ ప్లాన్ అమల్లోకి తెచ్చింది. కొలంబోలోని నాన్‌డెస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ (NCC) గ్రౌండ్ స్టాఫ్‌కు స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ప్రాక్టీస్ పిచ్ ను టెస్ట్ మ్యాచ్ డే-4 తరహాలో క్రాక్స్ ఉండేలా డిజైన్ చేయించింది. రివర్స్ స్వింగ్, స్పిన్ కి అనుకూలించేలా ఉన్న ఈ పిచ్ పై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆధ్వర్యంలో ప్లేయర్లు ఫుట్‌వర్క్, బ్యాటింగ్ టెక్నిక్స్ పై సీరియస్ గా ప్రాక్టీస్ చేశారు. శ్రీలంక ఎలెవన్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ విన్ అవ్వడంతో కాన్ఫిడెన్స్ తో ఉన్న గిల్ సేన, శ్రీలంక పేస్, స్పిన్ అటాక్స్ రెండింటినీ ఎదుర్కోవడానికి కంప్లీట్ గా ప్రిపేర్ అవుతోంది.

Continues below advertisement

Read Also: Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌! 

నెట్స్ లో గిల్ రివర్స్ స్వింగ్ ప్రాక్టీస్.. ఆకిబ్ నబీ స్పెషల్ బౌలింగ్నెట్ సెషన్ లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ త్రీ-త్రోడౌన్ స్పెషలిస్ట్స్ నువాన్ సెనెవిరత్నే, రాఘవేంద్ర ద్వివేది, దయానంద్ గరానీల బౌలింగ్ ని ఫేస్ చేశాడు. కొత్త, పాత కూకబుర్రా బాల్స్ తో రివర్స్ స్వింగ్ అవుతున్న బాల్స్ ను ఎలా ఆడాలనే దానిపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఆ తర్వాత యంగ్ పేసర్ ఆకిబ్ నబీ బౌలింగ్ లో సెమీ-ఓల్డ్ బాల్స్ తో నెట్స్ లో ఆడాడు. శ్రీలంక గ్రౌండ్లలో పిచ్ స్వభావం వల్ల బాల్ త్వరగా పాడై రివర్స్ స్వింగ్ అవుతుందని గ్రహించి టీమ్ మేనేజ్‌మెంట్ ఈ డెసిషన్ తీసుకుంది.

Continues below advertisement

Read Also: Laxman On Nitish: నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!

ఇండియానే ఫేవరెట్ఇండియన్ టీమ్ ప్రిపరేషన్స్ పై శ్రీలంక మాజీ వేగవంతమైన బౌలర్ ప‌ర్వేజ్ మహరూఫ్ తాజాగా మాట్లాడాడు. "సౌత్ ఆఫ్రికాతో హోమ్ లో ఓడిపోయాక ఇండియన్ బ్యాటింగ్ లైనప్ ప్రెజర్ లో ఉందనే ప్రచారం జరిగింది. కానీ ఈ సిరీస్ కి శ్రీలంక కంటే ఇండియానే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయి వచ్చింది. వెస్టిండీస్ సిరీస్, ఎల్‌పిఎల్ తర్వాత లంక ప్లేయర్లు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండానే డైరెక్ట్ గా టెస్ట్ సిరీస్ ఆడబోతున్నారు. ప్రాపర్ మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల లంక బౌలర్లకు వర్క్‌లోడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇండియా ఆల్రెడీ త్రీ-డే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి ఫుల్ ఫార్మ్ లోకి వచ్చింది" అని విశ్లేషించాడు.

డబ్ల్యూటీసీ పాయింట్ల వేట.. గాలే టెస్ట్ కోసం గిల్ సేన రెడీశ్రీలంక కండిషన్స్ లో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండా గ్రౌండ్ లోకి దిగడం లంక టీమ్ కి మైనస్ అయ్యే ఛాన్స్ ఉందని మహరూఫ్ అభిప్రాయపడ్డాడు. ఫస్ట్ టెస్ట్ ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా స్టార్ట్ కాబోతుండటంతో వర్లడ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్ కోసం ఇండియా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.